ఐపీఎల్ 2025.. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. అలాంటి కీలక పోరుతో గుజరాత్ టైటాన్స్ పై కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) అదరగొట్టాడు. ఒంటిచేత్తో జట్టు బ్యాటింగ్ ను నడిపించాడు. సెంచరీతో టీమ్ కు పోరాడే స్కోరు అందించాడు.
ఆదివారం (మే 18) హౌం గ్రౌండ్ లో ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ కు ఇది అయిదో సెంచరీ.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ కు కేెఎల్ రాహుల్ వెన్నెముకలా నిలిచాడు. అంతా తానై బ్యాటింగ్ కొనసాగించాడు. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసులో ఢిల్లీకి డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో ఈ సీజన్ లో తొలిసారి ఓపెనర్ గా బరిలో దిగాడు రాహుల్. కానీ డీసీ ఇన్నింగ్స్ స్లోగా స్టార్ట్ అయింది. 4 ఓవర్లకు స్కోరు 19/1. డుప్లెసిస్ పెవిలియన్ చేరిపోయాడు. కానీ ఆ తర్వాత రాహుల్ విధ్వంసం స్టార్ట్ అయింది.
సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 5 ఓవర్లో రెండు ఫోర్లతో రాహుల్ స్పీడ్ అందుకున్నాడు. ఆ తర్వాత రబాడ ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ అందుకున్నాడు. డ్రగ్స్ వాడటంతో నిషేధం ఎదుర్కొన్న రబాడకు నెల రోజుల తర్వాత ఇదే తొలి మ్యాచ్. మరో ఎండ్ లో అభిషేక్ పోరెల్ (19 బంతుల్లో 30) నెమ్మదిగా ఆడటంతో 10 ఓవర్లకు డీసీ 81/1తో నిలిచింది.
నెల రోజులకు పైగా విరామం తర్వాత ఆడుతున్న రబాడను టార్గెట్ చేసుకుని రాహుల్, పోరెల్ గేరు మార్చారు. రబాడ ఓవర్లో చెరో సిక్సర్ బాదేశారు. కానీ సాయి కిశోర్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టిన వెంటనే పోరెల్ ఔట్ అయ్యాడు. అయినా రాహుల్ బాదుడు ఆపలేదు. కెప్టెన్ అక్షర్ పటేల్ తో కలిసి టీమ్ ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. సాయి కిశోర్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు కేఎల్.
16 ఓవర్లకు 151/2తో నిలిచింది డీసీ. అక్షర్ ను ఔట్ చేసిన ప్రసిద్ధ్ 17వ ఓవర్లో 7 పరుగులే ఇచ్చాడు. 15 నుంచి 18 వరకు నాలుగు ఓవర్లలో కేఎల్ రాహుల్ 6 బాల్స్ మాత్రమే ఆడాడు. దీంతో టీమ్ 200 చేయడంపై సందేహాలు వచ్చాయి.
కానీ ప్రసిద్ధ్ వేసిన 19వ ఓవర్లో రాహుల్ సిక్సర్, ఫోర్ కొట్టి హండ్రెడ్ కంప్లీట్ చేసుకున్నాడు. సిరాజ్ వేసిన లాస్ట్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు కేఎల్. స్టబ్స్ కూడా సిక్సర్ కొట్టడంతో డీసీ 200 టార్గెట్ సెట్ చేసింది.
సంబంధిత కథనం