Sell RCB: ఆర్సీబీని అమ్మేయండి.. మొత్తం 11 మంది బ్యాటర్లనే ఆడించండి: బెంగళూరు టీమ్‌తో ఆడేసుకుంటున్నారు-rcb team facing criticism from former cricket and tennis players after 6th loss in ipl 2024 to sunrisers hyderabad ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sell Rcb: ఆర్సీబీని అమ్మేయండి.. మొత్తం 11 మంది బ్యాటర్లనే ఆడించండి: బెంగళూరు టీమ్‌తో ఆడేసుకుంటున్నారు

Sell RCB: ఆర్సీబీని అమ్మేయండి.. మొత్తం 11 మంది బ్యాటర్లనే ఆడించండి: బెంగళూరు టీమ్‌తో ఆడేసుకుంటున్నారు

Hari Prasad S HT Telugu
Apr 16, 2024 02:57 PM IST

Sell RCB: ఐపీఎల్ 2024లో ఆర్సీబీ ఆరో ఓటమి తర్వాత మాజీ క్రికెట్, టెన్నిస్ ప్లేయర్స్ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫ్రాంఛైజీని అమ్మేలా చూడాలని మాజీ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి ట్వీట్ చేయడం గమనార్హం.

ఆర్సీబీని అమ్మేయండి.. మొత్తం 11 మంది బ్యాటర్లనే ఆడించండి: బెంగళూరు టీమ్‌తో ఆడేసుకుంటున్నారు
ఆర్సీబీని అమ్మేయండి.. మొత్తం 11 మంది బ్యాటర్లనే ఆడించండి: బెంగళూరు టీమ్‌తో ఆడేసుకుంటున్నారు (ANI )

Sell RCB: ఐపీఎల్ 2024లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఏమాత్రం మారలేదు. ఆడిన ఏడు మ్యాచ్ లలో ఆరు ఓడింది. మరీ సన్ రైజర్స్ చేతుల్లో దారుణ ఓటమితో ఆర్సీబీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ టీమ్ ను అమ్మేసేలా చూడాలని మాజీ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి అంటుండగా.. కోహ్లి తప్ప మిగతా అందరూ బౌలర్లనే దించండి అంటూ మాజీ క్రికెటర్ శ్రీకాంత్ మండిపడ్డాడు.

ఆర్సీబీని అమ్మేయండి ప్లీజ్..

ఆర్సీబీ దుస్థితి చూసి మాజీ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆట కోసం, ఐపీఎల్ కోసం బీసీసీఐ ఈ పని చేయాలని అతడు అనడం గమనార్హం. 12 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన ఈ టెన్నిస్ ప్లేయర్ ఇలాంటి ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

"ఆట కోసం, ఐపీఎల్ కోసం, అభిమానుల కోసం, ప్లేయర్స్ కోసమైనా సరే ఆర్సీబీని కొత్త యజమానికి అమ్మే ప్రయత్నం బీసీసీఐ చేయాలి. ఇతర టీమ్స్ లాగే ఓ స్పోర్ట్స్ ఫ్రాంఛైజీని నిర్మించగలిగే వారికి జట్టును అప్పగించాలి" అని మహేష్ భూపతి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జట్టుపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఇలా ఏకంగా ఇప్పుడున్న యజమాని నుంచి మరో యజమానికి జట్టును అప్పగించేలా చూడాలని కోరడం మాత్రం ఇదే తొలిసారి.

అందరూ బ్యాటర్లనే తీసుకోండి: శ్రీకాంత్

ఇక ఆర్సీబీ ప్రదర్శనతో విసిగిపోయిన మాజీ క్రికెటర్ శ్రీకాంత్ అయితే ఆర్సీబీ జట్టులో అందరూ బ్యాటర్లనే తీసుకోండని, కోహ్లితోనూ బౌలింగ్ చేయించండని సెటైర్ వేయడం విశేషం. "రీస్ టోప్లీని కొడుతున్నారు. లాకీ ఫెర్గూసన్ ను బాదుతున్నారు. ఈ ఐపీఎల్లో అతడు రాణించలేదు.

అతడు కోల్‌కతా నుంచి బెంగళూరుకు వచ్చాడు. విల్ జాక్స్ వాళ్ల బెస్ట్ బౌలర్. అందుకే వాళ్లు మొత్తం 11 మంది బ్యాటర్లనే ఆడించాలి. డుప్లెస్సితో రెండు ఓవర్లు వేయించండి. కామెరాన్ గ్రీన్ 4 ఓవర్లు వేస్తాడు. విరాట్ కోహ్లి 4 ఓవర్లు వేసినా ఇన్ని పరుగులు ఇచ్చేవాడు కాదేమో. కోహ్లి ఓ మంచి బౌలర్. ఒక దశలో కోహ్లిని చూసి జాలేసింది. స్టేడియం బయటికి వెళ్తున్న బంతులను అతడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. బ్యాటింగ్ కు దిగే సమయంలో చాలా ఆవేశంగా వచ్చాడు" అని తన యూట్యూబ్ షోలో శ్రీకాంత్ అన్నాడు.

ప్లేయర్స్‌ను నిందించను

తాను ప్లేయర్స్ ను నిందించను అని ఈ సందర్భంగా శ్రీకాంత్ అన్నాడు. "వాళ్లు మహ్మద్ సిరాజ్ ను పక్కన పెట్టారు. మ్యాక్స్‌వెల్ ను తప్పించారు. కామెరాన్ గ్రీన్ ను రూ.17.5 కోట్లు పెట్టి కొని పక్కన పెట్టారు. అల్జారీ జోసెఫ్ ను రూ.11.5 కోట్లు పెట్టి కొని తప్పించారు. ఆర్సీబీకి, వాళ్లు మేధావులకు హ్యాట్సాఫ్. నేను ప్లేయర్స్ ను నిందించను. నేను కేవలం టీమ్ మేనేజ్‌మెంట్ నే నిందిస్తాను. వేలంలో వాళ్లకు అసలు ఓ ప్లాన్ లేకుండా వెళ్లారు" అని శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వరుస ఓటములతో ఏం చేయాలో తోచని ఆర్సీబీ టీమ్.. ఇప్పటి వరకూ 7 మ్యాచ్ లలో తమ జట్టులోని 20 మంది ప్లేయర్స్ ను ఆడించింది. అయినా ఫలితం లేకపోయింది.

IPL_Entry_Point