IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‌లో స్టార్‌ప్లేయర్ల కంటే అన్‌క్యాప్‌డ్ క్రికెటర్స్ అంచనాలకు మించి రాణిస్తున్నారు. శశాంక్‌సింగ్, మయాంక్ యాదవ్, అశుతోష్ శర్మ వంటి యంగ్ క్రికెటర్స్ తమ ప్రతిభతో ఓవర్‌నైట్‌లోనే స్టార్స్‌గా మారిపోయారు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి అభిమానులతో పాటు మాజీ క్రికెటర్ల ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే గత ఏడాది కూడా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి మెరుపులు మెరిపించారు కొందరు క్రికెటర్లు. ఆ క్రికెటర్లు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంలో అభిమానులను విస్మయపరుస్తోంది. ఆ క్రికెటర్లు ఎవరంటే?
ఐపీఎల్ 2023లో వెలుగులోకి వచ్చిన యంగ్ క్రికెటర్లలో రాజవర్ధన్ హంగార్గేకర్ ఒకరు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున గత సీజన్ ద్వారా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ క్రికెటర్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ తర్వాత మ్యాచ్‌లో విఫలమైన అతడిని చెన్నై పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ఈ ఏడాది చెన్నై ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన రాజవర్ధన్ హంగార్గేకర్ ఒక్క మ్యాచ్ కూడా అవకాశం మాత్రం దక్కలేదు.
అప్ఘాన్ బ్యాట్స్‌మెన్ రహ్మనుల్లా గుర్భాజ్ కు టీ20ల్లో మంచి రికార్డులు ఉన్నాయి. గత ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున బరిలో దిగిన గుర్భాజ్ 11 మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలతో 227 రన్స్ చేసి సత్తా చాటాడు. అయితే ఈ సారి మాత్రం గుర్భాజ్‌ను కాదని ఫిలిప్ సాల్ట్‌ను కోల్‌కతా యాజమాన్యం సెలెక్ట్ చేసింది. దాంతో గుర్భాజ్ బెంచ్‌కు పరిమితయ్యాడు.
గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో క్రికెట్ అభిమానులను అలరించాడు రైలీ రూసో. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో రూసో 37 బాల్స్‌లోనే 82 రన్స్ చేశాడు. 2023 సీజన్‌లో తొమ్మిది మ్యాచుల్లో 148 స్ట్రైక్ రేట్‌తో 209 రన్స్ చేశాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అతడిని ఐపీఎల్ వేలంలో ఎనిమిది కోట్లకు కొనుగులు చేసింది. అయితే ఇప్పటివరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
గుజరాత్ టైటాన్స్ తరఫున గత సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడిన ఐర్లాండ్ క్రికెటర్ జోష్ లిటిల్ ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. గత సీజన్‌లో లిటిల్ ఏడు వికెట్లు తీసి మెప్పించాడు. పరుగుల్ని కట్టడి చేస్తూ గుజరాత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
వీరితో పాటు మనీష్ పాండే, గ్లెన్ ఫిలిప్స్, మహ్మద్ నబీ, వహిందు హసరంగ వంటి టాలెంటెడ్ క్రికెటర్లు చాలా వరకు బెంచ్‌కే పరిమితయ్యారు.
టాపిక్