RCB: ఆర్‌సీబీ… ఐపీఎల్ టైటిల్ గెలవడం కల- ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ట్వీట్ వైరల్
RCB: ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడం అసాధ్యమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేలవమైన బౌలింగ్ లైనప్‌తో కనీసం ప్లేఆప్స్ కూడా ఆర్‌సీబీ దాటలేదని మైఖేల్ వాన్ ట్వీట్‌పై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

RCB: ఐపీఎల్ 2024లో మూడు మ్యాచుల్లో రెండో ఓటమిని మూట గట్టుకున్నది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గురువారం కోల్‌కతా చేతిలో ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ ఇరవై ఓవర్లలో 182 పరుగులు చేసింది. బెంగళూరు పేలవమైన బౌలింగ్ కారణంగా మరో పంతొమ్మిది బాల్స్ మిగిలుండగానే కోల్‌కతా ఈ టార్గెట్‌ను ఛేదించింది. సిరాజ్‌తో పాటు బెంగళూరు బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఒక్కరంటే ఒక్కరూ కూడా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయలేకపోయారు.
మైఖేల్ వాన్ ట్వీట్...
బెంగళూరు బౌలర్లను పాటు మాజీ క్రికెటర్లు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ బౌలింగ్ ఎటాక్‌తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడం అసాధ్యమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. అతడి కామెంట్స్‌తో పలువురు క్రికెట్ అభిమానులు ఏకీభవిస్తున్నారు. ఇలాంటి బౌలింగ్‌తో కనీసం ప్లేఆఫ్స్ కూడా దాటడం కష్టమే అంటూ మైఖేల్ వాన్ ట్వీట్‌పై కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో బౌలింగ్ పరంగా పూర్‌గా ఉన్న జట్టు ఆర్‌సీబీనే అని మరో నెటిజన్ కూడా పేర్కొన్నాడు.
ఇర్ఫాన్ పఠాన్ కూడా...
మరో మాజీ క్రికెటర్ టామ్ మూడీ కూడా ఆర్‌సీబీ బౌలింగ్ లైనప్ బాగాలేదంటూ కామెంట్స్ చేశాడు. ఇద్దరు ఓవర్‌సీస్ పేసర్లను తుది జట్టులోకి తీసుకుంటే ఆర్‌సీబీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని అన్నాడు. తదుపరి మ్యాచ్‌లలో టోప్లే, ఫెర్గ్యూసన్‌లను ఆడిస్తే మంచిదని పేర్కొన్నాడు.
ఇర్ఫాన్ పఠాన్ కూడా బౌలర్లను వినియోగించుకోవడంలో ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్ నిర్ణయాలు సరిగా లేవని ట్వీట్ చేశాడు. పవర్ ప్లేలో మ్యాక్‌వెల్‌తో బౌలింగ్ చేయిస్తే బాగుండేదని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. మ్యాక్స్‌వెల్‌తో డుప్తెసిస్ ఎందుకు బౌలింగ్ చేయించలేదో అర్థం కాలేదని అన్నాడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్ అంకుల్‌తో పవర్‌ప్లేలో బౌలింగ్ చేయించాలనే కోల్‌కతా ఐడియా చక్కగా వర్కవుట్ అయ్యిందని, ఆ ఐడియాను ఇంప్లిమెంట్ చేయడంలో ఆర్‌సీబీ విఫలమైందని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.
కోహ్లి రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్
శుక్రవారం కోల్‌కతా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. విరాట్ కోహ్లి 59 బంతుల్లోనే 83 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. కోహ్లితో గ్రీన్ (33), మ్యాక్స్‌వెల్ (28), చివరలో దినేష్ కార్తీక్ (20) కూడా బ్యాట్ ఝులిపించారు. ఈ టార్గెట్‌ను 16. 5 ఓవర్లలోనే కోల్‌కతా ఛేదించింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్ సిక్సర్లు, ఫోర్లతో బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే ఈ ఇద్దరూ 18 పరుగులు చేశారు.
సిక్సర్ల తో విరుచుకుపడ్డ నరైన్...
సునీల్ నరైన్ 22 బంతుల్లోనే 5 సిక్స్ లు, 2 ఫోర్లతో 47 రన్స్ చేసి ఔటయ్యాడు. ఫిల్ సాల్ట్ కూడా 20 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో 30 రన్స్ చేశాడు. వీరిద్దరు ఔటైనా వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ జోడీ కేకేఆర్‌ను గెలిపించారు.
అయ్యర్ హాఫ్ సెంచరీ...
వెంకటేష్ అయ్యర్ 30 బంతుల్లో 4 సిక్స్ లు, 3 ఫోర్లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 39 రన్స్ చేసి నాటౌట్‌గా మిగిలాడు.