Kavya Maran: కావ్య మారన్ గంతులు - ఆటగాళ్ల కేక్ కటింగ్ - ఎస్ఆర్‌హెచ్ ఫైనల్ సంబరాలపై ఓ లుక్కేయండి!
Kavya Maran: క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఎస్ఆర్‌హెచ్ ఫైనల్ చేరడంతో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్‌తో పాటు ఆటగాళ్లు కూడా సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

Kavya Maran: ఐపీఎల్ 2024 సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 36 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఎనిమిదేళ్ల తర్వాత తమ జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టడంతో సన్‌రైజర్స్ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
క్రికెటర్లతో పాటు టీమ్ ఓనర్ కావ్య మారన్ కూడా పట్టరాని ఆనందంతో గంతులు వేసింది. మ్యాచ్ గెలవగానే ఒక్కసారిగా ఎగిరి గంతేసింది కావ్య మారన్. ఆ తర్వాత విన్నింగ్ సింబల్‌ను చూపిస్తూ ఆనందంతో డ్యాన్సులు చేసింది. తండ్రి కళానిధి మారన్‌ను హగ్ చేసుకొని సంబరాల్ని పంచుకున్నది.
కావ్య మారన్ టెన్షన్...
ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ తక్కువ స్కోరు చేయడంతో కావ్య టెన్షన్‌గా కనిపించింది. కానీ బౌలర్ల విజృంభనంతో ఆమె ముఖం వెలిగిపోయింది. ఆమె విన్నింగ్ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
కేక్ కటింగ్ సెలబ్రేషన్స్...
మరోవైపు తమ టీమ్ ఫైనల్‌లోకి అడుగుపెట్టడంతో ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు కూడా సంబరాలు చేసుకున్నారు. తాము బస చేసిన హోటల్‌లో కేక్ కట్ చేసి విన్నింగ్ సెలబ్రేషన్స్‌ను జరుపుకున్నారు. క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్‌తో అదరగొట్టిన అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్ కేక్ కట్ చేశారు.
ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ ముఖానికి కేక్ మొత్తం పూయడంతో మిగిలిన ఆటగాళ్లు కేకలు వేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న షాబాజ్ అహ్మద్ తమ టీమ్ సెలబ్రేషన్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తమ సెలబ్రేషన్స్‌ను ఫైనల్ కోసం దాచుకున్నామని, టైటిల్ గెలిచిన తర్వాతే గెలుపు సంబరాలు చేసుకుంటామని అన్నాడు.
షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ...
క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఇరవై ఓవర్లలో 175 పరుగులు మాత్రమే చేసింది.176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్ రైజర్స్ తరఫున ఇంప్టాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన షాబాజ్ అహ్మద్ 4 ఓవర్లలో కేవలం 23 పరుగులకే 3 వికెట్లు తీసుకున్నాడు. అభిషేక్ శర్మ కూడా 4 ఓవర్లలో 24 పరుగులకే 2 వికెట్లు తీశాడు. రాయల్స్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు.
ధృవ్ జురేల్ హాఫ్ సెంచరీ...
రాయల్స్ తరఫున ధృవ్ జురెల్ 35 బంతుల్లోనే 56 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 42 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఓపెనర్ కాడ్మోర్ (10), సంజూ శాంసన్ (10), రియాన్ పరాగ్ (6), అశ్విన్ (0), హెట్‌మయర్ (4) దారుణంగా ఫెయిలయ్యారు. దీంతో రాయల్స్ అసలు మ్యాచ్ లో తలవంచింది.
క్లాసెన్ ఒక్కడే..
సన్ రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు. క్లాసెన్ 34 బంతుల్లో 4 సిక్స్ లతో 50 రన్స్ చేశాడు. క్లాసెన్ తర్వాత రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 37 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్ కూడా 28 బంతుల్లో 34 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ ముగ్గురు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ రాణించలేకపోవడంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులకే పరిమితమైంది.