Rahkeem Cornwall: 45 బాల్స్‌లోనే సెంచరీ చేసిన క్రికెట్ బాహుబలి రఖీమ్ కార్నివాల్ - 12 సిక్సర్లతో రప్ఫాడించాడు
Rahkeem Cornwall: కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో క్రికెట్ బాహుబలి రఖీమ్ కార్నివాల్ 45 బాల్స్‌లోనే సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 12 సిక్స్‌లు కొట్టాడు కార్నివాల్.
Rahkeem Cornwall: క్రికెట్ బాహుబలిగా పేరు తెచ్చుకున్న రఖీమ్ కార్నివాల్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో 45 బాల్స్‌లోనే సెంచరీ సాధించాడు. సిక్సర్ల మోత మోగించిన కార్నివాల్ ఈ మ్యాచ్ లో ఏకంగా 12 సిక్స్‌లు కొట్టాడు. కరేబియన్ లీగ్‌లో అత్యంత వేగంగాసెంచరీ సాధించిన క్రికెటర్లలో ఒకడిగా రఖీమ్ కార్నివాల్ నిలిచాడు.
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్, బార్బడోస్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది.
రూథర్‌ఫోర్డ్ 27 బాల్స్‌లోనే ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 67 రన్స్ చేశాడు. అతడితో పాటు ఫ్లెచర్ 56 రన్స్, స్మీడ్ 63 పరుగులతో రాణించారు. కార్నివాల్ దంచికొట్టడంతో బార్బడోస్ రాయల్స్ మరో రెండు ఓవర్లు మిగిలుండగానే భారీ టార్గెట్‌ను ఛేదించింది.
12 సిక్సర్లు…
తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ నుంచే ఎదురుదాడికి దిగాడు కార్నివాల్. కేవలం 45 బాల్స్‌లోనే 12 సిక్సర్లు, 4 ఫోర్లతో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. సెంచరీ అనంతరం రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. సెంచరీ పూర్తి చేసుకున్న బ్యాట్‌ను వదిలిపెట్టి డిఫరెంట్‌గాసెలబ్రేషన్స్ చేసుకున్నాడు కార్నివాల్. అతడి సెలబ్రేషన్స్ తాలూకు వీడియో వైరల్‌గా మారింది.
కార్న్‌వాల్‌తో పాటు రొమన్ పావెల్ కూడా 49 పరుగులతో రాణించడంతో బార్బడోస్ రాయల్స్ 18.1 ఓవర్లలోనే 221 పరుగులు చేసింది. సెంచరీతో పాటు బౌలింగ్‌లోనూ రాణించాడు కార్నివాల్. రెండు వికెట్లు తీసుకొని ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు.
టాపిక్