Pat Cummins: ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను ఇరవై కోట్ల యాభై లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకున్నది. రెండు కోట్ల బేస్ ప్రైస్‌లో వేలంలోకి వచ్చిన పాట్ కమిన్స్‌ను కొనేందుకు అన్ని ఫ్రాంచైజ్‌లు పోటీపడ్డాయి. చివరకు కమిన్స్‌ను భారీ ధరకు సన్‌రైజర్స్ దక్కించుకున్నది. ఇటీవలే ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన కమిన్స్‌కు 2024 లో ఐపీఎల్ సారథ్య బాధ్యతల్ని అప్పగించేందుకు సన్‌రైజర్స్ రెడీ అవుతోంది.
కాగా పాట్ కమిన్స్‌ను ఇరవై కోట్లకు సన్‌రైజర్స్ కొనడంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జాసన్ గెలెస్పీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కమిన్స్ టెస్ట్ బౌలర్ అని, టీ20 ఫార్మెట్‌కు అతడు అంతగా పనికిరాడని తెలిపాడు. పాట్ కమిన్స్ ప్రతిభావంతుడైన క్రికెటర్. అతడి బౌలింగ్ నైపుణ్యం అద్భుతం. అంతకుమించి గొప్ప కెప్టెన్ అని గెలెస్పీ అన్నాడు. అయితే అతడి ప్రతిభాసామర్థ్యాలు ఎక్కువగా టెస్ట్ క్రికెట్‌కు పనికొచ్చాలా ఉన్నాయని, టీ20లకు అంతగా పనికిరాడని గెలెస్పీ కామెంట్స్ చేశాడు.
టీ20ల్లో కమిన్స్ గొప్పగా రాణించిన దాఖలాలు లేవని చెప్పాడు. టెస్ట్ క్రికెట్ కమిన్స్‌కు పేరుప్రఖ్యాతులు తీసుకురావడమే కాకుండా క్రికెటర్‌గా నిలబెట్టిందని గెలెస్పీ కామెంట్స్ చేశాడు. గెలెస్సీ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఐపీఎల్‌లో స్టార్క్ తర్వాత అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా కమిన్స్ రికార్డు నెలకొల్పాడు.