Jasprit Bumrah: ఫాహీన్ అఫ్రిది కంటే బుమ్రానే బెస్ట్ బౌలర్ అని పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ కామెంట్స్ చేశాడు. గాయంతో ఏడాది పాటు జట్టుకు దూరమైన బుమ్రా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో అదరగొట్టాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో నాలుగు టెస్టుల్లోనే 19 వికెట్లు తీసుకున్నాడు బుమ్రా. అశ్విన్ (26 వికెట్లు), హర్ట్ లీ(22 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసుకున్న మూడో బౌలర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా బుమ్రా నిలిచాడు. జేమ్స్ అండర్సన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కూడా బుమ్రాకు పోటీ ఇవ్వలేకపోయాడు.
కాగా పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది, టీమిండియా పేసర్ బుమ్రాలలో ఎవరూ బెస్ట్ అనే విషయంలో చాలా కాలంగా క్రికెట్ ఫ్యాన్స్ మధ్య చాలా వాదనలు జరుగుతూనే ఉన్నాయి. బుమ్రానే బెస్ట్ అని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ చెబుతోండగా..షాహీన్ అత్యుత్తమ పేసర్ అంటూ పాకిస్థాన్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. బుమ్రా, షాహీన్ విషయంలో మరోసారి క్రికెట్ ఫ్యాన్స్ వార్ మొదలైంది. ఈ కంపేరిజన్స్‌పై పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
గాయం తర్వాత కూడా బుమ్రా పేస్, వైవిధ్యతతో ఎలాంటి మార్పు లేదు. బుమ్రా బౌలింగ్‌లో పదను ఏ మాత్రం తగ్గలేదు. గాయం అతడి ఆటతీరుపై పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. కానీ షాహిన్ విషయంలో ఆ విధంగా జరగలేదు. మోకాలి గాయం తర్వాత షాషీన్ పేస్ లయ మొత్తం దెబ్బతిన్ననది. మునుపటి వేగం కనిపించడం లేదు. రీఎంట్రీ తర్వాత అతడి ఆట తీరు ఏమంత గొప్పగా లేదు. షాహిన్‌తో పోలిస్తే బుమ్రానే బెస్ట్ బౌలర్ అని నా అభిప్రాయం అని మహమ్మద్ ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
బుమ్రా, షాహిన్ అఫ్రిది కంపేరిజన్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం బుమ్రాకు పోటీ ఇచ్చే బౌలర్ వరల్డ్ క్రికెట్‌లోనే లేడని అన్నాడు. బుమ్రాకు షాహీన్‌తో పోలికే లేదని చెప్పాడు. షాహీన్ కంటే సిరాజ్ నాణ్యమైన బౌలర్ అని హర్భజన్ అన్నాడు.
షాహిన్ కంటే వికెట్లు తీసే నైపుణ్యం, లైన్ అండ్ లెంగ్త్ విషయంలో సిరాజ్ ప్రతిభ అమోఘమని హర్భజన్ అన్నాడు. ఇటీవల జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో షాహీన్ దారుణంగా విఫలమయ్యాడు. అతడి బౌలింగ్‌ను అనామక బ్యాటర్లు కూడా చితక్కొట్టారు. వరల్డ్ కప్‌లో విఫలమైన బాబర్ అజామ్ స్థానంలో షాహీన్ అఫ్రిది పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యాడు.
బ్యాక్ ఇంజురీ కారణంగా దాదాపు పదకొండు నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు బుమ్రా. డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు.