Pakistan Super League: పాకిస్థాన్ సూపర్ లీగ్ పని అయిపోయినట్లేనా.. మొహం చాటేస్తున్న స్టార్ ప్లేయర్స్-pakistan super league star international cricket players not turning up for the league telugu cricket news ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Pakistan Super League Star International Cricket Players Not Turning Up For The League Telugu Cricket News

Pakistan Super League: పాకిస్థాన్ సూపర్ లీగ్ పని అయిపోయినట్లేనా.. మొహం చాటేస్తున్న స్టార్ ప్లేయర్స్

Hari Prasad S HT Telugu
Feb 13, 2024 03:18 PM IST

Pakistan Super League: పాకిస్థాన్ సూపర్ టీమ్ నుంచి పలువురు స్టార్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తప్పుకుంటున్నారు. ఇతర లీగ్స్ ఉండటమో లేక క్రికెట్ బోర్డులు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.

పాకిస్థాన్ సూపర్ లీగ్ సీజన్ 9 ట్రోఫీ ఆవిష్కరణ
పాకిస్థాన్ సూపర్ లీగ్ సీజన్ 9 ట్రోఫీ ఆవిష్కరణ

Pakistan Super League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు పోటీగా, అంతకంటే పెద్దగా నిర్వహిస్తామంటూ వచ్చిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) అప్పుడే చిక్కుల్లో పడింది. ఈ లీగ్ కు స్టార్ ప్లేయర్స్ మొహం చాటేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి లీగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇందులో ఆరు ఫ్రాంఛైజీలూ కీలకమైన ప్లేయర్స్ సేవలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.

ట్రెండింగ్ వార్తలు

పీఎస్ఎల్‌కు ఎందుకీ పరిస్థితి?

ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్స్ వచ్చాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక, కరీబియన్ దీవులు, యూఏఈ, సౌతాఫ్రికాలాంటి దేశాల్లో లీగ్స్ జరుగుతున్నాయి. అలాగే పాకిస్థాన్ సూపర్ లీగ్ కూడా ప్రారంభమైంది. కానీ ప్రస్తుతం పీఎస్ఎల్ సమయంలోనే మరో లీగ్ ఉంటే ప్లేయర్స్ అటు వైపు చూస్తుండటం.. ఇలా దేశవాళీ టీ20 టోర్నీల్లో ఆడేందుకు ఆయా క్రికెట్ బోర్డులు అనుమతి ఇవ్వకపోవడంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి స్టార్ ప్లేయర్స్ దూరమవుతున్నారు.

పీఎస్ఎల్ ను కాదని చాలా మంది ప్లేయర్స్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, ఐఎల్‌టీ20, ఎస్ఏ20 వంటి వాటికి వెళ్తుండటం గమనార్హం. ఈ లీగ్ లోని ముల్తాన్ సుల్తాన్స్ టీమ్ ఇప్పటికే ఇలా ఎంతో మంది ప్లేయర్స్ ను కోల్పోయింది. తాజాగా ఇంగ్లండ్ పేస్ బౌలర్ రీస్ టోప్లీ గాయం కారణంగా ఆడటం లేదు. అతనికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం లేదని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

పాకిస్థాన్ సూపర్ లీగ్ పనైపోయినట్లేనా?

నిజానికి ఇంగ్లండ్ బోర్డే కాదు పలు ఇతర క్రికెట్ బోర్డులు కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం తమ ప్లేయర్స్ కు ఎన్వోసీలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఇలా పెషావర్ జల్మీ టీమ్ సౌతాఫ్రికా ప్లేయర్ లుంగి ఎంగిడి సేవలను, క్వెట్టా గ్లాడియేటర్స్ టీమ్ శ్రీలంక ప్లేయర్ వానందు హసరంగా సేవలను కోల్పోయాయి. ఇక వెస్టిండీస్ కు చెందిన షాయ్ హోప్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హుస్సేన్, సౌతాఫ్రికాకు చెందిన తబ్రేజ్ షంసీ, రాసీ వాండెర్ డుసెన్, ఇంగ్లండ్ ప్లేయర్ జేమ్స్ విన్స్, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్స్ నూర్ అహ్మద్, నవీనుల్ హక్ లాంటి వాళ్లు ఈ ఏడాది మొత్తం లీగ్ కు దూరమయ్యారు.

దీంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ పనైపోయినట్లేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లీగ్ నిర్వహిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరో సమయంలో టోర్నీ నిర్వహిస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉంది. ప్రస్తుతం మూడు లీగ్స్ జరుగుతుండటంతో వాటిని కాదని ప్లేయర్స్ తమ దగ్గరికి రాకపోవడంతో ఈ దిశగా ఆలోచన చేస్తున్నారు.

ఒక దశలో ఐపీఎల్ కు తమ పీఎస్ఎల్ ఛాలెంజ్ చేస్తుందన్న రేంజ్ లో అక్కడి ప్లేయర్స్, బోర్డు సభ్యులు మాట్లాడారు. తీరా చూస్తే ఐపీఎల్లో టాప్ ప్లేయర్స్ కు లభిస్తున్న ఆదాయంలో పదో వంతు కూడా వాళ్ల లీగ్ లో ఉండటం లేదు. దీంతో మెల్లగా చాలా మంది ప్లేయర్స్ ఈ లీగ్ ను కాదని మిగతా లీగ్స్ వైపు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

IPL_Entry_Point