IPL 2025 RR vs RCB: అదరగొట్టిన కోహ్లి, సాల్ట్.. రాజస్థాన్ ను చిత్తుచిత్తుగా ఓడించిన ఆర్సీబీ-kohli and salts explosive performance leads royal challengers bengaluru to victory over rajasthan ipl 2025 rcb vs rr ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Rr Vs Rcb: అదరగొట్టిన కోహ్లి, సాల్ట్.. రాజస్థాన్ ను చిత్తుచిత్తుగా ఓడించిన ఆర్సీబీ

IPL 2025 RR vs RCB: అదరగొట్టిన కోహ్లి, సాల్ట్.. రాజస్థాన్ ను చిత్తుచిత్తుగా ఓడించిన ఆర్సీబీ

IPL 2025 RR vs RCB: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. గ్రీన్ జెర్సీతో ఆడిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.

సత్తాచాటిన సాల్ట్, కోహ్లి (PTI)

ఐపీఎల్ 2025లో ప్రత్యర్థి గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయ పరంపర కొనసాగుతోంది. హోం గ్రౌండ్ లో రెండు మ్యాచ్ లు ఓడిన ఆర్సీబీ.. అపోనెంట్ స్టేడియాల్లో మాత్రం నాలుగో విక్టరీని ఖాతాలో వేసుకుంది. ఆదివారం (ఏప్రిల్ 13) జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుచిత్తుగా ఓడించింది.

ఛేజింగ్ లో ఆర్సీబీ ఒకటే వికెట్ కోల్పోయి 17.3 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), విరాట్ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఫామ్ కొనసాగించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 173/4 స్కోరు చేసింది.

సాల్ట్ అదుర్స్

బ్యాటింగ్ కు పిచ్ కష్టంగానే ఉన్నప్పటికీ.. ఆర్సీబీ ఓపెనర్లు చెలరేగడంతో ఆ టీమ్ గెలుపు దిశగా దూసుకెళ్లింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి రెచ్చిపోయారు. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్ తో రాజస్థాన్ బౌలర్లను చితక్కొట్టాడు. దొరికిన బంతిని దొరికినట్లు చితకబాదాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కే బౌండరీ బాదిన సాల్ట్ టాప్ గేర్ లో సాగిపోయాడు. ముఖ్యంగా డేంజర్ పేసర్ ఆర్చర్ ను టార్గెట్ చేసుకుని మరీ బౌండరీలు రాబట్టాడు.

కోహ్లి కూడా

బౌండరీలతో చెలరేగిపోతున్న సాల్ట్ కు కోహ్లి చక్కగా కోఆపరేట్ చేశాడు. స్టార్టింగ్ లో నెమ్మదిగానే ఆడినా క్లాసికల్ షాట్లతో అదరగొట్టాడు. మరోవైపు సాల్ట్ 28 బాల్స్ లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత సాల్ట్ ఔటైనా.. దేవ్ దత్, కోహ్లి కలిసి టీమ్ ఛేజింగ్ కంప్లీట్ చేశారు. వికెట్ పడ్డాక గేరు మార్చిన కోహ్లి సిక్సర్ తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. టీ20ల్లో కోహ్లికి ఇది వందో ఫిఫ్టీ కావడం విశేషం.

పడిక్కల్ వరుస ఫెయిల్యూర్స్ తర్వాత తిరిగి ఫామ్ అందుకున్నాడు. చక్కటి షాట్లు కొట్టాడు. ఫోర్ తో మ్యాచ్ ముగించాడు. కోహ్లి 45 బంతుల్లో 62 నాటౌట్ గా నిలిచాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. దేవ్ దత్ పడిక్కల్ 28 బంతుల్లో 40 నాటౌట్ గా నిలిచాడు. 5 ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు.

జైస్వాల్ దంచికొట్టినా

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టాడు. అయినా పుంజుకున్న ఆర్సీబీ బౌలర్లు రాజస్థాన్ ను భారీ స్కోరు చేయకుండా బ్రేక్ వేశారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే జైస్వాల్ బౌండరీల వేటలో దూసుకెళ్లాడు.

కెప్టెన్ సంజు శాంసన్ (15) మళ్లీ ఫెయిలైనా జైస్వాల్, రియాన్ పరాగ్ (30) కలిసి స్కోరుబోర్డును నడిపించారు. కానీ పరాగ్ స్పీడ్ గా ఆడలేకపోయాడు. యశస్వి ను ఎల్బీగా ఔట్ చేశాడు హేజిల్ వుడ్. ఆ తర్వాత ఇన్నింగ్స్ వేగం తగ్గింది. ధ్రువ్ జూరెల్ (35 నాటౌట్) నిలబడ్డా రాజస్థాన్ 180 కంటే తక్కువ స్కోరే చేసింది.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం