Team India: టీమిండియా తరఫున ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే ఆడి కనుమరుగైన ఐపీఎల్ స్టార్స్ ఎవరంటే?
Team India: ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొని జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కొందరు క్రికెటర్లు ఒకే ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే ఆడి టీమిండియాలో కనిపించకుండాపోయారు. ఆ క్రికెటర్లు ఎవరంటే?
Team India: టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి యంగ్ క్రికెటర్లకు ఐపీఎల్ చక్కటి వేదికగా మారింది. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించి జాతీయ జట్టులో చోటు ఖాయం చేసుకునేందుకు ప్రతి ఏడాది యంగ్ క్రికెటర్లు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ...ఇలా ఇటీవల కాలంలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్లు అందరూ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే.
ఈ ఐపీఎల్ స్టార్లలో కొందరు అద్భుతమైన ఆటతీరుతో జాతీయ జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోగా...మరికొందరు మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. ఐపీఎల్ అదరగొట్టి టీమిండియాకు ఎంపికైన కొందరు క్రికెటర్లు ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే ఆడి ఆ తర్వాత జాతీయ జట్టులో కనిపించకుండాపోయారు. ఆ క్రికెటర్లు ఎవరంటే?
రాహుల్ చాహర్...
2021లో శ్రీలంక తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు స్పిన్నర్ రాహుల్ చాహర్. ఈ మ్యాచ్‌లో పది ఓవర్లు వేసి యాభై నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు చాహర్. చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కానీ అతడికి వన్డేల్లో మరో అవకాశం దక్కలేదు. ఈ మ్యాచ్ తర్వాత అతడు వన్డే జట్టులో మళ్లీ కనిపించలేదు.
కృష్ణప్ప గౌతమ్...
కర్ణాటక ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ 2021 ఐపీఎల్ సీజన్‌లో తొమ్మిది కోట్ల ధర పలికి క్రికెట్ వర్గాలను ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన కృష్ణప్ప గౌతమ్ కు టీమిండియాలో మాత్రం నిరాశే ఎదురైంది. ఒకే ఒక వన్డేలో మాత్రమే కనిపించి జట్టులో చోటు కోల్పోయాడు.
ఈ మ్యాచ్‌లో ఒకే వికెట్ తీసి నిరాశపరచడంతో అతడికి సెలెక్టర్లు మరో అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న చేతన్ సకారియా కూడా శ్రీలంక సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. కృష్ణప్ప గౌతమ్…. రాహుల్ చాహర్ ఆడిన మ్యాచ్‌లో చేతన్ సకారియా కూడా బరిలో దిగాడు. అతడికి ఈ వన్డే తర్వాత టీమిండియాలో మళ్లీ కనిపించలేదు.
ఒక్కే ఒక్క మ్యాచ్‌తో...
కోల్‌కతా మాజీ కెప్టెన్ నితీష్ రానా టీమిండియా ప్రస్తానం ఒకే ఒక వన్డేతో ముగిసింది. శ్రీలంక జరిగిన వన్డేల్లో 14 బాల్స్‌లో ఏడు పరుగులు చేసి డిసపాయింట్ చేసి టీమిండియాలో చోటు కోల్పోయాడు.
మిస్టరీ స్పిన్నర్ రవి బిష్టోయ్ టీమిండియా తరఫున పలు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో మాత్రం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే అవకాశం దక్కింది. 2022లో సౌతాఫ్రికాతో వన్డే ఆడిన రవి బిష్టోయ్ మళ్లీ యాభై ఓవర్ల ఫార్మెట్‌లో అభిమానులకు కనిపించలేదు. పేసర్ కుల్దీప్ సేన్ కూడా 2022లో బంగ్లాదేశ్‌తో ఓ వన్డే ఆడాడు. అతడికి మళ్లీ మరో అవకాశం మాత్రం దక్కలేదు.
టాపిక్