rachin ravindra injury: ఫ్లడ్ లైట్స్ బాగానే ఉన్నాయంటా.. రచిన్ దే తప్పంటా.. పాక్ మాజీ కెప్టెన్ వింత వ్యాఖ్యలు
rachin ravindra injury: పాకిిస్థాన్ తో తొలి వన్డేలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర ముఖంపై సీరియస్ ఇంజూరీ కావడంతో క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడింది. ఫ్లడ్ లైట్స్ అందుకు కారణమంటున్నారు. కానీ పాకిస్థాన్ మాత్రం తప్పును రచిన్ మీదకే తోసేస్తోంది.

ట్రై సిరీస్ లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ తొలి వన్డేలో రచిన్ రవీంద్రకు తీవ్రమైన గాయమైంది. గడాఫీ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్ లో రచిన్ క్యాచ్ అందుకునే క్రమంలో ఫ్లడ్ లైట్ల కారణంగా బంతి కనిపించలేదు. గాల్లో నుంచి స్పీడ్ గా దూసుకొచ్చిన బాల్ రచిన్ ముఖంపై బలంగా పడింది. దీంతో అతనికి చాలా బ్లడ్ వచ్చింది. రక్తం కారుతుండగా ఓ వైట్ క్లాత్ అడ్డుపెట్టుకుని రచిన్ స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. రచిన్ నుదుటిపై గాయమైందని, దీనికి కుట్లు వేశారని న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది.
రచిన్ దే తప్పు
రచిన్ గాయం విషయంలో అందరూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను తప్పు పడుతున్నారు. ఫ్లడ్ లైట్స్ సరిగా లేవని అందుకే రచిన్ కు గాయమైందని అంటున్నారు. కొత్తగా రినోవేషన్ చేసిన గడాఫీ స్టేడియంలో ఏర్పాట్లు కరెక్ట్ గా లేవని విమర్శిస్తున్నారు. దీంతో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీని అక్కడి నుంచి తరలించాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు తప్పంతా రచిన్ పై నెట్టేందుకు పాక్ సిద్ధమైంది.
అతని కాలు జారొచ్చు
రచిన్ మిస్టేక్ కారణంగానే అతనికి గాయమైందని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అన్నాడు. ‘‘ఇవి కొత్త ఎల్ఈడీ లైట్లు. బాగానే పనిచేస్తున్నాయి. 150 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతులకు కివీస్ బ్యాటర్లు సిక్సర్లు కొట్టినప్పుడు లైట్స్ బాగానే పనిచేశాయి కదా. బంతిని మిస్ జడ్జ్ చేయడం వల్లే రచిన్ గాయపడ్డాడు. అతని కాలు జారొచ్చు’’ అని లోకల్ న్యూస్ ఛానెల్ లో బట్ మాట్లాడాడు.
కటక్ ను మెన్షన్ చేస్తూ
తప్పును కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ అందుకు భారత్ లోని కటక్ స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ ఫెయిల్యూర్ నూ వాడుకుంటోంది. ఇంగ్లండ్, భారత్ రెండో వన్డేలో ఫ్లడ్ లైట్స్ ఫెయిల్ అయ్యాయని, క్రికెట్లో ఇలా జరుగుతుంటాయని పాక్ మీడియా రాసుకొస్తోంది. మరో పాక్ ఎక్స్ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ మాత్రం పీసీబీని విమర్శించాడు. ‘‘రచిన్ రవీంద్ర సంఘటనకు ముందు, డారిల్ మిచెల్ కూడా బంతిని గుర్తించడంలో ఇబ్బంది పడ్డాడు. ఫ్లడ్ లైట్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది’’ అని తన్వీర్ పేర్కొన్నాడు.
సంబంధిత కథనం