Quinton De Kock: వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన డికాక్ - ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సెకండ్ హ‌య్యెస్ట్ స్కోర‌ర్ అత‌డే!-quinton de kock announces retirement from odi cricket ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Quinton De Kock: వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన డికాక్ - ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సెకండ్ హ‌య్యెస్ట్ స్కోర‌ర్ అత‌డే!

Quinton De Kock: వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన డికాక్ - ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సెకండ్ హ‌య్యెస్ట్ స్కోర‌ర్ అత‌డే!

Quinton De Kock: సౌతాఫ్రికా స్టార్ ప్లేయ‌ర్ క్వింట‌న్ డికాక్ వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో సౌతాఫ్రికా ఓట‌మి కార‌ణంగానే వ‌న్డేల‌కు డికాక్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

క్వింట‌న్ డికాక్

Quinton De Kock: సౌతాఫ్రికా స్టార్ క్రికెట‌ర్, వికెట్ కీప‌ర్‌ క్వింట‌న్ డికాక్ వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. గురువారం జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైన‌ల్‌లో ఆస్ట్రేలియా చేతిలో సౌతాఫ్రికా పోరాడి ఓడింది. సౌతాఫ్రికా ఓట‌మితోనే డికాక్ వన్డేలకు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నాలుగు సెంచ‌రీల‌తో రాణించాడు డికాక్‌. 10 మ్యాచుల్లో 594 ర‌న్స్ చేసినా డికాక్… కోహ్లి త‌ర్వాత సెకండ్ హ‌య్యెస్ట్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఫుల్ ఫామ్‌లో ఉన్న అత‌డు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌డం క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌దేళ్ల వ‌న్డే కెరీర్‌లో 155 మ్యాచ్‌లు ఆడిన డికాక్ 6770 ర‌న్స్ చేశాడు. 21 సెంచ‌రీలు, 30 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. 2013లో జ‌న‌వ‌రి 19న న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్ ద్వారా డికాక్ వ‌న్డే కెరీర్ ప్రారంభ‌మైంది. అయితే తన రిటైర్‌మెంట్ పై వరల్డ్ కప్ కు ముందే ప్రకటన చేశాడు డికాక్. టీ20 లీగ్ లలో ఆడటం కోసమే డికాక్ రిటైర్‌మెంట్ ప్రకటించినట్లు అతడిపై విమర్శలు వినిపించాయి.

వన్డేలకు దూరమైన డికాక్ టీ 20ల్లో కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. డికాక్ రిటైర్‌మెంట్‌పై సౌతాఫ్రికా కెప్టెన్ బ‌వుమా ఎమోష‌న‌ల్‌గా రియాక్ట్ అయ్యాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచి డికాక్‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌కాల‌ని అనుకున్నామ‌ని, కానీ ఆ క‌ల తీర‌లేద‌ని బ‌వుమా తెలిపాడు. డికాక్ రిటైర్‌మెంట్‌తో లెజెండ‌రీ సేవ‌ల‌ను సౌతాఫ్రికా జ‌ట్టు కోల్పోయింద‌ని తెలిపాడు.