Kohli gets trolled : పాండ్యాను 'బూ' చేయొద్దని కోరిన కోహ్లీపై ముంబై ఫ్యాన్స్​ ట్రోల్స్​!-kohli gets trolled for asking mumbai indians fans to cheer for hardik pandya ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kohli Gets Trolled : పాండ్యాను 'బూ' చేయొద్దని కోరిన కోహ్లీపై ముంబై ఫ్యాన్స్​ ట్రోల్స్​!

Kohli gets trolled : పాండ్యాను 'బూ' చేయొద్దని కోరిన కోహ్లీపై ముంబై ఫ్యాన్స్​ ట్రోల్స్​!

Sharath Chitturi HT Telugu
Apr 12, 2024 12:10 PM IST

Kohli gets trolled : పాండ్యాను 'బూ' చేయొద్దని కోరిన కోహ్లీపై ముంబై ఫ్యాన్స్​ ట్రోల్స్​ చేస్తున్నారు. ముంబై వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ తర్వాత.. ఈ వ్యవహారం సోషల్​ మీడియాకు ఎక్కింది!

విరాట్​ కోహ్లీపై ముంబై ఫ్యాన్స్​ ట్రోల్స్​..
విరాట్​ కోహ్లీపై ముంబై ఫ్యాన్స్​ ట్రోల్స్​.. (INDRANIL MUKHERJEE / AFP)

MI vs RCB IPl 2024 : ఐపీఎల్​ 2024 ముంబై ఇండియన్స్​ వర్సెస్​ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మ్యాచ్​లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్​గా మారింది. ఎంఐ కెప్టెన్​ హార్దిక్​ పాండ్యాపై ఆ జట్టు ఫ్యాన్స్​ కోపంగా ఉన్న విషయం తెలిసిందే. అతను ఎప్పుడు కనిపించినా.. అందరు 'బూ' చేస్తున్నారు. కాగా.. అలా చేయొద్దని ఆర్సీబీ ప్లేయర్​ విరాట్​ కోహ్లీ కోరాడు. హార్దిక్ పాండ్యాను హేళన చేయడం విషయాన్ని పక్కన పెడితే.. విరాట్​ కోహ్లీని మాత్రం ముంబై ఫ్యాన్స్​ విపరీతంగా ట్రోల్​ చేస్తున్నారు.

ఎంఐ వర్సెస్​ ఆర్సీబీ.. ఇదీ జరిగింది..

ఐపీఎల్​ 2024లో రోహిత్​ శర్మను తప్పించి, హార్దిక్​ పాండ్యాకు ముంబై ఇండియన్స్​ కెప్టెన్సీ బాధత్యలు అప్పగించడం.. ఆ టీమ్​ ఫ్యాన్స్​కి నచ్చలేదు. అందుకే.. పాండ్యాను విపరీతంగా బూ చేస్తున్నారు. ఇక ముంబైలో ఆర్సీబీతో గురువారం జరిగిన మ్యాచ్​లో కూడా ఇదే కనిపించింది. హార్దిక్​ బౌలింగ్​ చేస్తున్నప్పుడు.. ప్రేక్షకులు హేళన చేశారు. అతను బ్యాటింగ్​కి దిగినప్పుడు కూడా.. పాండ్యాకు వ్యతిరేకంగా అరిచారు.

Virat Kohli Hardik Pandya : ఆ సమయంలో గ్రౌండ్​లో ఫీల్డింగ్​ చేస్తున్నాడు విరాట్​ కోహ్లీ. హార్దిక్​ని బూ చేయొద్దని.. ప్రేక్షకులను కోరాడు. అతను ఒక టీమిండియా ప్లేయర్​ని గుర్తు చేశాడు.

కోహ్లీ ఇలా స్టాండ్​ తీసుకోవడాన్ని కొందరు అభినందిస్తున్నారు. కానీ చాలా మంది అతడని కూడా ట్రోల్​ చేయడం మొదలుపెట్టారు. సోషల్​ మీడియాలో.. కోహ్లీపై ట్రోల్స్​ విపరీతంగా వైరల్​ అవుతున్నాయి.

Hardik Pandya Mumbai Indians : "గంభీర్​ని ఆర్సీబీ ఫ్యాన్స్​ ఏమైనా అంటే.. కోహ్లీ సంతోషంగా ఉంటాడు. రోహిత్​ వడాపావ్​ అని ఆర్సీబీ ఫ్యాన్స్​ అంటే.. కోహ్లీ హ్యాపీగా ఉంటాడు. గంగూలీ ముందు కోహ్లీ-కోహ్లీ అని అతని ఫ్యాన్స్​ అరిస్తే.. కోహ్లీ సంతోషంగా ఉంటాడు. కానీ 5సార్లు కప్​ అందించిన కెప్టెన్​ని తొలగించి, కెప్టెన్​ బాధ్యతలు తీసుకున్న ప్లేయర్​ని ఏమైనా అంటే.. బ్రదర్​కి సమస్య అవుతుంది! కోహ్లీ చాలా హిపోక్రటిక్​!" అని ఓ వ్యక్తి ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

"చోక్లీ ఒక అటెన్షన్​ సీకర్​. ఓటమిని ఎలా కవర్​ చేసుకోవాలో అతనికి బాగా తెలుసు," అని మరో వ్యక్తి పేర్కొన్నారు. "రోహిత్​ వ్యక్తిగత విషయాల్లో దూరకు. నీ హోం గ్రౌండ్​లో రోహిత్​ని అందరు బూ చేస్తున్నప్పుడు.. నువ్వెక్కడున్నావు?" అని మరో ముంబై ఇండియన్స్​ ఫ్యాన్​ కామెంట్​ చేశాడు.

Virat Kohli trolled : "2003లో గంభీర్​- నవీన్​తో గొడవపడ్డాడు. 2022లో 45 బాల్స్​లో 50 రన్స్​ చేసి అనుష్కకు ఫ్లైయింగ్​ కిస్​ ఇచ్చాడు. ఐపీఎల్​ 2024లో ఇప్పుడిద. చాలా డ్రామా! లైమ్​లైట్​లో ఉండేందుకు చాలా ప్రయత్నిస్తున్నాడు," అని మరో ట్విట్టర్​ యూజర్​ రాసుకొచ్చారు.

"సీఎస్కే- మా కెప్టెన్​.. టీమ్​కి 5 సార్లు కప్​ ఇచ్చాడు. ముంబై- మా ఎక్స్​ కెప్టెన్​.. టీమ్​కి 5సార్లు ట్రోఫీని అందించాడు. ఆర్సీబీ- మా ఎక్స్​ కెప్టెన్​.. మరో ప్లేయర్​ని బూ చేయకుండా ఆపాడు," అని ఓ నెటిజన్​ సైటర్​ వేశాడు.

ముంబై ఇండియన్స్​ వర్సెస్​ ఆర్సీబీ..

Mi vs RCB IPL 2024 scorecard : ఇక మ్యాచ్​ విషయానికొస్తే.. ఐపీఎల్​ 2024లో ఆర్సీబీ పరాజయ పరంపర కొనసాగుతోంది. గురువారం జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ దారుణంగా ఓటమి పాలైంది. 196 వంటి భారీ టార్గెట్​ని 27 బాల్స్​ మిగిలి ఉండగానే కొట్టిపాడేసింది ఎంఐ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం