RCB IPL 2024 : మరో 'బుమ్రా'ను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ.. ఇక బౌలింగ్ కష్టాలు దూరం!
Mahesh kumar RCB net bowler : అచ్చు జస్ప్రీత్ బుమ్రాలా బౌలింగ్ చేస్తున్న ఓ వ్యక్తి.. ఆర్సీబీ నెట్ బౌలింగ్ యూనిట్లో దర్శనమిచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Mahesh kumar RCB : జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్.. ప్రతి టీమ్‌లో ఉండాలని అందరు కోరుకుంటారు. మరీ ముఖ్యంగా.. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బుమ్రా లాంట్ బౌలర్ కచ్చితంగా కావాలి! అనాదిగా ఐపీఎల్ ఆడుతున్నా.. ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్ కొట్టకపోవడానికి కారణం ఆ జట్టు బౌలింగ్ ప్రదర్శన అని అందరికి తెలిసిన విషయమే. ఆర్సీబీ యాజమాన్యం.. బౌలింగ్ యూనిట్‌పై ఫోకస్ చేయాలని అభిప్రాయాలు వెలువడుతున్న సమయంలో... ఓ వీడియో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. బుమ్రా బౌలింగ్ యాక్షన్‌తో.. ఓ వ్యక్తి ఆర్సీబీ నెట్ సెషన్లో బౌలింగ్ చేస్తుండటం ఆ వీడియోలో కనిపించింది. ఆ వ్యక్తి పేరు మహేశ్ కుమార్.
అచ్చు బుమ్రాలాగే బౌలింగ్ చేస్తున్న మహేశ్ కుమార్..
ఆర్సీబీ నెట్ సెషన్‌కి సంబంధించిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో.. నెట్ బౌలర్‌గా ఉన్న మహేశ్ కుమార్.. అచ్చు జస్ప్రీత్ బుమ్రాలాగే బౌలింగ్ వేస్తూ కనిపించాడు. ఇద్దరి బౌలింగ్ యాక్షన్ దాదాపు ఒకే విధంగా ఉండాటన్ని చూసి.. నెటిజన్లు షాక్ అవుతున్నారు.
IPL 2024 updates : ఈ మహేశ్ కుమార్.. 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆర్సీబీ నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. అది కూడా.. వరల్డ్ క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలాగా! మరి మహేశ్ కుమార్‌ని ఆర్సీబీ సానపెడుతుందో లేదో చూడాలి! ఒక వేళ మహేశ్ తన బౌలింగ్‌ని మెరుగుపరుచుకుని.. బుమ్రాలా ప్రదర్శన చేయగలిగితే.. అతడిని ఆర్సీబీ వదులుకోకూడదు. బ్యాటర్లపై కోట్లు కోట్లు ఖర్చు చేసే జట్టు.. మహేశ్‌పై ఫోకస్ చేయాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ముకేశ్ కుమార్ ఆర్సీబీ వీడియోను ఇక్కడ చూడండి..
ఇదీ చూడండి:- IPL 2024 Playoffs scenarios: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు వెళ్లేది ఎవరు? ఆర్సీబీకి ఇంకా ఛాన్స్ ఉందా? ఇక్కడ చూడండి
ఐపీఎల్ 2024లో ఆర్సీబీ..
RCB IPL 2024 : ఐపీఎల్ 2024లో ఆర్సీబీ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది! 10 మ్యాచ్‌లు ఆడి.. మూడింట్లో గెలిచి, 7సార్లు ఓడిపోయిన ఆ జట్టు.. 6 పాయింట్లతో ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్లో చిట్ట చివరి స్థానంలో ఉంది. ఊరటనిచ్చే ఒకే ఒక్క విషయం.. చివరి 2 మ్యాచ్‌లు ఆర్సీబీ గెలవడం. దాదాపు నెల రోజుల తర్వాత గెలుపు బాట పట్టిన డూప్లెసిస్ సేన.. ఇంకా ప్లేఆఫ్ రేస్ నుంచి ఔట్ అవ్వలేదు. అలా అని.. ప్లేఆఫ్‌కు చేరడటం కూడా అంత సులభం కాదు. ఇక్కడి నుంచి ఆర్సీబీ అన్ని మ్యాచ్‌లు గెలవాలి.. మంచి రన్‌రేట్ సంపాదించుకోవాలి, అప్పటికీ. ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది.
మరోవైపు.. ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేస్‌లో టాప్‌లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ. ఆర్సీబీ తరఫున ఈ సీజన్లో ఇప్పటికే 500 రన్స్ సాధించాడు. అంతేకాదు.. స్ట్రైక్ రేట్‌ని కూడా పెంచుకున్నాడు.
సంబంధిత కథనం