KL Rahul Bowled: ఏంటిది రాహుల్.. ఇలా కూడా ఔటవుతారా.. వీడియో వైరల్ కొనసాగుతున్న చెత్త ఫామ్..-kl rahul bowled strangely india a vs australia a four day match ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kl Rahul Bowled: ఏంటిది రాహుల్.. ఇలా కూడా ఔటవుతారా.. వీడియో వైరల్ కొనసాగుతున్న చెత్త ఫామ్..

KL Rahul Bowled: ఏంటిది రాహుల్.. ఇలా కూడా ఔటవుతారా.. వీడియో వైరల్ కొనసాగుతున్న చెత్త ఫామ్..

Hari Prasad S HT Telugu
Nov 08, 2024 04:36 PM IST

KL Rahul Bowled: కేఎల్ రాహుల్ చెత్త ఫామ్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఎ టీమ్ తో జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్ లో అతడు బౌల్డ్ అయిన విధానం చూసి అభిమానులు, క్రికెట్ పండితులు షాక్ తింటున్నారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.

ఏంటిది రాహుల్.. ఇలా కూడా ఔటవుతారా.. వీడియో వైరల్ కొనసాగుతున్న చెత్త ఫామ్..
ఏంటిది రాహుల్.. ఇలా కూడా ఔటవుతారా.. వీడియో వైరల్ కొనసాగుతున్న చెత్త ఫామ్..

KL Rahul Bowled: టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ పరుగులు చేయడానికి కిందా మీదా పడుతున్నాడు. అంతేకాదు ఔటయ్యేందుకు కొత్త కొత్త విధానాలు వెతుక్కుంటున్నట్లు తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఎ టీమ్‌తో జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్ లో ఇండియా ఎ టీమ్ తరఫున బరిలోకి దిగిన రాహుల్.. తొలి ఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 10 పరుగులు మాత్రమే చేశాడు.

కేఎల్ రాహుల్.. ఇలా కూడా ఔటవుతారా?

కేఎల్ రాహుల్ చెత్త ఫామ్ కొనసాగుతుండటం ఒకెత్తయితే.. ఆస్ట్రేలియా ఎ టీమ్ తో రెండో ఇన్నింగ్స్ లో అతడు ఔటైన విధానం మరో ఎత్తు. ఓ స్పిన్నర్ బౌలింగ్ లో చాలా దారుణమైన రీతిలో అతడు బౌల్డవడం గమనార్హం. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లో అక్కడి ఎ టీమ్ తో ఈ అనధికారిక నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతోంది.

ఇందులో రెండో రోజు ఆటలో రాహుల్ స్పిన్నర్ కోరే రోచ్చిక్కియోలీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు పేస్ బౌలర్లు స్కాట్ బోలాండ్, బ్యూ వెబ్‌స్టర్, నేథన్ మెకండ్రూలను సమర్థంగా ఎదుర్కొన్న అతడు.. ఈ స్పిన్నర్ బౌలింగ్ లో అయోమయానికి గురయ్యాడు.

18వ ఓవర్ తొలి బంతి లెగ్ సైడ్ వెళ్తున్నట్లుగా భావించి దానిని అలా కొట్టకుండా వదిలేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బంతి అతని కాళ్ల మధ్యలో నుంచి ప్యాడ్ కు తగిలి తర్వాత వికెట్లను గిరాటేసింది. అది చూసి రాహుల్ షాక్ తిన్నాడు. 44 బంతులు ఆడిన రాహుల్ కేవలం 10 పరుగులు చేసి ఔటయ్యాడు.

వచ్చిన ఛాన్స్ వదులుకొని..

కేఎల్ రాహుల్ ఔటైన విధానం ఎవరికీ మింగుడు పడటం లేదు. ఇలా కూడా ఔటవుతారా అంటూ అభిమానులు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ అందుబాటులో ఉండటం అనుమానమే అన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో రాహుల్ ఓపెనింగ్ చేశాడు. వచ్చిన అవకాశాన్ని అతడు వాడుకోలేకపోయాడు.

తొలి ఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 10 పరుగులే చేశాడు. అతనితోపాటు ముందుగానే ఆస్ట్రేలియా వెళ్లిన మరో వికెట్ కీపర్ ధృవ్ జురెల్ మాత్రం తొలి ఇన్నింగ్స్ లో 80 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ 19 పరుగులతో ఆడుతున్నాడు.

ఈ మ్యాచ్ లో ఇండియా ఎ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 161 పరుగులకే కుప్పకూలింది. తర్వాత ఆస్ట్రేలియా 223 రన్స్ చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా ఎ కేవలం 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కేవలం 11 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో ఇండియా ఎ టీమ్ ఓటమి తప్పేలా లేదు.

Whats_app_banner