varun debut: 33 ఏళ్లకు వన్డే అరంగేట్రం.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గురించి ఈ విషయాలు తెలుసా?
varun debut: ఇంగ్లండ్ తో రెండో మ్యాచ్ లో భారత్ తరపున మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వన్డే అరంగేట్రం చేశాడు. 33 ఏళ్ల అతను ఫరూఖ్ ఇంజినీర్ (36) తర్వాత వన్డే అరంగేట్రం చేసిన ఓల్డెస్ట్ ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.

వరుణ్ అరంగేట్రం
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తిని ఆడించేందుకు కసరత్తులు చేస్తున్న టీమ్ఇండియా ఆ దిశగా తొలి అడుగు వేసింది. ఆదివారం (ఫిబ్రవరి 9) కటక్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఈ మిస్టరీ స్పిన్నర్ ను ఆడిస్తోంది. ఈ మ్యాచ్ తో వరుణ్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు.
33 ఏళ్ల వయసులో
వరుణ్ చక్రవర్తి 33 ఏళ్ల 164 రోజుల వయసులో వన్డే అరంగేట్రం చేశాడు. ఈ వయసుకొచ్చేసరికి సాధారణంగా క్రికెటర్లు పీక్ కెరీర్ చూసి ఉంటారు. కానీ వరుణ్ లేట్ గా అయినా లేటెస్ట్ గా వన్డేల్లో అడుగుపెట్టాడు. ఫరూఖ్ ఇంజినీర్ (1974లో 36 ఏళ్ల 138 రోజులు) తర్వాత వన్డే అరంగేట్రం చేసిన భారత పెద్ద వయస్సు ఆటగాడు వరుణే.
టీ20ల్లో కీలక బౌలర్ గా
కర్ణాటకలో పుట్టి దేశవాళీల్లో తమిళనాడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న లెగ్ స్పిన్నర్ వరుణ్ 2021లో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ లో కేకేఆర్ తరపున అదరగొట్టి టీమ్ఇండియా ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటివరకూ 18 అంతర్జాతీయ టీ20ల్లో వరుణ్ 14.57 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. కెరీర్ మధ్యలో తడబడ్డా అతను.. సుమారు మూడేళ్ల పాటు జట్టుకు దూరమయ్యాడు.
వరుణ్ 2.0
తన బౌలింగ్ ను అడ్జస్ట్ చేసుకుని సరికొత్తగా వరుణ్ తిరిగొచ్చాడు. ఓవర్ స్పిన్, టాప్ స్పిన్ తో బ్యాటర్లను బుట్టలో వేసుకుంటున్నాడు. 2024 అక్టోబర్ లో బంగ్లాదేశ్ తో టీ20తో పునరాగమనం చేసినప్పటి నుంచి వరుణ్ చెలరేగిపోతున్నాడు. వికెట్ల మీద వికెట్లు పడగొడుతున్నాడు. ఆ సెన్సేషనల్ బౌలింగ్ తోనే ఇప్పుడు వన్డేల్లోకి కూడా వచ్చేశాడు.
సంబంధిత కథనం