MS Dhoni at US Open: యూఎస్ ఓపెన్ మ్యాచ్‍కు హాజరైన ఎంఎస్ ధోనీ.. వీడియో వైరల్
MS Dhoni at US Open: యూఎస్ ఓపెన్ గ్రాండ్‍స్లామ్ టోర్నీ మ్యాచ్‍కు హాజరయ్యారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.మ్
MS Dhoni at US Open: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి టెన్నిస్ అంటే కూడా చాలా ఇష్టం. ఆయన టెన్నిస్ ఆడిన వీడియోలు కూడా కొన్నిసార్లు బయటికి వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక జార్ఖండ్ టెన్నిస్ చాంపియన్‍షిప్‍లోనూ ధోని ఆడారు. కాగా, టెన్నిస్‍పై తనకు ఉన్న ఇష్టాన్ని ఇప్పుడు మరోసారి చాటారు ధోనీ. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ 2023 గ్రాండ్‍స్లామ్ టెన్నిస్ టోర్నీకి హాజరయ్యారు మహేంద్ర సింగ్ ధోనీ. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‍ను ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశారు. వివరాలివే..
న్యూయార్క్ సిటీలోని ఆర్థర్ యాషే స్టేడియంలో నేడు యూఎస్ ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రపంచ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‍కు ఎంఎస్ ధోనీ హాజరయ్యారు. స్నేహితులతో కలిసి ప్రేక్షకుల మధ్య కూర్చొని మ్యాచ్ వీక్షించారు. పోటీని ఆస్వాదించారు. ఆయన నవ్వుతూ పక్క వారితో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఎస్ ఓపెన్ అధికారిక బ్రాడ్‍కాస్టర్ సోనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరికొందరు నెటిజన్లు కూడా ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నారు.
యూఎస్ ఓపెన్ టెన్నిస్ మ్యాచ్‍కు ధోనీ హాజరైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీని చూసిన ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. ఆయన లుక్ కూడా స్టైలిష్‍గా ఉంది.
ఇక ఈ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‍లో కార్లోస్ అల్కరాజ్ 6-3,6-2, 6-4 తేడాతో జ్వెరెవ్‍పై వరుస సెట్లలో గెలిచాడు. సెమీ ఫైనల్‍కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్‍లో డానిల్ మెద్వెదెవ్‍తో అల్కరాజ్ తలపడనున్నాడు. ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్ గెలిచి పుల్ ఫామ్‍లో ఉన్నాడు స్పెయిన్ ప్లేయర్ అల్కరాజ్.
అంతర్జాతీయ క్రికెట్‍కు మూడేళ్ల క్రితం వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్‍లో కొనసాగుతున్నారు. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ధోనీ సారథ్యంలో ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అతడి కెప్టెన్సీలో ఐదోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. శరీరం సహకరిస్తే వచ్చే ఏడాది ఐపీఎల్ కూడా ఆడతానని ధోనీ చెప్పారు. మోకాలి సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకున్నట్టు కనిపిస్తున్నారు ఎంఎస్ ధోనీ.