Mohammed Siraj Dating: మహీరా శర్మతో డేటింగ్‌పై నోరు విప్పిన సిరాజ్.. ఏమన్నాడంటే?-mohammed siraj mahira sharma dating rumors team india pace bowler reacted ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mohammed Siraj Dating: మహీరా శర్మతో డేటింగ్‌పై నోరు విప్పిన సిరాజ్.. ఏమన్నాడంటే?

Mohammed Siraj Dating: మహీరా శర్మతో డేటింగ్‌పై నోరు విప్పిన సిరాజ్.. ఏమన్నాడంటే?

Hari Prasad S HT Telugu

Mohammed Siraj Dating: మహీరా శర్మతో డేటింగ్ రూమర్లపై టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్పందించాడు. అందులో నిజం లేదని, తన గురించి ఆమెను ప్రశ్నలు అడిగి వేధించొద్దని అతడు కోరాడు.

మహీరా శర్మతో డేటింగ్‌పై నోరు విప్పిన సిరాజ్.. ఏమన్నాడంటే? (Instagram)

Mohammed Siraj Dating: మహీరా శర్మతో మహ్మద్ సిరాజ్ రొమాన్స్ గురించి చాలా వార్తలు వచ్చాయి. దీంతో మహీరా ఎక్కడ కనిపించినా.. ఆమెను ఈ డేటింగ్ ప్రశ్నలే అడుగుతున్నారు. దీనిపై తాజాగా సిరాజ్ స్పందించాడు. ఈ డేటింగ్ వార్తల్లో నిజం లేదని, తన గురించి తరచూ ఆమెను ప్రశ్నలు అడిగి విసిగించొద్దని మీడియాను కోరుతున్నాడు.

సిరాజ్ ఏమన్నాడంటే..

మహీరా శర్మ మార్చి 20న ముంబైలో జరిగిన ఓ అవార్డు వేడుకలో పాల్గొని రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి, తనకు ఇష్టమైన జట్టు గురించి సరదాగా మాట్లాడింది. ఈ సందర్బంగా సిరాజ్ గురించి అడుగుతూ ఆమెను ఆటపట్టించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిరాజ్ తన ఇన్‌స్టా వేదికగా స్పందించాడు. తన గురించి ఇతరులను ప్రశ్నించవద్దని ఫోటోగ్రాఫర్లను కోరాడు. అయితే తన పోస్ట్ లో ప్రత్యేకంగా ఎవరి గురించి ప్రస్తావించలేదు.

మార్చి 21న తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో సిరాజ్ తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు. 'నా గురించి ప్రశ్నలు అడగడం మానేయాలని నేను ఫొటోగ్రాఫర్లను కోరుతున్నాను. ఇది పూర్తిగా అవాస్తవం, నిరాధారం. ఇది ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను" అని ఓ ఎమోజీతో పాటు పోస్ట్ చేశాడు. అయితే ఇప్పుడా పోస్ట్ కనిపించకపోవడంతో అతడు ఆ పోస్టును డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

సిరాజ్, మహీరా గురించి..

బిగ్ బాస్ 13 లో పాల్గొన్న తరువాత ఫేమ్ సంపాదించిన మహీరాతో మహ్మద్ సిరాజ్ ప్రేమాయణం గురించి కొన్ని నెలలుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మహీరా, సిరాజ్ రొమాంటిక్ గా ఉన్నారని కొంతకాలం కిందట ఈ-టైమ్స్ రిపోర్ట్ చేసింది. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయని, అయినప్పటికీ వారు తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచుతున్నారని నివేదిక పేర్కొంది.

మహీరా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లలో ఒకదాన్ని సిరాజ్ లైక్ చేయడంతో డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. ఇద్దరూ ఈ ప్లాట్ ఫామ్ లో ఒకరినొకరు ఫాలో అయ్యారు. దీంతో వీరి రొమాన్స్ పై అభిమానులు పుకార్లు మొదలుపెట్టారు. ఇంతకుముందు మహీరా, ఆమె తల్లి ఇద్దరూ ఈ పుకార్లను ఖండించారు.

మహీరా శర్మ గురించి

మహీరా శర్మ తారక్ మెహతా కా ఊల్టా చష్మాలో ఒక చిన్న పాత్రతో తన కెరీర్ ను ప్రారంభించింది. తర్వాత నాగిన్ 3, కుండలి భాగ్య, బేపనా ప్యార్ వంటి అనేక టీవీ షోలలో నటించింది. అయితే సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్ బాస్ 13లో పాల్గొనడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. గతంలో మహీరా పరాస్ చాబ్రాతో రిలేషన్షిప్ లో ఉంది. బిగ్ బాస్ 13లో కలుసుకున్న వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే 2023లో విడిపోయారు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం