KKR vs SRH IPL 2024 Final Live Updates: ఐపీఎల్ 2024 విజేత కేకేఆర్.. మూడో ట్రోఫీ సొంతం.. కంటతడి పెట్టిన సన్‍రైజర్స్ ఓనర్-kkr vs srh ipl 2024 final live updates sunrisers hyderabad vs kolkata knight riders ipl 2024 final live score ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kkr Vs Srh Ipl 2024 Final Live Updates: ఐపీఎల్ 2024 విజేత కేకేఆర్.. మూడో ట్రోఫీ సొంతం.. కంటతడి పెట్టిన సన్‍రైజర్స్ ఓనర్

KKR vs SRH IPL 2024 Final Live Updates: ఐపీఎల్ 2024 విజేత కేకేఆర్.. మూడో ట్రోఫీ సొంతం(ANI)

KKR vs SRH IPL 2024 Final Live Updates: ఐపీఎల్ 2024 విజేత కేకేఆర్.. మూడో ట్రోఫీ సొంతం.. కంటతడి పెట్టిన సన్‍రైజర్స్ ఓనర్

06:34 PM ISTMay 27, 2024 12:04 AM Hari Prasad S
  • Share on Facebook
06:34 PM IST

  • KKR vs SRH IPL 2024 Final Live Updates: ఐపీఎల్ 2024 సీజన్ విజేతగా కోల్‌కతా నైట్‍రైడర్స్ నిలిచింది. ఆదివారం (మే 26) జరిగిన ఫైనల్లో సన్‍రైజర్స్ హైదరాబాద్‍ను చిత్తుగా ఓడించి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 114 రన్స్ లక్ష్యాన్ని కేవలం 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది కేకేఆర్.

Mon, 27 May 202406:34 PM IST

నితీశ్ రెడ్డికి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు

సన్‍రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి ఐపీఎల్ 2024 సీజన్‍లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు దక్కింది. ఈ సీజన్‍లో నితీశ్ 303 పరుగులు చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు.

Sun, 26 May 202405:28 PM IST

గంభీర్‌కు షారూఖ్ ముద్దు

కోల్‍కతా నైట్‍రైడర్స్ టైటిల్ గెలువడంతో బాలీవుడ్ బాద్‍షా, ఆ జట్టు కో-ఓనర్ షారుఖ్ ఖాన్ సెలెబ్రేట్ చేసుకున్నారు. కేకేఆర్ ఆటగాళ్లను కౌగిలించుకుంటూ అభినందించారు. కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్‌కు నుదున ముద్దు పెట్టాడు షారూఖ్.

Sun, 26 May 202405:05 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: మూడోసారి కేకేఆర్‌కు ఐపీఎల్ ట్రోఫీ

ఐపీఎల్ ట్రోఫీని మూడు అంతకంటే ఎక్కువ సార్లు గెలిచిన మూడో టీమ్ కేకేఆర్. ఇంతకుముందు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదేసిసార్లు గెలిచాయి. కేకేఆర్ 2012, 2014లలోనూ ట్రోఫీ గెలిచింది. 2021లో ఫైనల్లో ఓడింది. ఇప్పుడు 2024లో మూడోసారి ట్రోఫీ సాధించింది.

Sun, 26 May 202404:58 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: సన్ రైజర్స్ ఓటమి.. కంటతడి పెట్టిన కావ్య మారన్

సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 ఫైనల్లో ఓడిపోయింది. కేకేఆర్ చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్ కంటతడి పెట్టింది.

Sun, 26 May 202404:55 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: ఐపీఎల్ 2024 విజేత కేకేఆర్.. మూడో ట్రోఫీ సొంతం

ఐపీఎల్ 2024 విజేతగా కేకేఆర్ నిలిచింది. ఆ జట్టుకు ఇది మూడో ఐపీఎల్ ట్రోఫీ కావడం విశేషం. 114 రన్స్ లక్ష్యాన్ని ఆ టీమ్ కేవలం 10.3 ఓవర్లలోనే చేజ్ చేసింది. వెంకటేశ్ అయ్యర్ కేవలం 26 బంతుల్లో 52 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.

Sun, 26 May 202404:49 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. విజయానికి ఇంకా 12 పరుగులే

కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. గుర్బాజ్ (39) ఔటయ్యాడు. అయితే ఆ టీమ్ విజయానికి మరో 12 పరుగులే అవసరం.

Sun, 26 May 202404:43 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: కేకేఆర్ 8 ఓవర్లలోనే 93 రన్స్.. మూడో ట్రోఫీ పక్కా

కేకేఆర్ 8 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 93 రన్స్ చేసింది. వెంకటేశ్ అయ్యర్, గుర్బాజ్ సన్ రైజర్స్ బౌలర్లను ఆటాడుకుంటున్నారు. మరో 21 రన్స్ చేస్తే చాలు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కేకేఆర్ సొంతమవుతుంది.

Sun, 26 May 202404:32 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: దంచి కొడుతున్న వెంకటేశ్ అయ్యర్.. మూడో ఐపీఎల్ ట్రోఫీ వైపు కేకేఆర్

వెంకటేశ్ అయ్యర్ దంచి కొడుతున్నాడు. దీంతో కేకేఆర్ కేవలం 114 పరుగుల లక్ష్యాన్ని సులువుగా చేజ్ చేసేలా ఉంది. అదే జరిగితే మూడో ఐపీఎల్ ట్రోఫీ వాళ్ల సొంతమవుతుంది. పవర్ ప్లే 6 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 72 రన్స్ చేసింది. వెంకటేశ్ అయ్యర్ 12 బంతుల్లో 40 రన్స్ క్రీజులో ఉన్నాడు.

Sun, 26 May 202404:15 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: టార్గెట్ వైపు దూసుకెళ్తున్న కేకేఆర్. 3 ఓవర్లలోనే 37 రన్స్

కేకేఆర్ టార్గెట్ వైపు దూసుకెళ్తోంది. మూడు ఓవర్లలోనే 37 రన్స్ చేసింది. మూడో ఓవర్లో 20 రన్స్ వచ్చాయి. భువనేశ్వర్ బౌలింగ్ లో వెంకటేశ్ అయ్యర్ 2 సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టాడు.

Sun, 26 May 202404:06 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. నరైన్ ఔట్

కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ (6) ఔటయ్యాడు. తొలి బంతికే సిక్స్ కొట్టిన అతడు.. రెండో బంతికే ఔటయ్యాడు. కమిన్స్ ఈ వికెట్ తీశాడు.

Sun, 26 May 202404:04 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: కేకేఆర్ ఇన్నింగ్స్.. పూర్తయిన తొలి ఓవర్

114 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి ఓవర్లో వికెట్ నష్టపోకుండా 5 రన్స్ చేసింది. గుర్బాజ్, నరైన్ క్రీజులో ఉన్నారు.

Sun, 26 May 202403:47 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: కేకేఆర్ బౌలర్ల హవా

కేకేఆర్ బౌలర్లు సత్తా చాటారు. రసెల్ 3 వికెట్లు తీసుకున్నాడు. స్టార్క్, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఇక వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు. సన్ రైజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ కమిన్స్ చేసిన 24 పరుగులకే అత్యధికం కావడం గమనార్హం. మార్‌క్రమ్ 20, క్లాసెన్ 16, నితీష్ 13 రన్స్ చేశారు. అభిషేక్ శర్మ (2), హెడ్ (0), త్రిపాఠీ (9), షాబాజ్ (8), సమద్ (4) దారుణంగా విఫలమయ్యారు.

Sun, 26 May 202403:43 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: 113 పరుగులకే కుప్పకూలిన సన్ రైజర్స్

ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 113 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కమిన్స్ (24) చివరి వికెట్ గా వెనుదిరిగాడు. ఓ ఐపీఎల్ ఫైనల్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

Sun, 26 May 202403:39 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: తొమ్మిదో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్.. ఉనద్కట్ ఔట్

సన్ రైజర్స్ హైదరాబాద్ 9వ వికెట్ కోల్పోయింది. 113 పరుగుల దగ్గర ఈ వికెట్ పడింది. జైదేవ్ ఉనద్కట్ 4 రన్స్ చేసి ఔటయ్యాడు.

Sun, 26 May 202403:29 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: 16 ఓవర్లలో సన్ రైజర్స్ 8 వికెట్లకు 98 రన్స్

ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్ రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ఆ టీమ్ 16 ఓవర్లలో 8 వికెట్లకు 98 రన్స్ మాత్రమే చేసింది. కమిన్స్, ఉనద్కట్ క్రీజులో ఉన్నారు.

Sun, 26 May 202403:18 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: ఎనిమిదో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్.. క్లాసెన్ ఔట్

సన్ రైజర్స్ హైదరాబాద్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్లాసెన్ (16) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో సన్ రైజర్స్ 14.1 ఓవర్లలో 90 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.

Sun, 26 May 202403:11 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: ఏడో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్.. సమద్ ఔట్

సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడో వికెట్ కోల్పోయింది. అబ్దుల్ సమద్ (4) కూడా పెవిలియన్ చేరాడు. రసెల్ రెండో వికెట్ తీసుకున్నాడు. సన్ రైజర్స్ 12.4 ఓవర్లలో 7 వికెట్లకు 77 రన్స్ చేసింది.

Sun, 26 May 202403:05 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: ఆరో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్.. షాబాజ్ ఔట్

సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో షాబాజ్ అహ్మద్ (8) ఔటయ్యాడు. దీంతో సన్ రైజర్స్ 11.5 ఓవర్లలో 6 వికెట్లకు 71 రన్స్ చేసింది.

Sun, 26 May 202402:59 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: ఐదో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్.. మార్‌క్రమ్ కూడా ఔట్

సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు వికెట్లు కోల్పోయింది. మార్‌క్రమ్ 23 బంతుల్లో 20 రన్స్ చేసి ఔటయ్యాడు. రసెల్ ఐదో వికెట్ తీసుకున్నాడు.

Sun, 26 May 202402:57 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: ముగిసిన పది ఓవర్లు.. సన్ రైజర్స్ 4 వికెట్లకు 61 రన్స్

సన్ రైజర్స్ ఇన్నింగ్స్ 10 ఓవర్లు ముగిశాయి. 4 వికెట్లకు 61 రన్స్ చేసింది. మార్‌క్రమ్, క్లాసెన్ క్రీజులో ఉన్నారు. అభిషేక్, హెడ్, రాహుల్ త్రిపాఠీ, నితీష్ ఔటయ్యారు.

Sun, 26 May 202402:43 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: నాలుగో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్

సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. నితీష్ కుమార్ రెడ్డి (13) పెవిలియన్ చేరాడు. దీంతో సన్ రైజర్స్ 7 ఓవర్లలో 4 వికెట్లకు 47 రన్స్ చేసింది.

Sun, 26 May 202402:38 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: ముగిసిన పవర్ ప్లే.. సన్ రైజర్స్ 40/3

పవర్ ప్లే ముగిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లకు 40 రన్స్ చేసింది. మార్‌క్రమ్, నితీష్ కుమార్ రెడ్డి క్రీజులో ఉన్నారు. స్టార్క్ 2, వైభవ్ అరోరా ఒక వికెట్ తీసుకున్నారు.

Sun, 26 May 202402:27 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: మూడో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్

సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. రాహుల్ త్రిపాఠీ (9) కూడా పెవిలియన్ చేరాడు. స్టార్క్ రెండో వికెట్ తీసుకున్నాడు.

Sun, 26 May 202402:24 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: ముగిసిన నాలుగు ఓవర్లు

సన్ రైజర్స్ ఇన్నింగ్స్ 4 ఓవర్లు ముగిశాయి. హైదరాబాద్ టీమ్ 2 వికెట్లకు 21 రన్స్ చేసింది.

Sun, 26 May 202402:18 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: మూడో ఓవర్లో రెండు ఫోర్లు

మూడో ఓవర్లో రెండు ఫోర్లు వచ్చాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లకు 15 రన్స్ చేసింది.

Sun, 26 May 202402:14 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: హెడ్ డకౌట్.. సన్ రైజర్స్ రెండు వికెట్లు డౌన్

సన్ రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ (0) గోల్డెన్ డకౌట్ అయ్యాడు. వైభవ్ అరోరా బౌలింగ్ లో రెండో ఓవర్ చివరి బంతికి అతడు ఔటై పెవిలియన్ చేరాడు.

Sun, 26 May 202402:06 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: తొలి ఓవర్లోనే సన్ రైజర్స్ కు షాక్

సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్ తగిలింది. స్టార్క్ బౌలింగ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ (2) ఔటయ్యాడు. స్టార్క్ కళ్లు చెదిరే బాల్ కు అభిషేక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 2 పరుగులకే సన్ రైజర్స్ టీమ్ తొలి వికెట్ కోల్పోయింది.

Sun, 26 May 202401:45 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: పిచ్ చాలా బాగుంది: కమిన్స్

టాస్ తర్వాత సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడాడు. "పిచ్ బాగుంది. వికెట్లను నేను అంతగా రీడ్ చేయలేను. కానీ ఇది మాత్రం బాగుంది. మొన్న మంచు కురవలేదు. ఈరోజు కూడా ఉండేలా లేదు. కానీ చెప్పలేం. మేము ఓ స్టైల్లో ఆడుతున్నాం. కానీ ప్రతిసారీ అది వర్కౌట్ కాదు. ఫైనల్ చేరడం బాగుంది. ఈ పిచ్ పూర్తి వేరుగా ఉంది. సమద్ స్థానంలో షాబాజ్ వచ్చాడు" అని కమిన్స్ చెప్పాడు.

Sun, 26 May 202401:40 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: ఫైనల్ ఆడే కేకేఆర్ తుది జట్టు ఇదే

సునీల్ నరైన్, రహ్మనుల్లా గుర్బాజ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రె రసెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

Sun, 26 May 202401:38 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఇదే

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, ఏడెన్ మార్‌క్రమ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జైదేవ్ ఉనద్కట్, నటరాజన్

Sun, 26 May 202401:33 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: సన్ రైజర్స్ బ్యాటింగ్

ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్.

Sun, 26 May 202401:21 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: పిచ్ ఎలా ఉందంటే..

ఐపీఎల్ 2024 ఫైనల్ కోసం చెన్నైలో వాడబోయే పిచ్ ను ఎర్రమట్టితో తయారు చేశారు. నల్ల మట్టితో తయారు చేసిన పిచ్ తో పోలిస్తే దీనిపై బౌన్స్ ఎక్కువగా ఉంటుందని పిచ్ రిపోర్టు సందర్భంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ చెప్పాడు. ఈ పిచ్ పై 180 నుంచి 190 పరుగులు మంచి స్కోరని కూడా తెలిపాడు. అయితే స్పిన్ కు పెద్దగా అనుకూలించదని హేడెన్ స్పష్టం చేశాడు.

Sun, 26 May 202401:17 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: ఐపీఎల్ ఫైనల్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రికార్డు ఇదీ

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంతకుముందు ఐపీఎల్ ఫైనల్స్ కు మూడుసార్లు వెళ్లింది. అందులో రెండుసార్లు గెలవగా.. ఒకసారి ఓడిపోయింది. 2012లో చెన్నై సూపర్ కింగ్స్ పై 5 వికెట్లతో గెలిచి ట్రోఫీ సాధించింది. తర్వాత 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై మూడు వికెట్లతో విజయం సాధించింది. ఇక 2021లోనూ మరోసారి ఫైనల్ చేరినా.. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో 27 పరుగులతో ఓడిపోయింది. ఇప్పుడు నాలుగోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ తో మూడో టైటిల్ కోసం ఫైట్ చేయబోతోంది.

Sun, 26 May 202401:13 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: ఐపీఎల్ ఫైనల్స్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకూ రెండుసార్లు ఫైనల్స్ కు వెళ్లింది. అందులో ఒకసారి గెలిచి మరోసారి ఓడింది. 2016లో తొలిసారి ఫైనల్ చేరగా.. ఆర్సీబీపై గెలిచి ట్రోఫీ సాధించింది. 2018లో మరోసారి ఫైనల్ చేరినా.. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓటమి తప్పలేదు.

Sun, 26 May 202412:42 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: చెన్నైలో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉందంటే?

చెన్నైలో ప్రస్తుతం వాతావరణం మేఘావృతమై ఉంది. అయితే వీటి వల్ల మ్యాచ్ కు ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఆ లెక్కన ఇవాళే పూర్తి ఫైనల్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Sun, 26 May 202412:11 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: మంచు ప్రభావం ఉంటుందా?

చెన్నైలో జరగబోయే ఐపీఎల్ 2024 ఫైనల్లో మంచు ప్రభావం ఎంత? ఎందుకంటే ఈ మంచు చేజింగ్ జట్టుకు ఎప్పుడూ కలిసి వస్తుంటుంది. అయితే రెండో క్వాలిఫయర్ లో మాత్రం అసలు మంచు కురవలేదు. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ కు బాగా కలిసి వచ్చింది. మన స్పిన్నర్లు చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు 176 రన్స్ టార్గెట్ కూడా చేజ్ చేయలేకపోయారు. మరి ఫైనల్లోనూ అదే జరుగుతుందా? ఒకవేళ మంచు కురిసే అవకాశం లేకపోతే మాత్రం టాస్ కు అంతగా ప్రాధాన్యత ఉండదు.

