Champions Trophy: భారత్ వర్సెస్ పాకిస్థాన్.. వీఐపీ టికెట్లు అమ్మేసిన పీసీబీ చీఫ్.. స్టాండ్స్ లో నుంచే మ్యాచ్!-pcb chairman mohsin naqvi sells vip tickets rs 94 lakh for funds india vs pakistan match champions trophy 2025 dubai ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Champions Trophy: భారత్ వర్సెస్ పాకిస్థాన్.. వీఐపీ టికెట్లు అమ్మేసిన పీసీబీ చీఫ్.. స్టాండ్స్ లో నుంచే మ్యాచ్!

Champions Trophy: భారత్ వర్సెస్ పాకిస్థాన్.. వీఐపీ టికెట్లు అమ్మేసిన పీసీబీ చీఫ్.. స్టాండ్స్ లో నుంచే మ్యాచ్!

Chandu Shanigarapu HT Telugu
Published Feb 17, 2025 10:26 PM IST

Champions Trophy: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోసిన్ నఖ్వీ తనకు కేటాయించిన వీఐపీ టికెట్లు అమ్ముకున్నాడు. పాక్ వర్సెస్ ఇండియా పోరును అతను స్టాండ్స్ లో నుంచి చూడబోతున్నాడు. వచ్చిన రూ.94 లక్షలను పీసీబీ ఫండ్స్ కోసం వాడబోతున్నారు.

వీఐపీ టికెట్లను అమ్మేసిన పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ
వీఐపీ టికెట్లను అమ్మేసిన పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ (AFP)

భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ టికెట్లకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ మ్యాచ్ ను స్టేడియంలో ప్రత్యక్షంగా చూడటం కోసం ప్రజలు ఎగబడతారు. ఒక్కటంటే ఒక్క టికెట్ కోసం పెద్ద పోరాటమే చేస్తారు. ఈ డిమాండ్ ను వాడుకొని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ తన వీఐపీ టికెట్లను అమ్మేశాడు.

వీఐపీ బాక్స్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగబోతోంది. దీంతో పాటు ఇక్కడ జరిగే ఇతర మ్యాచ్ లు చూసేందుకు 30 సీటింగ్ కెపాసిటీ ఉన్న వీఐపీ హాస్పిటల్ బాక్స్ ను మోసిన్ కు ఇచ్చారని పాకిస్థాన్ మీడియా తెలిపింది. తనతో పాటు కుటుంబం, గెస్ట్ ల కోసం ఈ బాక్స్ ను మోసిన్ కు కేటాయించారు.

రూ.94 లక్షలు

తన కోసం కేటాయించిన వీఐపీ బాక్స్ టికెట్లను మోసిన అమ్ముకున్నారని పాకిస్థాన్ మీడియా తెలిపింది. రూ.94 లక్షలకు వీటిని విక్రయించారని తెలిసింది. ఈ డబ్బును పీసీబీ ఫండ్ గా జమ చేస్తారని సమాచారం. వీఐపీ టికెట్లను అమ్మేసుకున్న మోసిన ఫ్యాన్స్ తో కలిసి నార్మల్ స్టాండ్స్ నుంచే మ్యాచ్ చూడబోతున్నాడు.

ఫ్యాన్స్ మధ్యలో నుంచే మ్యాచ్ చూస్తానని ఐసీసీ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు మోసిన్ సమాచారం ఇచ్చారని తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 23న జరిగే భారత్, పాక్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Chandu Shanigarapu

eMail
Whats_app_banner

సంబంధిత కథనం