Devdutt Padikkal: కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన ఆర్‌సీబీ ప్లేయ‌ర్ - లిస్ట్ ఏ క్రికెట్‌లో హ‌య్యెస్ట్ యావ‌రేజ్ ఇత‌డిదే!-rcb player devdutt padikkal breaks virat kohli highest batting average recode in list a cricket ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Devdutt Padikkal: కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన ఆర్‌సీబీ ప్లేయ‌ర్ - లిస్ట్ ఏ క్రికెట్‌లో హ‌య్యెస్ట్ యావ‌రేజ్ ఇత‌డిదే!

Devdutt Padikkal: కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన ఆర్‌సీబీ ప్లేయ‌ర్ - లిస్ట్ ఏ క్రికెట్‌లో హ‌య్యెస్ట్ యావ‌రేజ్ ఇత‌డిదే!

Nelki Naresh Kumar HT Telugu
Jan 17, 2025 10:23 AM IST

Devdutt Padikkal: టీమిండియా యంగ్ క్రికెట‌ర్ దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ లిస్ట్ ఏ క్రికెట్‌లో అరుదైన రికార్డును నెల‌కొల్పాడు. హ‌య్యెస్ట్ యావ‌రేజ్ క‌లిగిన ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఇన్నాళ్లు కోహ్లి ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అత‌డి రికార్డును దేవ‌ద‌త్ బ్రేక్ చేశాడు.

దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్
దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్

Devdutt Padikkal: లిస్ట్ ఏ క్రికెట్‌లో టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌, ఆర్‌సీబీ ప్లేయ‌ర్ దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ అరుదైన‌ రికార్డ్ క్రియేట్ చేశాడు. కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు. దేశ‌వాళీ క్రికెట్‌లో క‌ర్ణాట‌క‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తోన్నాడు దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్‌. విజ‌య్ హ‌జారే ట్రోఫీలో దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ బ్యాటింగ్ విధ్వంసంతో క‌ర్ణాట‌క ఫైన‌ల్ బెర్తును ఖాయం చేసుకుంది.

86 ప‌రుగులు...

హ‌ర్యానాతో జ‌రిగిన ఫ‌స్ట్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో 86 ప‌రుగుల‌తో రాణించాడు ప‌డిక్క‌ల్‌. అత‌డితో పాటు ర‌విచంద్ర‌న్ స్మ‌ర‌న్ (76 ర‌న్స్‌) అద్భుత బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌త హ‌ర్యానాపై ఐదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన క‌ర్ణాట‌క విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఫైన‌ల్ చేరుకుంది.

31 మ్యాచుల్లోనే...

హ‌ర్యానాతో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్ ద్వారా లిస్ట్ ఏ క్రికెట్‌లో దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ రెండు వేల ప‌రుగుల‌ను పూర్తిచేసుకున్నాడు. కేవ‌లం 31 ఇన్నింగ్స్‌ల‌లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. అత‌డి బ్యాటింగ్ యావ‌రేజ్ 82.52గా ఉండ‌టం గ‌మ‌నార్హం. లిస్ట్ ఏ క్రికెట్‌లో రెండు వేల కంటే ఎక్కువ ప‌రుగులు చేసిన వారిలో హ‌య్యెస్ట్ యావ‌రేజ్ క‌లిగిన ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ రేర్ రికార్డును నెల‌కొల్పాడు. ఈ జాబితాలో ఇప్ప‌టి వ‌ర‌కు 57.05 యావ‌రేజ్‌తో కోహ్లి ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలుస్తూ వ‌చ్చాడు. అత‌డి రికార్డును దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ బ్రేక్ చేశాడు.

కోహ్లి...పుజారా..

కోహ్లి త‌ర్వాత ఛ‌టేశ్వ‌ర్ పుజారా (57.01), రుతురాజ్ గైక్వాడ్ (56.15), పృథ్వీ షా (55.72) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. మొత్తంగా లిస్ట్ ఏ క్రికెట్‌లో 31 మ్యాచ్‌లు ఆడిన దేవ‌ద‌త్ తొమ్మిది సెంచ‌రీలు, 12 హాఫ్ సెంచ‌రీల‌తో 2063 ప‌రుగులు చేశాడు.

తొమ్మిది సెంచ‌రీలు...

ఇప్ప‌టివ‌ర‌కు విజ‌య్ హ‌జారే ట్రోఫీలో 27 మ్యాచులు ఆడిన దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ తొమ్మిది సెంచ‌రీలు చేశాడు. దేవ‌ద‌త్ ఫామ్ దృష్ట్యా అత‌డిని ఛాంపియ‌న్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయాల‌ని అభిమానులు కోరుతున్నారు. టెస్ట్ జ‌ట్టులోకి అత‌డిని తీసుకుంటే బాగుంటుంద‌ని సెలెక్ట‌ర్ల‌కు స‌ల‌హాలు ఇస్తున్నారు.

ఐపీఎల్ వేలంలో ఆర్‌సీబీ అత‌డిని రెండు కోట్ల బేస్ ధ‌ర‌కు సొంతం చేసుకున్న‌ది. మొద‌టిరోజు వేలంలో దేవ‌ద‌త్‌ను కొన‌డానికి ఏ ఫ్రాంచైజ్ ముందుకు రాలేదు. రెండో రోజు వేలంలో ఆర్‌సీబీ అత‌డిని కొనుగోలు చేసింది. టీమిండియా త‌ర‌ఫున ఇప్ప‌టివ‌ర‌కు రెండు టెస్ట్‌లు, రెండు టీ20 మ్యాచులు మాత్ర‌మే ఆడాడు దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్‌.

Whats_app_banner