ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఇన్ని రోజులకు గుడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఇన్నాళ్లుగా ట్రోల్స్ ఎదుర్కొంటూ, విమర్శలు తీసుకుంటూ అవమానాల పాలైన ఆ టీమ్ ఫ్యాన్స్.. ఇప్పుడు గర్వంగా కాలర్ ఎగరేసుకునే రోజు వచ్చింది. ఐపీఎల్ లో ఆర్సీబీ ఫస్ట్ టైమ్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఆ టీమ్ ఫ్యాన్స్ ‘ఈ సాలా కప్ నమ్దు’ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ సంబరాలను మరింత పెంచేలా ఈ రోజు (జూన్ 4) బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తోంది.
మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ పై గెలిచి ఆర్సీబీ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ విజయంతో బెంగళూరు నగరానికి ట్రోఫీని తీసుకువచ్చిన తమ హీరోలను గౌరవించుకునే అవకాశం ఆర్సీబీ ఫ్యాన్స్ కు దక్కింది. ఆర్సీబీ విక్టరీతో ఆ నగరంలో రాత్రంతా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ సంబరాలు మరో లెవల్ కు చేరబోతున్నాయి. బుధవారం బెంగళూరులో ట్రోఫీతో ఆర్సీబీ ఓపెన్ టాప్ బస్సులో విజయ యాత్ర నిర్వహించనుంది.
టైటిల్ తో బెంగళూరుకు తిరిగొస్తున్న ఆర్సీబీ ఆటగాళ్లను కర్ణాటక ముఖ్యమంత్రి సన్మానించనున్నారు. విధానసౌధాలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియం వరకూ ఓపెన్ టాప్ బస్ లో విక్టరీ పరేడ్ కొనసాగుతుంది. గంటపాటు ఈ విజయోత్సవ ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తారు.
ఆర్సీబీ ఐపీఎల్ 2025 విక్టరీ పరేడ్ బెంగళూరులోని విధానసౌధలో ప్రారంభమై చిన్నస్వామి స్టేడియంలో ముగుస్తుంది.
ఆర్సీబీ ఐపీఎల్ 2025 విక్టరీ పరేడ్ జూన్ 4, 2025 మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని, సాయంత్రం 6 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో జరిగే కార్యక్రమంతో ఈ ఊరేగింపు ముగుస్తుందని సమాచారం.
ఆర్సీబీ ఐపీఎల్ 2025 విక్టరీ పరేడ్ బెంగళూరు నగరం గుండా సాగుతుంది. ప్రజలందరూ ఇందులో పాల్గొనవచ్చు.
ఆర్సీబీ ఐపీఎల్ 2025 విక్టరీ పరేడ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
సంబంధిత కథనం