Rahul Dravid: రాహుల్ ద్రావిడ్ కారును ఢీ కొట్టిన ఆటో - ప్రమాదం నుంచి బయటపడ్డ టీమిండియా మాజీ కోచ్
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగళవారం బెంగళూరులో రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తోన్న కారును ఓ ఆటో ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ద్రావిడ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తోన్న కారును ఆటో ఢీ కొట్టినట్లు సమాచారం. మంగళవారం బెంగళూరులో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఆటో డ్రైవర్‌తో రాహుల్ ద్రావిడ్ వాదనకు దిగిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో రాహుల్ ద్రావిడ్‌కు ఎలాంటి గాయాలు కాలేనట్లుగా కనిపిస్తోంది. ఆయన కారు మాత్రం స్వల్పంగా డ్యామేజ్ అయినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది.

బెంగళూరులో...
బెంగళూరులోని కన్నింగ్‌హమ్ రోడ్డులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తన కారుకు జరిగిన డ్యామేజ్‌ను చూపిస్తూ ఆటో డ్రైవర్‌తో రాహుల్ ద్రావిడ్ కోపంగా మాట్లాడుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. కన్నడ భాషలోనే డ్రైవర్‌తో ద్రావిడ్ మాట్లాడారు. అయితే ఈ యాక్సిడెంట్‌కు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కానట్లు తెలిసింది. ఈ ప్రమాదానికి సంబంధించి తప్పు రాహుల్ ద్రావిడ్‌దా? లేదంటే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా వచ్చి ద్రావిడ్ కారుకు యాక్సిడెంట్ చేశాడా అన్నది తెలియరాలేదు.
హెడ్ కోచ్‌గా...
టీమిండియా 2021 నుంచి 2024 వరకు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పనిచేశాడు. టీ20 వరల్డ్ కప్‌తో కోచ్‌గా ద్రావిడ్ పదవీ కాలం ముగిసింది. టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేసినందుకు ఏటా పన్నెండు కోట్లకుపైనే ద్రావిడ్ రెమ్యునరేషన్ అందుకున్నాడు. ద్రావిడ్ మార్గదర్శనంలోనే టీమిండియా మూడు ఫార్మెట్లలో నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని చరిత్రను సృష్టించింది.
ద్రావిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్‌ను బీసీసీఐ సెలెక్ట్ చేసింది. ఐపీఎల్‌లోకి ద్రావిడ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా పనిచేయబోతున్నాడు. గతంలో ఇదే టీమ్‌కు కోచ్‌గా చాలా కాలం పాటు పనిచేశారు.
దిగ్గజ ఆటగాళ్లలో ఒకరిగా…
టీమిండియా దిగ్గజ ఆటగాళ్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు ద్రావిడ్. టీమిండియా తరఫున 164 టెస్ట్‌లు, 344 వన్డేలు ఆడాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో, వన్డేల్లో హయ్యెస్ట్ రన్స్ చేసిన క్రికెటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.
టాపిక్