Ind vs pak: పాక్ వర్సెస్ ఇండియా ఫ్యాన్ వార్..పేరుకే రిచ్ క్రికెట్ బోర్డు.. ఫ్లడ్ లైట్స్ ఫెయిల్యూర్.. బీసీసీఐపై విమర్శలు
Ind vs pak: బీసీసీఐపై పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లండ్ తో భారత్ రెండో వన్డే సందర్భంగా కటక్ స్టేడియంలో కాసేపు ఫ్లడ్ లైట్స్ ఆఫ్ అయ్యాయి. రచిన్ రవీంద్ర ఘటనకు పీసీబీ కారణమని సోషల్ మీడియాలో ఆరోపించడంతో ఆగ్రహించిన పాక్ అభిమానులు బీసీసీఐపై విరుచుకుపడ్డారు.

ఫ్యాన్ వార్
ఇంగ్లండ్, భారత్ మధ్య ఆదివారం (ఫిబ్రవరి 9) కటక్ లో జరిగిన రెండో వన్డే ఇండియా, పాకిస్థాన్ ఫ్యాన్ వార్ కు కారణమైంది. ఆ మ్యాచ్ మధ్యలో ఫ్లడ్ లైట్స్ ఆఫ్ అవడంతో కాసేపు ఆటకు బ్రేక్ వచ్చింది. దీంతో రిచెస్ట్ క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐకి ఫ్లడ్ లైట్స్ మెయింటైన్ చేయడం తెలియదని పాక్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. దీనికి ఇండియన్ ఫ్యాన్స్ కూడా గట్టిగా రిప్లే ఇస్తున్నారు.
35 నిమిషాల పాటు
ఇంగ్లండ్ తో రెండో వన్డేలో భారత్ ఛేదనలో ఫ్లడ్ లైట్స్ దాదాపు 35 నిమిషాల పాటు ఆఫ్ అయ్యాయి. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సమయంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. స్టేడియంలోని ఆరు ఫ్లడ్ లైట్స్ టవర్స్ ఉండగా.. ఇందులో ఒకటి పూర్తిగా ఆఫ్ అయింది. జనరేటర్ రిపేర్ కారణంగా ఇలా జరిగింది. మరో జనరేటర్ తెచ్చి లైట్స్ వెలిగించారు. ఆ సమయంలో ఆటగాళ్లు మైదానం వీడారు.
పీసీబీకి డ్యామేజీ
పాకిస్థాన్ లో జరుగుతున్న ట్రై సిరీస్ లో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు సీరియస్ ఇంజూరీ అయిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ తో తొలి వన్డే మ్యాచ్ లో డీప్ స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర కు ఫ్లడ్ లైట్స్ కారణంగా బంతి కనిపించలేదు. అది నేరుగా వచ్చి బలంగా ముఖంపై తగిలింది. రక్తం కారుతుండటంతో అతణ్ని బయటకు తీసుకెళ్లారు.
కవర్ చేసుకునేందుకు
రచిన్ గాయంతో కలిగిన డ్యామేజీని కవర్ చేసుకునేందుకు పాకిస్థాన్ ఫ్యాన్స్ ఇప్పుడు బీసీసీఐపై పడ్డారు. రచిన్ ఇంజూరీ కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు బ్యాడ్ నేమ్ వచ్చింది. త్వరలో అక్కడ ఆరంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ నుంచి తరలించాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి.
సంబంధిత కథనం