MS Dhoni: ఎకానమీ క్లాస్‍లో ప్రయాణించిన ధోనీ.. సర్‌ప్రైజ్‍తో ప్రయాణికుల చప్పట్లు, కేరింతలు: వైరల్ అవుతున్న వీడియో
MS Dhoni: స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ విమానంలో ఎకానమీ క్లాస్‍లో ప్రయాణించారు. ఆయనను చూసిన ప్రయాణికులు సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
MS Dhoni: భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎనలేని స్టార్ డమ్ ఉంది. అత్యధిక మంది అభిమానులు ఉన్న క్రికెటర్లలో తొలి వరుసలో ఉంటాడు. చాలా మంది ఫ్యాన్స్ ధోనీని ఆరాధిస్తారు, స్ఫూర్తిగా తీసుకుంటారు. అయితే, ఇంత స్టార్‌డమ్ ఉన్నా ధోనీ సింపుల్‍గానే ఉంటారు. ఇప్పుడు, ధోనీ మరోసారి తన సంప్లిసిటీని చాటుకున్నారు. విమానంలో ఎకానమీ క్లాస్‍లో ప్రయాణించారు.
ఆశ్చర్యపోయిన అభిమానులు
ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నైకు నిరాశ ఎదురైంది. ఆఖరి లీగ్ మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరలేకపోయింది. ఐదుసార్లు చాంపియన్ అయిన సీఎస్‍కే ఈ సీజన్‍లో లీగ్ దశలోనే వెనుదిరిగింది. అయితే, వచ్చే ఏడాది ధోనీ మళ్లీ ఆడతాడా లేదా అన్న ఉత్కంఠ అందరిలో ఉంది. అయితే, ఇటీవల బెంగళూరు నుంచి రాంచీకి విమానంలో ఎకానమీ క్లాస్‍లో ప్రయాణించారు ధోనీ.
ఎకానమీ క్లాస్‍లో ధోనీని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తేరుకొని చప్పట్లు, కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు.
తన లగేజీని విమానంలోని ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‍లో ధోనీ పెడుతున్న వీడియో బయటికి వచ్చింది. అయితే, ప్రయాణికులు ముందుగా ఎవరో పోల్చుకోలేకపోయారు. అయితే, ఆయన ధోనీ అని గుర్తించగానే చప్పట్లో మోతమోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీ సింప్లిసిటీకి నెటిజన్లు మరోసారి సలాం అంటున్నారు.
ఓటేసిన ధోనీ
లోక్‍సభ ఆరో దశ ఎన్నికల పోలింగ్ నేడు (మే 25) జరుగుతుండగా.. రాంచీలో ఓటేశారు మహేంద్ర సింగ్ ధోనీ. రాంచీలోని ఓ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధోనీ వెంట ఆయన భార్య సాక్షి కూడా ఉన్నారు. ధోనీ రావటంతో పోలింగ్ కేంద్రం వద్ద చాలా కోలాహలం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్‍లో చెన్నైకు కెప్టెన్‍గా ఐదు టైటిళ్లను అందించారు ధోనీ. అయితే, ఈ ఏడాది సీజన్ కోసం కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‍కు అందించారు. కానీ ఈ సీజన్‍లో చెన్నై లీగ్ దశలోనే ఎలిమినేట్ అయింది. కాగా, ఇంకా గాయంతో బాధ పడుతున్న ధోనీ 2025 సీజన్ ఆడతాడా.. ఐపీఎల్ రిటైర్ అవుతాడా అనేది విషయంపై సందిగ్ధత ఉంది. అయితే, మరో రెండు నెలల తర్వాత ఈ విషయంపై ధోనీ తుది నిర్ణయం తీసుకుంటాడని చెన్నై వర్గాలు చెబుతున్నట్టు తెలుస్తోంది.
ఐపీఎల్ రిటైర్మెంట్‍పై ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. లీగ్ దశలోనే ఎలిమినేట్ అయిన తరుణంలో ధోనీకి ఇలాంటి వీడ్కోలు ఉండకూడదని, ఆయన మరో సీజన్ ఆడాలని అభిమానులు కోలుకుంటున్నారు. అయితే, గతేడాది 2023 సీజన్ కూడా గాయంతోనే ఆడిన ఎంఎస్‍డీ కెప్టెన్‍గా జట్టును ముందుకు నడిపి జట్టుకు టైటిల్ సాధించిపెట్టాడు. ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే, ఈ 2024 సీజన్‍లోనూ ధోనీ ఇబ్బంది పడుతున్నట్టే కనిపించాడు. దీంతో వచ్చే సీజన్ ఆడడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.