Modi hugs Shami: షమిని హత్తుకొని ఓదార్చిన ప్రధాని మోదీ.. థ్యాంక్స్ చెప్పిన పేస్ బౌలర్
Modi hugs Shami: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమిని హత్తుకొని ఓదార్చారు ప్రధాని మోదీ. ఆస్ట్రేలియాతో ఫైనల్ ఓడిన తర్వాత మోదీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి ప్లేయర్స్ ను కలిశారు.
Modi hugs Shami: భారత ప్రధాని నరేంద్ర మోదీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి ప్లేయర్స్ కలిశారు. పేస్ బౌలర్ మహ్మద్ షమిని హత్తుకొని ఓదార్చారు. ఈ ఫొటోను షమి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రధానికి థ్యాంక్స్ చెప్పాడు. అటు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా మోదీ డ్రెస్సింగ్ రూమ్ లో తమను కలుస్తున్న ఫొటోలను షేర్ చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ముగిసే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మ్యాచ్ జరుగుతున్న స్టేడియానికి వచ్చారు. విజేతకు ట్రోఫీ అందించారు. ఈ ఊహించని ఓటమితో షాక్ లో ఉన్న టీమిండియా ప్లేయర్స్ ను కలిసి వాళ్లకు ధైర్యం నూరిపోశారు. మోదీ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా తనను మోదీ హత్తుకున్న ఫొటోను షమి పోస్ట్ చేశాడు.
"దురదృష్టవశాత్తూ నిన్న మాకు కలిసిరాలేదు. జట్టుకు, నాకు మద్దతుగా నిలిచిన భారతీయులందరికీ కృతజ్ఞతలు. మా డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి మాలో ధైర్యం నింపిన ప్రధాని నరేంద్ర మోదీకి థ్యాంక్స్. మేము మళ్లీ బలంగా పుంజుకుంటాం" అంటూ షమి ఈ ఫొటోను షేర్ చేయడం విశేషం. అటు జడేజా కూడా మోదీతో కలిసిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
"టోర్నీ అంతా బాగా ఆడాం కానీ నిన్న కొద్దిలో మిస్సయ్యాం. మా గుండె పగిలింది. కానీ అభిమానుల మద్దతు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్ కు రావడం ప్రత్యేకం. చాలా స్ఫూర్తి నింపింది" అని జడేజా అన్నాడు. ఫైనల్ మ్యాచ్ లో ఇండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
టాపిక్