గ్రౌండ్ లో పర్ఫార్మెన్స్ చూపలేకపోయిన పాకిస్థాన్ టీమ్.. ఫ్యాన్స్ పై మాత్రం ఆగ్రహం చూపించింది. రన్స్ కొట్టలేకపోయిన ఆ టీమ్.. ఫ్యాన్స్ ను కొట్టడానికి మాత్రం రెడీ అయిపోయింది. శనివారం (ఏప్రిల్ 5) మౌంట్ మౌంగనుయిలోని బే ఓవల్ మైదానంలో పాకిస్థాన్ క్రికెటర్లు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. అభిమానులపై దాడికి ప్రయత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది క్రికెటర్లను లాగి పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆల్ రౌండర్ ఖుష్దీల్ షా ఊగిపోయాడు.
న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్థాన్ టీమ్ దారుణ ప్రదర్శన చేసింది. టీ20 సిరీస్ ను 1-4తో కోల్పోయిన ఆ టీమ్.. వన్డే సిరీస్ లో 0-3తో వైట్ వాష్ కు గురయ్యారు. ఈ సిరీస్ సాంతం పాక్ క్రికెటర్ల పర్ఫార్మెన్స్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆ ఆటగాళ్లను ఫ్యాన్స్ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ టీమ్ ప్రదర్శన కూడా అలాగే ఉంది.
శనివారం న్యూజిలాండ్ తో చివరిదైన మూడో వన్డేలోనూ పాకిస్థాన్ చిత్తయింది. దీంతో ఫ్యాన్స్ మరోసారి పాక్ ఆటగాళ్లపై విమర్శలు చేశారు. దీంతో పాక్ ఆటగాళ్లు తట్టుకోలేకపోయారు. సెన్స్ మరిచిపోయారు. ముఖ్యంగా ఖుష్దీల్ షా ఫ్యాన్స్ మీదకు పరుగెత్తాడు. దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కోపంతో ఊగిపోయాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఖుష్దీల్ షాను లాగి పడేశారు. గ్రౌండ్ ఆడమంటేనేమో సైలెంట్ గా ఉండే పాక్ ఆటగాళ్లు.. ఫ్యాన్స్ పై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారనే ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఖుష్దీల్ ఎందుకు ఆగ్రహంగా ప్రవర్తించాడో తెలియదు.
ఈ ఘటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చింది. విదేశీ ప్రేక్షకులు ఆటగాళ్లపై అవమానకరమైన మాటలు అన్నారని పేర్కొంది. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు విన్న తర్వాత ఖుష్దీల్ కోపంతో ఊగిపోయాడని తెలిపింది.
"విదేశీ ప్రేక్షకులు జాతీయ ఆటగాళ్లపై అవమానకరమైన భాషను ఉపయోగించడాన్ని పాకిస్తాన్ క్రికెట్ జట్టు యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. నేటి మ్యాచ్‌లో, విదేశీ ప్రేక్షకులు మైదానంలో ఉన్న క్రికెటర్లపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు." అని పీసీబీ తెలిపింది.
"పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు వచ్చినప్పుడు, క్రికెటర్ ఖుష్దీల్ షా జోక్యం చేసుకుని ప్రేక్షకులను ఆపమని కోరాడు. కానీ అఫ్గాన్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోచారు. పాకిస్తాన్ జట్టు ఫిర్యాదు చేసిన తర్వాత, స్టేడియం అధికారులు జోక్యం చేసుకుని ఇద్దరు అల్లర్ల కల్గించిన ప్రేక్షకులను బయటకు పంపించారు" అని ప్రకటనలో పీసీబీ పేర్కొంది.
చివరి వన్డేలో పాకిస్తాన్ 43 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. మహమ్మద్ రిజ్వాన్ అండ్ కో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. బాబర్ ఆజం 50, రిజ్వాన్ 37 పరుగులు చేసి జట్టును పోటీలో ఉంచారు. అయితే, ఈ ఇద్దరి వికెట్లు కోల్పోయిన తర్వాత, మరే ఇతర బ్యాట్స్‌మన్ కూడా రాణించలేకపోయాడు. చివరికి కివీస్ 3-0తో సిరీస్‌ను గెలుచుకుంది. ఖుష్దీల్ షా ఈ మూడో వన్డేలో ఆడలేదు.
సంబంధిత కథనం