భారత స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా చేసిన చిలిపి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, సచిన్ టెండూల్కర్ తనయ సారా మధ్య ఏదో ఉందనే అర్థం వచ్చేలా అశ్విన్ మాట్లాడాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో శుభ్‌మన్ గిల్, సచిన్ గురించి మాట్లాడే సమయంలో అశ్విన్ ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే ఏదో సీక్రెట్ దాగి ఉన్నట్లే కనిపించింది.
తాజా ఎపిసోడ్‌లో అశ్విన్.. గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ పై ఫోకస్ పెట్టాడు. ఆ టీమ్స్ బలాలు, బలహీనతలు విశ్లేషించాడు. ఆ చర్చలోనే అశ్విన్ చేసిన చిలిపి కామెంట్లు వైరలవుతున్నాయి. అటు ముంబయికి సచిన్ మెంటార్ గా ఉండగా.. ఇటు గుజరాత్ కు శుభ్‌మన్ కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే.
యూట్యూబ్ చర్చ సమయంలో జర్నలిస్ట్ విమల్ కుమార్ ముంబయి ఇండియన్స్ డగ్‌అవుట్‌లో మెంటార్‌గా ఉన్న సచిన్ టెండూల్కర్ గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో అశ్విన్ నవ్వుతూ.. "ఒకవైపు సచిన్ టెండూల్కర్ ఉన్నారు, మరోవైపు జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. సరే, మాట్లాడండి" అని అన్నాడు. ఆ వెంటనే కొంటెగా నవ్వాడు. శుభ్‌మన్, సారా గురించి డైరెక్ట్ గా ప్రస్తావించనప్పటికీ అశ్విన్ కామెంట్ వెనుకాల అర్థం అదేనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, సచిన్ డాటర్ సారా టెండూల్కర్ ఎప్పటి నుంచో లవ్ లో ఉన్నారనే ప్రచారం సాగుతూనే ఉంది. వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి. గిల్ సోషల్ మీడియా అకౌంట్లలో సారా మేసేజ్ లో చేసినట్లు.. వీళ్లిద్దరు కలిసి దిగినట్లు ఫేక్ ఫొటోలూ చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు అశ్విన్ కామెంట్స్ శుభ్‌మన్-సారా లవ్ స్టోరీ నిజమే అనే మీనింగ్ ఇస్తున్నాయి.
ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఐపీఎల్ తిరిగి సొంతగూటికే చేరాడు. ఐపీఎల్ కెరీర్ ను సీఎస్కేతో స్టార్ట్ చేసిన అశ్విన్.. ఇప్పుడు 2025 ఐపీఎల్ లో ఆ టీమ్ తరపునే ఆడబోతున్నాడు. సీఎస్కే తమ 2025 సీజన్ టైటిల్ వేటను ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ తో ప్రారంభిస్తుంది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోనే సీఎస్కే గత సీజన్ లో ప్లేఆఫ్స్ చేరలేకపోయింది.
సంబంధిత కథనం