Sun, 26 May 202412:06 PM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: నైట్ రైడర్స్‌దే పైచేయి

ఐపీఎల్లో సన్ రైజర్స్ పై నైట్ రైడర్స్ దే పైచేయిగా ఉంది. ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకూ 27 మ్యాచ్ లలో తలపడగా.. 18 మ్యాచ్ లలో నైట్ రైడర్స్, 9 మ్యాచ్ లలో సన్ రైజర్స్ గెలిచాయి. ఈ సీజన్లో లీగ్ స్టేజ్ లో ఒకసారి, ప్లేఆఫ్స్ లో మరోసారి నైట్ రైడర్స్ చేతుల్లో సన్ రైజర్స్ ఓడిపోయింది.

Sun, 26 May 202411:27 AM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: దూకుడుగానే ఆడండి: ప్యాట్ కమిన్స్

దూకుడుగా ఆడుతూనే తాము చాలా పటిష్టంగా ఉన్నామని, అదే కొనసాగించాలని ఫైనల్ కు ముందు తమ టీమ్ ప్లేయర్స్ కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పిలుపునిచ్చాడు. అయితే 14 మ్యాచ్ ల సీజన్లో ప్రతి మ్యాచ్ గెలవలేమని, కానీ చాలా వరకు విజయం సాధించినట్లు చెప్పాడు. కమిన్స్ మాటలను బట్టి చూస్తే.. ఫైనల్లోనూ సన్ రైజర్స్ బ్యాటర్లు ధాటిగా ఆడబోతున్నారని స్పష్టమవుతోంది.

Sun, 26 May 202410:39 AM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: నైట్ రైడర్స్ తుది జట్టు ఇదేనా?

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు అంచనా: సునీల్ నరైన్, రహ్మనుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రసెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

ఇంప్లాక్ట్ ప్లేయర్ : వైభవ్ అరోరా

Sun, 26 May 202410:36 AM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: సన్ రైజర్స్ తుది జట్టు ఇదేనా?

సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు అంచనా: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, ఏడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, జైదేవ్ ఉనద్కట్, భువనేశ్వర్ కుమార్

ఇంపాక్ట్ ప్లేయర్: నటరాజన్

Sun, 26 May 202410:32 AM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: స్టార్క్ vs హెడ్.. ఈసారి ఎవరిది పైచేయి?

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ మిచెల్ స్టార్క్ తొలి క్వాలిఫయర్ లో సన్ రైజర్స్ పని పట్టాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను తొలి ఓవర్లోనే ఔట్ చేసి సన్ రైజర్స్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. మరి ఈసారి ఈ ఆస్ట్రేలియన్ల మధ్య పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి నెలకొంది. హెడ్, అభిషేక్ శర్మ కాంబినేషన్ ఈ సీజన్లో మరొక్కసారి తమ కళ్లు చెదిరే ఫామ్ కొనసాగిస్తే చాలు.. కప్పు సన్ రైజర్స్ సొంతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Sun, 26 May 202410:15 AM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: సన్ రైజర్స్, నైట్ రైడర్స్.. రెండూ బ్యాటింగ్ పవర్ హౌజ్‌లే..

సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ ఏడాది ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్ బ్యాటింగ్ పవర్ హౌజ్ లుగా ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ పవర్ హిట్టర్లతో నిండిపోయాయి. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఓవైపు.. సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్, రసెల్, రింకు సింగ్ లాంటి వాళ్లు ఉన్నారు. దీంతో ఫైనల్లో పరుగుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.

Sun, 26 May 202410:09 AM IST

KKR vs SRH IPL 2024 Final Live Updates: మెగా ఫైనల్ ఈరోజే..

నమస్కారం.. ఐపీఎల్ 2024 ఫైనల్ లైవ్ అప్డేట్స్ కు మీకు స్వాగతం. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగబోయే ఈ ఫైనల్ ఫైట్ లైవ్ స్కోర్లు, మిగిలిన అప్డేట్స్ అన్నీ ఇక్కడ చూడండి.