Rahul Dravid: ఇషాన్, శ్రేయాస్ విషయంలో మౌనం వీడిన రాహుల్ ద్రవిడ్.. సంతోషాన్నిచ్చేలా కామెంట్స్-rahul dravid comments on ishan kishan shreyas iyer lose bcci contract ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rahul Dravid: ఇషాన్, శ్రేయాస్ విషయంలో మౌనం వీడిన రాహుల్ ద్రవిడ్.. సంతోషాన్నిచ్చేలా కామెంట్స్

Rahul Dravid: ఇషాన్, శ్రేయాస్ విషయంలో మౌనం వీడిన రాహుల్ ద్రవిడ్.. సంతోషాన్నిచ్చేలా కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Rahul Dravid About Ishan Kishan Shreyas Iyer: బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ విషయంలో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఇషాన్, శ్రేయాస్ అభిమానులు సంతోషించేలా ఉన్నాయి.

ఇషాన్, శ్రేయాస్ విషయంలో మౌనం వీడిన రాహుల్ ద్రవిడ్.. సంతోషాన్నిచ్చేలా కామెంట్స్

Rahul Dravid Comments: దాదాపు 10 రోజుల క్రితం శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా దీనికి సంబంధించి మీడియా సమావేశంలో రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే, 2023-24 సీజన్ కోసం ఇషాన్, శ్రేయాస్ అయ్యర్‌ను బీసీసీఐ వార్షిక రిటైనర్ల నుంచి తొలగించింది.

ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు జట్టు నుంచి తన పేరును ఉపసంహరించుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి అతను టీమిండియాలో కనిపించేలేదు. కానీ, ఆఫ్రికా టూర్ నుంచి వైదొలిగిన తర్వాత ఇషాన్‌కు జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ దేశవాళీ క్రికెట్ ఆడమని సలహా ఇచ్చాడు. కానీ, ఇషాన్ రంజీ ఆడేందుకు వెనుకాడాడు. అతనిపాటు ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ తర్వాత శ్రేయాస్ కూడా జట్టు నుంచి వైదొలిగించబడ్డాడు.

ఆ సమయంలో భారత జట్టులో లేని ఆటగాళ్లను రంజీ ట్రోఫీ ఆడాలని బోర్డ్ కార్యదర్శి జై షా ఆదేశించారు. కానీ, ఈ ఇద్దరు ఆటగాళ్లు రంజీ ఆడేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో అసృంతృప్తికి గురైన బీసీసీఐ ఇషాన్, శ్రేయాస్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. ఈ విషయంపై ఇప్పటివరకు రాహుల్ ద్రవిడ్ మాట్లడలేదు. అయితే, ధర్మశాలలో ఇంగ్లాండ్‌తో టెస్ట్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ విలేకరులు సమావేశంలో ఇషాన్, శ్రేయాస్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. దాంతో ఆ ఇద్దరు ఆటగాళ్లు టీమిండియా ప్రణాళికల్లో భాగమేనని రాహుల్ ద్రవిడ్ ఆన్సర్ ఇచ్చారు. జట్టు ప్రణాళికలో తాను ఎప్పుడూ భాగమేనని, దేశవాళీ క్రికెట్‌లో ఆడేవారు ఎప్పుడూ జట్టులో భాగమే అని చెప్పుకొచ్చారు. ఇలా రాహుల్ ద్రవిడ్ చెప్పడంతో ఇషాన్, శ్రేయాస్ అభిమానులు సంతోషపడుతున్నారు.

"ఈ ఇద్దరు ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడంలో నా పాత్ర లేదు. దాని గురించి చర్చించలేదు కూడా. ఏ ఆటగాడికి కాంట్రాక్ట్ దక్కుతుందో నిర్ణయించేది నేను కాదు. దీనిపై బోర్డ్, సెలక్టర్సు నిర్ణయం తీసుకుంటారు. అలాగే నాకు కాంట్రాక్ట్ క్రైటీరియా తెలియదు. 15 మంది ఆటగాళ్ల జట్టును సెలెక్ట్ చేసేటప్పుడు నా అభిప్రాయం మాత్రమే తీసుకుంటారు. అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడి ప్లెయింగ్ ఎలెవన్‌పై నిర్ణయం తీసుకుంటాను. అంతేకాకుండా ఆటగాళ్లకు కాంట్రాక్ట్ ఉందా లేదా అన్నది నా పరిధిలోకి రాదు" అని తేల్చి చెప్పాడు రాహుల్ ద్రవిడ్.