సన్నీ మాటలను నమ్మలేకపోతున్నాం.. అవి స్టూపిడ్ వ్యాఖ్యలు.. నోరు పారేసుకున్న పాక్ మాజీ క్రికెటర్లు-pakistan former cricketers javed miandad basit ali controversial comments on sunil gavaskar stupid pahalgam asia cup ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  సన్నీ మాటలను నమ్మలేకపోతున్నాం.. అవి స్టూపిడ్ వ్యాఖ్యలు.. నోరు పారేసుకున్న పాక్ మాజీ క్రికెటర్లు

సన్నీ మాటలను నమ్మలేకపోతున్నాం.. అవి స్టూపిడ్ వ్యాఖ్యలు.. నోరు పారేసుకున్న పాక్ మాజీ క్రికెటర్లు

2025 ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ ను బాయ్ కాట్ చేయాలనేలా సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మాజీ క్రికెటర్లు ఘాటుగా స్పందించారు. మరోసారి సన్నీపై నోరు పారేసుకున్నారు.

జావేద్ మియందాద్, సునీల్ గావస్కర్ (Screengrab/AFP)

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మరోసారి భారత లెజెండరీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పై నోరు పారేసుకున్నారు. సన్నీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో వచ్చే ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ ను బాయ్ కాట్ చేసే పరిస్థితులు ఉండొచ్చని సన్నీ చేసిన వ్యాఖ్యలపై పాక్ మాజీ ప్లేయర్లు రియాక్టయ్యారు. నోటికి ఎంత వస్తే అంత వాగారు. సన్నీ గొప్ప వ్యక్తి అంటూనే కౌంటర్లు వేశారు.

నమ్మలేకపోయిన మియాందాద్

పాకిస్థాన్ ను ఆసియా కప్ నుంచి బాయ్ కాట్ చేయాలంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలు నమ్మలేకపోతున్నానని పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘‘సన్నీ భాయ్ ఇలా చెప్పాడంటే నమ్మలేకపోతున్నా. ఆయన ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే గౌరవప్రదమైన వ్యక్తి' అని మియాందాద్ ఓ వెబ్ సైట్ తో అన్నాడు.

పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ ఇక్బాల్ ఖాసిం కూడా అంతే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ "గవాస్కర్ సరిహద్దుకు ఇరువైపులా ఇష్టపడే బాధ్యతాయుతమైన వ్యక్తి. క్రీడలతో రాజకీయాలు మిళితమవ్వకూడదు’’ అని పేర్కొన్నాడు.

హద్దు దాటిన బాసిత్

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే మరో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ మరోసారి సన్నీపై పడ్డాడు. గవాస్కర్ వ్యాఖ్యలు స్టూపిడ్ అంటూ నోరు పారేసుకున్నాడు. తుపాకీ ఎక్కుపెట్టే ముందు బలమైన ఆధారాలు చూపాలని అడ్డగోలు డిమాండ్ చేశాడు. "ఇది పూర్తిగా మూర్ఖత్వం. దర్యాప్తు ముగియనివ్వండి. క్రికెట్ రాజకీయ వైషమ్యాలకు అతీతంగా ఉండాలి’’ అని బాసిత్ చెప్పాడు.

ఏప్రిల్ 22 న ప్రాణాంతక పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న భారత్.. పాక్ కు అన్ని దారులూ మూసేస్తోంది. ఇప్పుడు భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

గవాస్కర్ ఏమన్నాడంటే?

భారత ప్రభుత్వ ఆదేశాలను బీసీసీఐ నిరంతరం పాటిస్తుందని, ఆసియా కప్ కోసం ఇది మారే అవకాశం లేదని స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నారు. ఆసియా కప్ 2025 ఎడిషన్ కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయని, పరిస్థితులు మారకపోతే పాక్ పాల్గొనడం అనుమానమేనని అంటున్నారు. ఉద్రిక్తతలు కొనసాగితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ రద్దయ్యే అవకాశం ఉందని సన్నీ అన్నారు.

ఆసియా కప్ నుంచి టీమిండియా వైదొలగితే బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్ వంటి జట్లను ఆహ్వానించి భారత్ లో బీసీసీఐ ప్రత్యేక బహుళ దేశాల టోర్నమెంట్ నిర్వహించవచ్చని గవాస్కర్ సూచించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం