షమీకి ఇష్టమైన దక్షిణాది నటులు ఎవరు? తెలుగు హీరోల పేర్లే చెప్పిన భారత స్టార్ పేసర్-mohammed shami favourite south indian actors are jr ntr and prabhas ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Mohammed Shami Favourite South Indian Actors Are Jr Ntr And Prabhas

షమీకి ఇష్టమైన దక్షిణాది నటులు ఎవరు? తెలుగు హీరోల పేర్లే చెప్పిన భారత స్టార్ పేసర్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 19, 2024 05:43 PM IST

Mohammed Shami: తనకు ఇష్టమైన దక్షిణాది నటులు ఎవరనే ప్రశ్నకు భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించాడు. ఇద్దరు తెలుగు హీరోల పేర్లు చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహమ్మద్ షమీ
మహమ్మద్ షమీ

Mohammed Shami: భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ గాయం వల్ల కొంతకాలంగా టీమిండియాకు దూరమయ్యాడు. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన షమీ.. ఆ తర్వాత గాయంతో మళ్లీ భారత జట్టులో బరిలోకి దిగలేదు. చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్రస్తుతం సమయం దొరకడంతో కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా, ఓ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చాడు షమీ.

ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్‍కు వచ్చిన షమీ మీడియాతో ముచ్చటించారు. దక్షిణాదిలో మీకు నచ్చిన నటులు ఎవరో చెప్పాలని షమీకి ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు సమాధానం చెప్పాడు. తెలుగు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తనకు ఇష్టమని షమీ అన్నాడు.

“నాకు చాలా సౌత్ సినిమాలు ఇష్టం. జూనియర్ (ఎన్టీఆర్), ప్రభాస్ అంటే చాలా ఇష్టం. సినిమాలు ఎక్కువగానే నేను చూస్తాను” అని షమీ చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తనకు ఇష్టమని షమీ చెప్పడంపై వారి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍ల్లో చక్కర్లు కొడుతోంది.

గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత గాయపడిన షమీ.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‍తో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్‍కు ఎంపికైనా.. పూర్తిస్థాయి ఫిట్‍నెస్ సాధించకపోవడంతో వెళ్లలేదు. అఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍కు కూడా అందుబాటులోకి రాలేదు.

ప్రస్తుతం జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‍లోనూ మహమ్మద్ షమీ లేడు. ఈ సిరీస్‍లో భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా సత్తాచాటుతున్నాడు. ఇంగ్లండ్‍తో రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్‍ల్లో బుమ్రా నంబర్ వన్ స్థానానికి చేరాడు. మూడో టెస్టులో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా రాణించాడు. ఈ సిరీస్‍లో మూడో టెస్టులు జరగగా.. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్టు ఫిబ్రవరి 23న షురూ కానుంది.

ఈ ఏడాది మార్చిలో మొదలయ్యే ఐపీఎల్‍లోగా మహమ్మద్ షమీ పూర్తి ఫిట్‍నెస్ సాధిస్తాడని తెలుస్తోంది. ఐపీఎల్‍లో గుజరాత్ టైటాన్స్ తరఫున షమీ ఆడనున్నాడు. ఈ ఏడాది జూన్‍లో జరిగే టీ20 ప్రపంచకప్‍కు కూడా షమీ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఎన్టీఆర్, ప్రభాస్ విషయానికి వస్తే..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న గ్లోబల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మే 9వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీని తర్వాత రాజాసాబ్, స్పిరిట్ చిత్రాలు చేయనున్నారు ప్రభాస్.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా రిలీజ్ అక్టోబర్ 10వ తేదీకి వాయిదా పడింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావటంతో దేవర మరింత భారీ అంచనాలు ఉన్నాయి.

WhatsApp channel