Mohammed Siraj: సిరాజ్‍తో డేటింగ్ రూమర్లు.. స్పందించిన దిగ్గజ సింగర్ మనవరాలు.. క్లారిటీ ఇచ్చిన పేసర్
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ డేటింగ్‍లో ఉన్నారంటూ ఇటీవల రూమర్లు గుప్పుమన్నాయి. సోషల్ మీడియాలో ఫొటోలు చక్కర్లు కొట్టాయి. అయితే, దీనిపై జనై భోస్లే రియాక్ట్ అయ్యారు. సిరాజ్ కూడా స్పందించారు.
భారత స్టార్ పేసర్, హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ డేటింగ్‍లో ఉన్నాడంటూ కొన్ని రోజులుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దిగ్గజ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో సిరాజ్ డేటింగ్‍లో ఉన్నారనే పుకార్లు వచ్చాయి. జనై పుట్టిన రోజు వేడుకల్లో సిరాజ్ పాల్గొనడం.. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో బయటికి రావటంతో ఈ రూమర్లు మొదలయ్యాయి. ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో ఈ రూమర్లపై జనై భోస్లే సిరాజ్ స్పందించారు.

ప్రియమైన సోదరుడా..
డేటింగ్ రూమర్ల గురించి సిరాజ్ చేసిన పోస్ట్ చేసిన ఇన్‍స్టాగ్రామ్ పోస్టుకు జనై భోస్లే స్పందించారు. దాన్ని రీపోస్ట్ చేస్తూ.. ‘నా ప్రియమైన సోదరుడా’ అని హిందీలో రాసుకొచ్చారు. సిరాజ్ తనకు సోదరుడి లాంటి వాడని క్లారిటీ ఇచ్చేశారు.
సిరాజ్ రియాక్షన్ ఇదే
జనైతో డేటింగ్ రూమర్లు వస్తుండటంతో మహమ్మద్ సిరాజ్ స్పందించారు. తనకు ఆమె సోదరి లాంటిదని తెలిపారు. “నా సోదరిలా ఎవరూ ఉండరు. ఆమె లేకుండా నాకు ఎక్కడా ఉండాలని అనిపించదు. నేను, నా సోదరి.. చంద్రుడు, నక్షత్తాల్లాంటి వారం” అని ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్ చేశారు సిరాజ్. దీనికై ప్రియమైన సోదరుడా అంటూ రియాక్ట్ అయ్యారు జనై భోస్లే.
మొత్తంగా తమది బ్రదర్, సిస్టర్ రిలేషన్ అని సిరాజ్, జనై క్లారిటీ ఇచ్చేశారు. పుకార్లకు ముగింపు పలికేలా రియాక్ట్ అయ్యారు. మరి ఇప్పటికైనా రూమర్లు ఆగుతాయేమో చూడాలి.
జనై ఇటీవలే 23వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ముంబైలోని ఓ రెస్టారెంట్‍లో జరిగిన ఈ సెలెబ్రేషన్లలో కొందరు సెలెబ్రిటీలు పాల్గొన్నారు. సిరాజ్‍తో పాటు కొందరు క్రికెటర్లు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. జాకీ ష్రాఫ్, శ్రేయస్ అయ్యర్, అభయ్ వర్మ, ఆయేశా ఖాన్, సూయాంశ్ ప్రభుదేశాయ్ అటెండ్ అయ్యారు. సిరాజ్‍తో కలిసి ఉన్న ఫొటోను జనై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇద్దరూ డేటింగ్‍లో ఉన్నారంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. అలాంటిదేమీ లేదని వారిద్దరూ ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశారు.
అశా భోస్లే బాటలోనే సింగర్ అవుతున్నారు జనై భోస్లే. ఇటీవల ఆమె ఇచ్చిన కొన్ని పర్ఫార్మెన్స్‌లు పాపులర్ అయ్యాయి.
కాగా, మహమ్మద్ సిరాజ్‍కు ఇంగ్లండ్‍తో టీ20, వన్డే సిరీస్‍లకు భారత జట్టులో చోటు దక్కలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక కాలేదు.
సంబంధిత కథనం