IPL 2024 MS Dhoni: ధోనీ అభిమానులకు గుడ్‍న్యూస్.. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడనున్న తలా!: 8మందిని రిలీజ్ చేసిన చెన్నై-ms dhoni will play ipl 2024 as chennai super kings retains him for next season ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Ms Dhoni Will Play Ipl 2024 As Chennai Super Kings Retains Him For Next Season

IPL 2024 MS Dhoni: ధోనీ అభిమానులకు గుడ్‍న్యూస్.. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడనున్న తలా!: 8మందిని రిలీజ్ చేసిన చెన్నై

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 26, 2023 04:55 PM IST

IPL 2024 MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే ఏడాది ఐపీఎల్ కూడా ఆడడం దాదాపు ఖాయమైంది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అతడిని రిటైన్ చేసుకోవడంతో ఇది స్పష్టమైంది. ఆ వివరాలివే..

IPL 2024 MS Dhoni: ధోనీ అభిమానులకు గుడ్‍న్యూస్.. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడనున్న తలా
IPL 2024 MS Dhoni: ధోనీ అభిమానులకు గుడ్‍న్యూస్.. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడనున్న తలా

IPL 2024 MS Dhoni: స్టార్ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు గుడ్‍న్యూస్ ఇది. వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో ధోనీ బరిలోకి దిగడం ఖాయమైంది. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఈ ఏడాది (2023) ఐపీఎల్‍లో టైటిల్ కైవసం చేసుకుంది. చెన్నైకు ఐదోసారి ఐపీఎల్ టైటిల్ అందించాడు కెప్టెన్ ధోనీ. అయితే, శరీరం సహకరిస్తేనే 2024 ఐపీఎల్ ఆడతానని.. ఈ సంవత్సరం టైటిల్‍ను అందుకున్నాక తలా ధోనీ చెప్పాడు. దీంతో అతడు ఇక చెన్నై తరఫున ఆడతాడా లేదా అన్న టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. అయితే, నేడు (నవంబర్ 26) ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ గురించి ప్రకటించాయి. జట్లలో కొనసాగించే, రిలీజ్ చేసే ఆటగాళ్ల లిస్టులను వెల్లడించాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ జాబితాను ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2024 సీజన్ కోసం కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కొనసాగించింది. అతడిని రిటైన్ చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది ఐపీఎల్‍లో ధోనీ బరికి దిగడం దాదాపు ఖాయమైంది. మోకాలి గాయం ఉన్నా ఈ ఏడాది ఐపీఎల్‍లో అలాగే ఆడాడు ధోనీ. అద్భుత కెప్టెన్సీతో జట్టుకు టైటిల్ సాధించిపెట్టాడు. ఐదు టైటిళ్లతో ముంబైకు సమానంగా ఐపీఎల్‍లో మోస్ట్ సక్సెస్‍ఫుల్ టీమ్‍గా చెన్నైను ధోనీ నిలిపాడు. ఈ ఏడాది సీజన్ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ధోనీ.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది (2024) ఐపీఎల్ సీజన్‍లో బరిలోకి దిగేందుకు ఇబ్బంది లేనట్టు సమాచారం.

ఐపీఎల్ 2024లో ధోనీ బరిలోకి దిగడం దాదాపు ఖాయం కావడంతో అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టులు చేస్తున్నారు.

ఐపీఎల్ 2024 సీజన్‍కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తాను వచ్చే సీజన్ ఆడనని ఇటీవలే చెప్పాడు.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రిలీజ్ చేసిన ఆటగాళ్లు: బెన్ స్టోక్స్, డ్వైన్ ప్రెటోరియస్, కైల్ జెమీసన్, అంబటి రాయుడు, సిసిండ మగల, సుభాన్షు సేనాపతి, ఆకాశ్ సింగ్, భగత్ వర్మ

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కొనసాగించిన ఆటగాళ్లు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డెవోన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, మొయిన్ అలీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, మతీష పతిరణ, ముకేశ్ చౌదరి, మిచెల్ సాంట్నర్, రవీంద్రన్ హంగర్గేకర్, సిమర్జీత్ సింగ్, తుషార్ దేశ్‍పాండ్, ప్రశాంత్ సోలంకి, షేక్ రషీద్, నిశాంత్ సంధు, అజయ్ మదల్

ఎనిమిది మంది ఆటగాళ్లను రిలీజ్ చేయటంతో చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో ప్రస్తుతం రూ.32.1కోట్లు మిగిలి ఉన్నాయి. ఐపీఎల్ 2024 కోసం ఈ ఏడాది డిసెంబర్ 19న వేలం జరగనుంది.

WhatsApp channel