LSG vs DC Live: కుల్దీప్ చెలరేగినా చివర్లో చేతులెత్తేసిన ఢిల్లీ బౌలర్లు.. బదోనీ ఫిఫ్టీ.. లక్నో మోస్తరు స్కోరు-lsg vs dc live score ipl 2024 match ayush badoni kl rahul give lucknow super giants decent score against delhi capitals ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Lsg Vs Dc Live: కుల్దీప్ చెలరేగినా చివర్లో చేతులెత్తేసిన ఢిల్లీ బౌలర్లు.. బదోనీ ఫిఫ్టీ.. లక్నో మోస్తరు స్కోరు

LSG vs DC Live: కుల్దీప్ చెలరేగినా చివర్లో చేతులెత్తేసిన ఢిల్లీ బౌలర్లు.. బదోనీ ఫిఫ్టీ.. లక్నో మోస్తరు స్కోరు

Hari Prasad S HT Telugu
Apr 12, 2024 09:33 PM IST

LSG vs DC Live: ఢిల్లీ క్యాపిటల్స్ తీరు మారలేదు. కుల్దీప్ చెలరేగడంతో మొదట్లోనే లక్నో సూపర్ జెయింట్స్ ను కట్టడి చేసిన ఆ టీమ్ బౌలర్లు.. చివర్లో చేతులెత్తేయడంతో ఎల్‌ఎస్‌జీ ఓ మోస్తరు స్కోరు చేసింది.

కుల్దీప్ చెలరేగినా చివర్లో చేతులెత్తేసిన ఢిల్లీ బౌలర్లు.. బదోనీ ఫిఫ్టీ.. లక్నో మోస్తరు స్కోరు
కుల్దీప్ చెలరేగినా చివర్లో చేతులెత్తేసిన ఢిల్లీ బౌలర్లు.. బదోనీ ఫిఫ్టీ.. లక్నో మోస్తరు స్కోరు

LSG vs DC Live: కుల్దీప్ టీమ్ లోకి వచ్చాడు. మూడు వికెట్లు తీసి లక్నో సూపర్ జెయింట్స్ మిడిలార్డర్ ను కకావికలం చేశాడు. అయినా చివరికి చూస్తే ఆ టీమ్ మంచి స్కోరే సాధించింది. చివర్లో డీసీ బౌలర్లు చేతులెత్తేయడంతోపాటు లక్నో బ్యాటర్ ఆయుష్ బదోనీ ఫైటింగ్ హాఫ్ సెంచరీతో ఆ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 రన్స్ చేసింది.

బదోనీ ఒక్కడే..

ఈ మ్యాచ్ లో ఒక దశలో 13 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో సూపర్ జెయిట్స్ 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సొంత మైదానంలో ఆ టీమ్ 120 పరుగులు చేసినా గొప్పే అనుకున్నారు. కానీ ఆయుష్ బదోనీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. అప్పటి వరకూ చెలరేగిన డీసీ బౌలర్లు.. సడెన్ గా చేతులెత్తేశారు. దీంతో అర్షద్ ఖాన్ తో కలిసి బదోనీ లక్నోకు మంచి స్కోరు అందించాడు.

ఇద్దరూ కలిసి 8వ వికెట్ కు చివరి 7 ఓవర్లలో అజేయంగా 73 పరుగులు జోడించారు. బదోనీ 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 1 సిక్స్ తో 55 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అటు అర్షద్ ఖాన్ 16 బంతుల్లో 20 రన్స్ చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఈ ఇద్దరూ ఆదుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఫైటింగ్ స్కోరు ఉంచింది.

చెలరేగిన కుల్దీప్.. కుప్పకూలిన మిడిలార్డర్

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 28 పరుగుల దగ్గరే డికాక్ (19) వికెట్ కోల్పోయింది. అక్కడ మొదలైన వికెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. ఆ టీమ్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దేవదత్ పడిక్కల్ (3), స్టాయినిస్ (8), పూరన్ (0), దీపక్ హుడా (10) దారుణంగా విఫలమయ్యారు.

కెప్టెన్ రాహుల్ 22 బంతుల్లో 39 రన్స్ చేసి నిలదొక్కుకుంటున్న సమయంలో కుల్దీప్ అన్ని ఔట్ చేశాడు. ఈ ఢిల్లీ లెగ్ స్పిన్నర్ తన 4 ఓవర్లలో కోటాలో కేవలం 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రాహుల్ తోపాటు స్టాయినిస్, పూరన్ లాంటి కీలకమైన వికెట్లు తీసుకోవడం విశేషం. ముఖ్యంగా రెండు వరుస బంతుల్లో స్టాయినిస్, పూరన్ లను ఔట్ చేయడంతో లక్నో కోలుకోలేకపోయింది.

అయితే ఆయుష్ బదోనీ ఢిల్లీ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చాడు. అతన్ని తేలిగ్గా తీసుకుందో మరేంటో గానీ.. ఢిల్లీ బౌలర్లు 14వ ఓవర్ నుంచి గతి తప్పారు. మెల్లగా మొదలు పెట్టిన బదోనీ క్రమంగా జోరు పెంచి లక్నోకు మంచి స్కోరు అందించాడు. వరుస ఓటమలతో సతమతమవుతున్న ఢిల్లీ ఈ టార్గెట్ ను చేజ్ చేస్తుందో లేదో చూడాలి. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ తమ నాలుగు ఓవర్ల కోటాలో చెరో 41 పరుగులు ఇవ్వగా ఇషాంత్ శర్మ 36 రన్స్ ఇచ్చాడు.

Whats_app_banner