Venkatesh Iyer: పెళ్లిపీట‌లెక్క‌నున్న టీమిండియా క్రికెట‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్‌-kolkataknight riders cricketer venkatesh iyer gets engaged with shruti raghunathan ,cricket న్యూస్
Telugu News  /  Cricket  /  Kolkataknight Riders Cricketer Venkatesh Iyer Gets Engaged With Shruti Raghunathan

Venkatesh Iyer: పెళ్లిపీట‌లెక్క‌నున్న టీమిండియా క్రికెట‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 21, 2023 12:34 PM IST

Venkatesh Iyer: టీమిండియా క్రికెట‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఫ్యాష‌న్ డిజైన‌ర్ శృతి ర‌ఘునాథ‌న్‌తో మంగ‌ళ‌వారం వెంక‌టేష్ అయ్య‌ర్ నిశ్చితార్థం జ‌రిగింది. ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు వెంకేట‌ష్ అయ్య‌ర్‌.

వెంక‌టేష్ అయ్య‌ర్, శృతిర‌గునాథ‌న్‌
వెంక‌టేష్ అయ్య‌ర్, శృతిర‌గునాథ‌న్‌

Venkatesh Iyer: కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ క్రికెట‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మంగ‌ళ‌వారం శృతిర‌ఘునాథ‌న్‌తో వెంక‌టేష్ అయ్య‌ర్ నిశ్చితార్థం జ‌రిగింది. ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు వెంక‌టేష్ అయ్య‌ర్‌. త‌న జీవితంలో కొత్త అధ్యాయం మొద‌లైన‌ట్లు ఈ ఫోటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

ఫ్యాష‌న్ డిజైనింగ్‌లో మాస్ట‌ర్స్ చేసిన శృతి ర‌ఘునాథ‌న్ బెంగ‌ళూరులో ఫ్యాష‌న్ డిజైనింగ్ కంపెనీలో ప‌నిచేస్తోన్న‌ట్లుస‌మాచారం. వెంక‌టేష్ అయ్య‌ర్‌కు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ప్లేయ‌ర్స్‌తో పాటు ప‌లువురు క్రికెట‌ర్లు శుభాకాంక్ష‌లు అందజేశారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో వెంక‌టేష్ అయ్య‌ర్ రాణించాడు. ఓ సెంచ‌రీ, రెండు హాఫ్ సెంచ‌రీల‌తో 14 మ్యాచుల్లో 145 స్ట్రైక్ రేటుతో 404 ప‌రుగులు చేశాడు.

2024 ఐపీఎల్ వేలంలో కోల్‌క‌తా వెంకటేష్ అయ్యర్ ను రిటైన్ చేసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. డిసెంబ‌ర్ 19న ఐపీఎల్ వేలం నిర్వ‌హించ‌బోతున్నారు. టీమిండియా త‌ర‌ఫున రెండు వ‌న్డేలు, తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు వెంక‌టేష్ అయ్య‌ర్‌. ఈ అవ‌కాశాల్ని అత‌డు స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు.

వ‌న్డే, టీ20ల్లో విఫ‌లం కావ‌డంతో టీమిండియాకు దూర‌మ‌య్యాడు. చివ‌ర‌గా గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో టీమిండియాకు ప్రాతినిథ్యం వ‌హించాడు వెంక‌టేష్ అయ్య‌ర్‌.

WhatsApp channel
For latest cricket news, live score stay connected with HT Telugu