T20 Cricket: టీమిండియా తరఫున ఒకే టీ20 మ్యాచ్ ఆడి ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన క్రికెటర్లు వీళ్లే!
T20 Cricket: పృథ్వీ షా టీమిండియా తరఫున ఇప్పటివరకు ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడాడు.ఆ తర్వాత జట్టులో మళ్లీ కనిపించలేదు. పృథ్వీ షా మాదిరిగానే ఒకే ఒక్క టీ20 మ్యాచ్ మాత్రమే ఆడి ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయిన క్రికెటర్లు ఎవరంటే?
టీమిండియా తరఫున ఆడాలని, జట్టులో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలని ప్రతి క్రికెటర్ కలలు కంటుంటాడు. కానీ కొందరు మాత్రమే ఆ కలలను సాకారం చేసుకుంటారు. టీమిండియాలో చోటు దక్కాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు. అదృష్టం కూడా కలిసిరావాలి. టన్నుల కొద్ది టాలెంట్ ఉండి...కూడా నేషనల్ టీమ్ తరఫున ఒక్క టీ20 మ్యాచ్ ఆడి ఆ తర్వాత కనిపించకుండా పోయిన క్రికెటర్లు చాలానే ఉన్నారు.

పృథ్వీ షా...
గత కొన్నాళ్లుగా పృథ్వీషా తరచుగా వార్తల్లో నిలుస్తోన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పృథ్వీ షా ను ఏ ఫ్రాంచైజ్ కొనలేదు. అన్‌సోల్డ్ ప్లేయర్స్‌లో ఒకరిగా పృథ్వీ షా నిలిచాడు. ఫామ్ లేమి కారణంగా రంజీ టీమ్‌లో చోటు కోల్పోయాడు. టీమిండియా తరఫున పృథ్వీ షా ఇప్పటివరకు ఐదు టెస్ట్‌లు, ఆరు వన్డేలతో పాటు ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడాడు.
2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు పృథ్వీ షా. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బాల్‌కే డకౌట్ అయ్యాడు. దాంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ టీ20 టీమ్‌లో పృథ్వీ షా కనిపించలేదు.
మయాంక్....
ఆల్‌రౌండర్ మయాంక్ మార్కండే ఐపీఎల్‌లో ఇప్పటివరకు 37 మ్యాచ్‌లు ఆడి 37 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఏడాది కోల్‌కతా తరఫున బరిలోకి దిగబోతున్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో మెరుపులు మెరిపించిన మయాంక్ ఇప్పటివరకు టీమిండియా తరఫున ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. విశాఖపట్నం వేదికగా 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో మయాంక్‌కు చోటు దక్కింది. అరంగేట్రం మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 31 రన్స్ ఇచ్చిన మయాంక్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఆ తర్వాత ఏ ఫార్మెట్‌లో అతడికి మళ్లీ అవకాశం దక్కలేదు.
అన్‌సోల్డ్ ప్లేయర్...
సందీప్ వారియర్... టీమిండియాలో టాప్ ఫైవ్ పేసర్లలో ఒకరిగా నిలుస్తాడంటూ మాజీల ప్రశంసలు అందుకున్నాడు. కానీ కట్ చేస్తే ఒకే ఒక్క టీ20 మ్యాచ్‌తో అతడి కెరీర్ ముగిసింది. 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసి 23 రన్స్ ఇచ్చిన సందీప్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడింది. ఆ తర్వాత సందీప్ మళ్లీ టీమిండియాలో కనిపించలేదు. ఐపీఎల్ 2025 వేలంలో సందీప్‌ను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు.
టాపిక్