Virat Kohli: నాలుగో స్థానంలో కోహ్లి ఆడాలి - టీమీండియా బ్యాటింగ్ ఆర్డర్‌ఫై డివిలియర్స్ కామెంట్స్
Virat Kohli: ఆసియా కప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కోహ్లి బ్యాటింగ్ ఆర్డర్ మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. కోహ్లి బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై డివిలియర్స్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Virat Kohli: ఆసియా కప్‌తో వన్డే వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా కూర్పుపై గత కొంతకాలంగా అనేక ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీగా మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా కోహ్లిని రెగ్యులర్‌గా వచ్చే మూడో స్థానంలోనే కొనసాగించాలా లేదంటే నాలుగో స్థానంలో అతడు బ్యాటింగ్ దించాలా అనే విషయంలో బీసీసీఐ తర్జనభర్జనలు పడుతోంది. ఆసియా కప్‌తో పాటు వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో బరిలో దిగితే మంచిదంటూ టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్ చేశాడు.
రవిశాస్త్రి సలహాను గౌతమ్ గంభీర్ తోసిపుచ్చాడు. నాలుగో స్థానంలో కోహ్లిని బ్యాటింగ్ దించాలనే ప్రయోగం సక్సెస్ కాదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి బ్యాటింగ్ మార్పుపై మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాలుగో స్థానంలో కోహ్లి పర్‌ఫెక్ట్‌గా సరిపోతాడని తెలిపాడు.
రెగ్యులర్‌గా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికే కోహ్లి ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఆ స్థానంలోనే ఎక్కువ పరుగులు చేశాడు. కానీ జట్టు ప్రయోజనాల పరంగా చూసుకుంటే కోహ్లి నాలుగో స్థానంలో ఆడటమే మంచిదని నా అభిప్రాయం అని డివిలియర్స్ అన్నాడు మిడిల్ ఆర్డర్‌లో ఏ స్థానంలోనైనా రాణించగలిగిన సామర్థ్యాలు కోహ్లిలో ఉన్నాయని డివిలియర్స్ పేర్కొన్నాడు. కోహ్లి గురించి డివిలియర్స్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.