Mohammed Siraj Dating: సిరాజ్ డేటింగ్ చేస్తోంది ఈ బిగ్ బాస్ ఫైనలిస్టుతోనట.. తెరపైకి మరో కొత్త పేరు!
Mohammed Siraj Dating: సిరాజ్ డేటింగ్ పై మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ మధ్యే సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనాయ్ భోస్లేతో అతడు రిలేషన్షిప్ లో ఉన్నాడన్న వార్తల నేపథ్యంలో వాళ్లిద్దరూ దీనిని ఖండించగా.. ఇప్పుడు సిరాజ్ ఓ బిగ్ బాస్ ఫైనలిస్టుతో ప్రేమలో ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త వెల్లడించింది.
Mohammed Siraj Dating: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఈ మధ్య తరచూ వస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ అతని రిలేషన్షిప్ కు సంబంధించిన వార్తలు కావడంతో అభిమానుల్లో సహజంగానే ఆసక్తి నెలకొంది. సిరాజ్ బిగ్ బాస్ 13 మహిరా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా బుధవారం (జనవరి 29) వెల్లడించింది.

సిరాజ్, మహిరా డేటింగ్
29 ఏళ్ల టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ మధ్యే లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జానాయ్ భోస్లేతో అతడు ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చినా.. వీటిని ఆ ఇద్దరూ ఖండించారు. తమది అన్నాచెల్లెళ్ల బంధమంటూ వాళ్లు తేల్చేశారు.
ఇక తాజాగా అతడు మహిరా శర్మ అనే నటితో డేటింగ్ చేస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు తెలిపింది. ఈ విషయాన్ని సిరాజ్, మహిరా సన్నిహితులు కూడా కన్ఫమ్ చేసినట్లు ఆ రిపోర్టు చెప్పింది. అయితే దీనిపై మహిరా మాత్రం ఏమీ మాట్లాడలేదు. కానీ వీటిని ఖండించకపోవడంతో సిరాజ్ తో డేటింగ్ ను ఆమె అంగీకరించినట్లే అని భావిస్తున్నారు.
సిరాజ్, మహిరా ప్రేమ కథ అలా మొదలు
సిరాజ్, మహిరా శర్మ ప్రేమ కథ గతేడాది నవంబర్ లో మొదలైనట్లు తెలుస్తోంది. మహిరా చేసిన పలు ఇన్‌స్టాగ్రామ్ పోస్టులను సిరాజ్ లైక్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ఫాలో అయ్యారు.
అప్పటి నుంచే ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందంటూ పలువురు కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ జంటే ఈ విషయాన్ని ధృవీకరించినట్లు వార్తలు వస్తున్నా.. తన రిలేషన్షిప్ ను ప్రైవేట్ గా ఉంచాలనే వాళ్లు భావిస్తున్నారట. గత కొన్ని నెలలుగా ఈ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే పనిలో ఉన్నారు.
ఎవరీ మహిరా శర్మ?
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తో డేటింగ్ లో ఉన్న ఈ మహిరా శర్మ ఎవరు అని తెలుసుకోవడానికి అభిమానులు ఇంటర్నెట్ ను ఆశ్రయిస్తున్నారు. మహిరా ఓ ప్రముఖ టీవీ నటి. నాగిన్, బేపనా ప్యార్, కుండలీ భాగ్యలాంటి సీరియల్స్ తో పాపులర్ అయింది. ఇక బిగ్ బాస్ 13లో పార్టిసిపేట్ చేసి ఫైనలిస్టుగా కూడా పేరు సంపాదించింది.
2023లో వచ్చిన పంజాబీ మూవీ లెంబర్‌గిన్నీలోనూ నటించింది. ప్రస్తుతానికి తమ రిలేషన్షిప్ పై ఈ ఇద్దరూ ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆస్ట్రేలియా టూర్ నుంచి వచ్చిన తర్వాత సిరాజ్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా సెలెక్టర్ల ఎంపిక చేయలేదు.
సంబంధిత కథనం