PAK vs NZ ODI Series: ఇలాగేనా ఆడేది?.. మారని పాక్ ఆట.. 32 కే 5 వికెట్లు.. మళ్లీ కివీస్ చేతిలో చిత్తు.. వన్డే సిరీసూ పాయె-pakistan crushed by new zealand lose odi series after batting collapse mitchell hay muhammad abbas ben sears jacob duffy ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pak Vs Nz Odi Series: ఇలాగేనా ఆడేది?.. మారని పాక్ ఆట.. 32 కే 5 వికెట్లు.. మళ్లీ కివీస్ చేతిలో చిత్తు.. వన్డే సిరీసూ పాయె

PAK vs NZ ODI Series: ఇలాగేనా ఆడేది?.. మారని పాక్ ఆట.. 32 కే 5 వికెట్లు.. మళ్లీ కివీస్ చేతిలో చిత్తు.. వన్డే సిరీసూ పాయె

PAK vs NZ ODI Series: పాకిస్థాన్ ఆటతీరు రోజురోజుకూ పేలవంగా మారుతోంది. స్టార్ ప్లేయర్స్ లేని న్యూజిలాండ్ చేతిలో పాక్ మరోసారి చిత్తయింది. బుధవారం రెండో వన్డేలో ఓడి సిరీస్ కోల్పోయింది. బ్యాటింగ్ లో ఓ దలో 32 పరుగులకే 5 వికెట్లూ కోల్పోయింది.

ಎರಡನೇ ಏಕದಿನ ಪಂದ್ಯದಲ್ಲೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸೋಲು; ಸರಣಿ ವಶಪಡಿಸಿದ ಕಿವೀಸ್ (AFP)

పాకిస్థాన్ తో మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ 2-0 తేడాతో సొంతం చేసుకుంది. వరుసగా రెండు వన్డేల్లోనూ పాక్ ను చిత్తు చేసిన కివీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ఖాతాలో వేసుకుంది. బుధవారం (ఏప్రిల్ 2) హామిల్టన్ లో జరిగిన రెండో వన్డేలో కివీస్ 84 పరుగుల తేడాతో పాక్ ను ఓడించింది.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 292 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ’ మిచెల్ హే (78 బంతుల్లో 99 నాటౌట్) ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఛేజింగ్ లో పాక్ 41.2 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో ఆ టీమ్ 32కే 5 వికెట్లూ కోల్పోయింది. బెన్ సియర్స్ అయిదు వికెట్లతో పాక్ ను చావు దెబ్బ తీశాడు.

మిచెల్ అదుర్స్

పాకిస్థాన్ తో రెండో వన్డేలో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన కివీస్ ఇన్నింగ్స్ లో మిచెల్ హే ఆట హైలైట్. ఫస్ట్ కివీస్ కు మంచి ఆరంభమే దక్కింది. నిక్ కెల్లీ 31 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రీస్ మరియు (18)తో కలిసి తొలి వికెట్ కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

కానీ వీళ్లతో పాటు హెన్రీ నికోల్స్ (22), డరిల్ మిచెల్ (18), కెప్టెన్ బ్రాస్ వెల్ (17) మంచి ఆరంభాలను వేస్ట్ చేసుకున్నారు. దీంతో 132/5తో కివీస్ కష్టాల్లో పడింది. ఆ దశలో రెండో వన్డే మాత్రమే ఆడుతున్న మహమ్మద్ అబ్బాస్ (41)తో కలిసి మిచెల్ హే ఆ టీమ్ ను కాపాడాడు.

సెంచరీ మిస్

మిచెల్ హే 78 బంతుల్లో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. కివీస్ బ్యాటింగ్ లో లాస్ట్ ఓవర్ కు ముందు హే 77 రన్స్ తో నిలిచాడు. చివరి ఓవర్లో లాస్ట్ నాలుగు బాల్స్ కు వరుసగా 6, 6, 4, 4 దంచాడు. ఆఖరి బంతికి సిక్సర్ కొడితే హే సెంచరీ అందుకునేవాడు. కానీ ఫోర్ కొట్టడంతో 99 దగ్గరే ఆగిపోయాడు. పాక్ బౌలర్లలో మహమ్మద్ వసీం, సూఫియన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

పాక్ మళ్లీ ఢమాల్

పాకిస్థాన్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ మళ్లీ కొనసాగింది. న్యూజిలాండ్ తో రెండో వన్డేలో ఛేజింగ్ లో పాకిస్థాన్ టాప్ ఆర్డర్ ఢమాల్ అయింది. టాప్-5 బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరూ కనీసం 10 రన్స్ చేయలేదు. అబ్దుల్లా షఫీక్ (1), ఇమాముల్ హక్ (3), స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (1), కెప్టెన్ రిజ్వాన్ (5), సల్మాన్ అఘా (9) పెవిలియన్ లో ఏదో పని ఉన్నట్లు ఔటయేందుకు తొందరపడ్డారు. దీంతో జట్టు 32 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

కివీస్ పేసర్లు ఒరోర్క్, జాకబ్ డఫీ (3/35), బెన్ సియర్స్ పాక్ ను చావుదెబ్బ కొట్టారు. ఆ టీమ్ లో ఫహీం అష్రఫ్ (73), నసీం షా (51) కాస్త పోరాడి.. పాక్ మరీ ఘోరంగా ఓడకుండా చూశారు.

ఇప్పటికే అయిదు టీ20ల సిరీస్ ను 1-4తో కోల్పోయిన పాకిస్థాన్.. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ నూ 0-2తో పోగొట్టుకుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం