On This Day in 2007: భారత్ క్రికెట్‍లో చరిత్ర సృష్టించిన ఈ రోజు గుర్తుందా? ధోని సారథ్యంలో మరుపురాని గెలుపు
ICC T20 World Cup 2007: ఇండియన్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించిన రోజు. భారత్ క్రికెట్ చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ (24) ఎప్పటికీ గుర్తుండుపోయే ప్రత్యేకమైన రోజు. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని యువ భారత జట్టు ఈరోజు చరిత్ర సృష్టించింది. ఆ విశేషాల్లోకి వెళితే..
యావత్ భారత్ ఎల్లప్పుడూ గర్వించే రోజు ఇది (సెప్టెంబర్ 24). ఇండియన్ క్రికెట్ అభిమానులు నిత్యం గర్వంగా, గొప్పగా చెప్పుకునే ఈరోజు ఎంతో స్పెషల్. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సారథిగా క్రికెట్ టీమ్‍ను ముందుకు నడిపించి ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన రోజు. ఎంఎస్ ధోనితోపాటు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ వంటి స్టార్ ఆటగాళ్ల పేర్లు మారుమోగిపోయింది సరిగ్గా ఈరోజునే.
బీసీసీఐ పోస్ట్
2007లో సెప్టెంబర్ 24న భారత్ తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‍పై విజయం సాధించి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుంది. అందుకే ఈరోజు ఇండియన్ క్రికెట్ టీమ్ సంబురాలు జరుపుకుంటోంది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం జరిగిన మధురమైన క్షణాన్ని గొప్పగా చెబుతూ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పోస్ట్ చేసింది. "మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో భారత క్రికెట్ జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ట్రోపీ అందుకుని చరిత్ర సృష్టించింది" అని రాసుకొచ్చింది.
5 పరుగుల తేడాతో
టీ20 ఫైనల్ మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. 5 పరుగుల తేడాతో పాకిస్తాన్‍ను భారత్ ఓడించింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ మ్యాచ్‍లో భారత్ 20 ఓవరల్లో ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‍కు దిగిన పాకిస్తాన్‍ను 19.3 ఓవరల్లో 152 పరుగలకు ఆలౌట్ చేసింది. ఇందులో గౌతమ్ గంభీర్ 75 రన్స్ చేసి టాప్ స్కోరర్‍గా నిలిచాడు. హర్భజన్ సింగ్ 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
టోర్నీలో 10 జట్లు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ మొత్తంగా 9 రోజులపాటు సాగింది. ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొన్నాయి. ఈ టీమ్స్ అన్నీ కూడా వరల్డ్ సిరీస్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలు, రన్నరప్‍గా నిలిచినవి కావడం విశేషం. కాగా ప్రస్తుతం భారత్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వచ్చి 16 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబురాలు చేసుకుంటుంది.