Virat Kohli: వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా కోహ్లి - రన్స్‌లో కోహ్లి, వికెట్లలో షమీ టాప్!
Virat Kohli: వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును విరాట్ కోహ్లి అందుకున్నాడు. 765 రన్స్‌తో వరల్డ్ కప్‌లో కోహ్లి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ టాప్ ప్లేస్ ను సొంతం చేసుకున్నాడు.
Virat Kohli: వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. 765 రన్స్‌తో వరల్డ్ కప్‌లో కోహ్లి టాప్ స్కోరర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ వరల్డ్ కప్ లో కోహ్లి మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు. ఫైనల్‌లో 54 పరుగులతో రాణించిన కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మెడల్‌ను కోహ్లికి రోజర్ బిన్నీ అందించాడు. ఫైనల్‌లో సెంచరీతో ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్‌ను అందించిన ట్రావిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సెమీఫైనల్‌తో పాటు ఫైనల్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న నాలుగో క్రికెటర్‌గా ట్రావిస్ హెడ్ నిలిచాడు. ఈ జాబితాలో ఇంతకుముందు మోహిందర్ అమర్‌నాథ్, అరవింద డిసిల్వా, షేన్ వార్న్ ఉన్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మెడల్‌ను హెడ్‌కు సచిన్ అందజేశాడు.
వరల్డ్ కప్‌లో హయ్యస్ట్ స్కోరర్‌గా కోహ్లి....
వరల్డ్ కప్‌లో హయ్యెస్ట్ స్కోరర్‌గా 765 రన్స్‌తో కోహ్లి టాప్ ప్లేస్ లో నిలిచాడు. అతడి తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (597 రన్స్), డికాక్ (594 రన్స్), రచిన్ రవీంద్ర (578 రన్స్) ఉన్నారు.
హయ్యెస్ట్ వికెట్స్
వరల్డ్ కప్‌లో హయ్యెస్ట్ వికెట్స్ తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. 24 వికెట్లతో షమీ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఆస్ట్రేలియా స్పిన్సర్ ఆడమ్ జంపా 23 వికెట్లతో సెకండ్ ప్లేస్ ను దక్కించుకున్నాడు