షాకింగ్.. ఐపీఎల్ 2025లో విన్నర్.. ఇప్పుడేమో అమ్మకానికి ఆర్సీబీ.. ఓనర్లు మారతారా? డీల్ ఎన్ని కోట్లంటే?-rcb owners to sell franchise after winning ipl 2025 trophy sources said whopping rate for deal ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  షాకింగ్.. ఐపీఎల్ 2025లో విన్నర్.. ఇప్పుడేమో అమ్మకానికి ఆర్సీబీ.. ఓనర్లు మారతారా? డీల్ ఎన్ని కోట్లంటే?

షాకింగ్.. ఐపీఎల్ 2025లో విన్నర్.. ఇప్పుడేమో అమ్మకానికి ఆర్సీబీ.. ఓనర్లు మారతారా? డీల్ ఎన్ని కోట్లంటే?

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికి తొలిసారి టైటిల్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆ టీమ్ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో తొక్కిసలాటతో 11 మంది చనిపోయారు. ఇప్పుడేమో ఆ టీమ్ ను అమ్మేయాలని ఓనర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ట్రోఫీతో ఆర్సీబీ (HT_PRINT)

2025 టైటిల్ గెలుచుకున్న వారం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త యజమానులను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీ రిపోర్ట్ ప్రకారం.. ఫ్రాంచైజీ ప్రస్తుత ఓనర్ డియాజియో పీఎల్ సీ సంస్థ పాక్షికంగా లేదా పూర్తిగా ఫ్రాంచైజీని విక్రయించాలని చూస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. జట్టు తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత బ్రాండ్ సాధించిన గరిష్ట స్థాయి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

భారీ రేట్

ఆర్సీబీ వ్యవహారాలను ఇండియాలో డియాజియో ద్వారా యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ చూసుకుంటోంది. ఫ్రాంఛైజీ అమ్మకంపై ఇది ఇప్పటికే పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది. ఫ్రాంచైజీ విలువపై ఇంకా అధికారిక సమాచారం లేనప్పటికీ, పూర్తి అమ్మకానికి యజమానులు 2 బిలియన్ అమెరికా డాలర్లు (సుమారు రూ. 16,834 కోట్లు) వరకు డిమాండ్ చేయవచ్చని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది.

డబ్బు కోసం

బ్రిటిష్ డిస్టిలర్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మాతృ సంస్థ అయిన డియాజియో పిఎల్‌సి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో పాక్షిక లేదా పూర్తి వాటాను విక్రయించడానికి చూస్తోందని సమాచారం. ఇటీవల టైటిల్ గెలుచుకున్న తర్వాత ఈ మద్యం విక్రయ దిగ్గజ కంపెనీ.. ఐపీఎల్ ఫ్రాంఛైజీని అమ్మి డబ్బు ఆర్జించే మార్గాలను అన్వేషిస్తోందని తెలిసింది.

ఆర్సీబీ అమ్మకం వార్త వెలువడగానే యునైటెడ్ స్పిరిట్స్ షేర్ల ధరలు మంగళవారం (జూన్ 10) ఉదయం 3.3% వరకు పెరిగాయి. అయితే, ఫ్రాంచైజీని విక్రయించాలా వద్దా అనేదానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

11 మంది మరణం

ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో విషాదం నెలకొంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటతో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేసింది. 2008లో ఫ్రాంచైజీని మొదట విజయ్ మాల్యా కొనుగోలు చేశారు. ఆయన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమాని, అప్పుడు భారతదేశ మద్యం పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో ఒకరు.

మాల్యా అప్పుల ఊబిలో చిక్కుకోవడంతో అతని సామ్రాజ్యం కూలిపోయింది. దీనితో డియాజియోకు భారతదేశంలోని దాని అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ ద్వారా ఆర్సీబీని కొనుగోలు చేసే అవకాశం లభించింది. ఆర్సీబీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం