Danish Kaneria Sensational comments: హిందువు అయినందుకు వివక్ష.. అఫ్రిది మతం మార్చుకోమన్నాడు: పాక్ మాజీ క్రికెటర్
Danish Kaneria Sensational comments: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పాక్ లో మైనారిటీ అయిన హిందువులపై వివక్ష ఏ రేంజ్ లో ఉంటుందో బయటపెట్టాడు. తనను మతం మార్చుకోమన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ లో మైనారిటీ అయిన హిందువులపై వివక్షను బయటపెట్టాడు. ఈ వివక్ష కారణంగానే తన కెరీర్ నాశనమైందని పేర్కొన్నాడు. తనను మతం మార్చుకోమని బలవంతపెట్టారని కనేరియా సెన్సేషనల్ కామెంట్లు చేశాడు. పాక్ మాజీ కెప్టెన్ పై కనేరియా విరుచుకుపడ్డాడు.
కెరీర్ నాశనం
పాకిస్థాన్ లోని మైనారిటీల పరిస్థితిపై అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన మీటింగ్ లో కనేరియా ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇలా సమావేశమై పాకిస్థాన్ లోని మైనారిటీ ప్రజల పరిస్థితి గురించి మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. ఎందుకంటే మేం చాలా వివక్షను ఎదుర్కొన్నాం. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా గొంతు విప్పేందుకు ఛాన్స్ దొరికింది. పాకిస్థాన్ లో వివక్షకు నేనూ బాధితుడినే. దీని కారణంగానే క్రికెట్ కెరీర్ నాశనమైంది’’ అని కనేరియా అన్నాడు.
మతం మారమని
మతం మారమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చెప్పేవాడని కనేరియా చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ‘‘పాకిస్థాన్ లో నాకు పూర్తి గౌరవం దక్కలేదు. సమానత్వం లభించలేదు. వివక్ష కారణంగానే ఇప్పుడు అమెరికాలో ఉన్నా. పాక్ లో మేం ఎదుర్కొన్న బాధల గురించి అమెరికాకు తెలియజేయాలి. అప్పుడే ఏదైనా చర్యలు తీసుకునే అవకాశముంటుంది.
షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది సహా కొంతమంది ప్లేయర్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అందరికంటే ఎక్కువగా నన్ను మతం మారమని అఫ్రిది ఒత్తిడి చేసేవాడు. చాలా సార్లు అడిగాడు. కనీసం నాతో కలిసి వీళ్లు తినేవాళ్లు కాదు’’ అని కనేరియా వెల్లడించాడు.
ఆ ఒక్క కెప్టెన్
షాహిద్ అఫ్రిది తనను మతం మారమని ఒత్తిడి చేసేవాడని కనేరియా అన్నాడు. కానీ ఇంజమాముల్ హక్ మాత్రం ఎప్పుడూ ఆ టాపిక్ తీసుకురాలేదని చెప్పాడు. ‘‘నా కెరీర్ లో సపోర్ట్ ఇచ్చిన ఏకైక పాక్ కెప్టెన్ ఇంజమాముల్ హక్. నన్ను బాగా చూసుకున్న కెప్టెన్ అతడు. నాకు చాలా మద్దుతునిచ్చాడు. ఎప్పుడూ మతం టాపిక్ తీసుకురాలేదు’’ అని కనేరియా పేర్కొన్నాడు.
హిందు ఆటగాడు
పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రెండో హిందు క్రికెటర్ డానిష్ కనేరియా. అనిల్ దల్పత్ తర్వాత పాక్ కు ఆడిన హిందు ఆటగాడు అతడే. పాక్ తరపున కనేరియా 61 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. స్పిన్నర్ గా కనేరియా మంచి ప్రదర్శన చేశాడు. మరోవైపు హిందు సంప్రదాయాలను కనేరియా అమితంగా గౌరవిస్తాడు. అయోధ్యలో రామ మందిరం ఆరంభోత్సవం సందర్భంగా ఎక్స్ లో పోస్టు కూడా పెట్టాడు.
సంబంధిత కథనం