IND vs NZ 3rd Test: మూడో టెస్ట్‌లో టాస్ ఓడిన టీమిండియా - న్యూజిలాండ్ బ్యాటింగ్ - తుది జట్టు నుంచి బుమ్రా ఔట్
IND vs NZ 3rd Test: ఇండియా న్యూజిలాండ్ మధ్య ముంబాయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. మూడో టెస్ట్ టీమిండియా ఓ మార్పు చేసింది. బుమ్రా స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు.
IND vs NZ 3rd Test: ఇండియా, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నుంచి మూడో టెస్ట్ మొదలైంది. ముంబాయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ చివరి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను చేజార్చుకుంది టీమిండియా. చివరి టెస్ట్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని ఆరాటపడుతోంది. మరోవైపు మూడోటెస్ట్‌లో టీమిండియాను ఓడించి టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే ఉత్సాహంతో కివీస్ బరిలోకి దిగుతోంది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్
మూడో టెస్ట్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. సాంట్నర్ స్థానంలో ఇష్‌సోధి...టీమ్ సౌథి స్థానంలో మ్యాట్ హెన్రీ జట్టులోకి వచ్చారు. ఇండియా తుది జట్టులో ఒక మార్పు చేసింది. బుమ్రా స్థానంలో సిరాజ్ జట్టులోకి వచ్చాడు. అనారోగ్యం కారణంగానే బుమ్రాను మూడో టెస్ట్ నుంచి పక్కనపెట్టినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. బుమ్రా లేని లోటును సిరాజ్, ఆకాష్ దీప్ ఏ మేరకు భర్తీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
స్పిన్నర్లపైనే భారం...
మరోసారి టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్‌పైనే బౌలింగ్ పరంగా ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. బౌలర్లు రాణిస్తోన్న బ్యాటర్లు విఫలం కావడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దారుణంగా విఫలవుతోన్నారు. రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. చివరి టెస్ట్‌లో ఈ నలుగురు ఎలా ఆడుతారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇండియా తుది జట్టు ఇదే...
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, ఆకాష్ దీప్, సిరాజ్
న్యూజిలాండ్ తుది జట్టు ఇదే...
టామ్ లాథమ్,డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారీ మిచెల్, బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోదీ, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, ఓరౌర్క్.