MS Dhoni - Ram Charan: ధోనీని కలిసి రామ్‍చరణ్.. అందుకోసమేనా! వైరల్ అవుతున్న ఫొటో-ram charan met ms dhoni in mumbai photo goes viral on social media ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Ram Charan Met Ms Dhoni In Mumbai Photo Goes Viral On Social Media

MS Dhoni - Ram Charan: ధోనీని కలిసి రామ్‍చరణ్.. అందుకోసమేనా! వైరల్ అవుతున్న ఫొటో

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 04, 2023 03:45 PM IST

MS Dhoni - Ram Charan: దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీని స్టార్ హీరో రామ్‍చరణ్ కలిశారు. ముంబైలో వీరిద్దరూ కలిసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

MS Dhoni - Ram Charan: ధోనీని కలిసి రామ్‍చరణ్.. అందుకోసమేనా! వైరల్ అవుతున్న ఫొటో
MS Dhoni - Ram Charan: ధోనీని కలిసి రామ్‍చరణ్.. అందుకోసమేనా! వైరల్ అవుతున్న ఫొటో

MS Dhoni - Ram Charan: భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్‍లో హిట్ కొట్టారు. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. తాజాగా, ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కలుసుకున్నారు. ఎంఎస్ ధోనీని ముంబైలో రామ్‍చరణ్ నేడు కలిశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ నేడు ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. అక్కడే అయ్యప్ప దీక్షను కూడా విరమించినట్టు తెలిసింది. ఆ తర్వాత రామ్‍చరణ్ ముంబైలో ధోనీని కలిశారు. ఎంఎస్ ధోనీ ఇటీవలే కొత్త హెయిర్ స్టైల్‍కు మారారు. ఆయన కొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఈ లుక్‍లోనే రామ్‍చరణ్‍తో కలిసి ధోనీ ఓ యాడ్‍లో నటించనున్నారట.

ఓ బ్రాండ్‍ కోసం యాడ్ చేసేందుకే ధోనీ, రామ్‍చరణ్ కలిశారని తెలుస్తోంది. ఈ యాడ్ కోసమే ధోనీ లుక్‍ను మార్చుకున్నారని సమాచారం.

దాదాపు 13ఏళ్ల కిందట ధోనీ, రామ్‍చరణ్ కలిసి పెప్సీ కోసం యాడ్ చేశారు. అయితే, అప్పటికన్నా ఇప్పుడు ఈ ఇద్దరి స్టార్‌డమ్ చాలా రెట్లు పెరిగింది. దీంతో ఇప్పుడు వీరిద్దరూ కలిసి యాడ్ చేస్తే సెన్సేషన్‍గా మారనుంది. ఇద్దరి అభిమానులు అమితంగా సంతోష పడే అవకాశం ఉంటుంది. యాడ్‍లో ధోనీ, రామ్‍చరణ్ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‍లో చూసేందుకు వేచిచూస్తున్నామంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ధోనీ, రామ్ చరణ్ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. 

సినిమాల విషయానికి వస్తే.. రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్‍ చేంజర్ మూవీ చేస్తున్నారు. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్ ఆలస్యం కావడంతో రామ్‍చరణ్ ప్రస్తుతం ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈనెలాఖరులో గేమ్ చేంజర్ చిత్రీకరణ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది.

ఇక, మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్‍లో కొనసాగుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు సారథ్యం వహిస్తున్నారు. ధోనీ కెప్టెన్సీలో ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‍ను చెన్నై కైవసం చేసుకుంది. శరీరం సహకరిస్తే వచ్చే ఏడాది ఐపీఎల్ కూడా ఆడతానని మహీ ఇప్పటికే చెప్పారు.

WhatsApp channel