Kapil Dev on Bumrah: టీమ్‌లో లేనివాళ్ల గురించి ఎందుకు మాట్లాడటం.. ఇది టీమ్ గేమ్: బుమ్రా లేకపోవడంపై కపిల్ ఘాటు కామెంట్స్
Kapil Dev on Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా లేకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కాస్త ఘాటుగానే స్పందించాడు. టీమ్ లేని వాళ్ల గురించి ఎందుకు మాట్లాడటం.. క్రికెట్ ఓ టీమ్ గేమ్ అని గుర్తు చేయడం గమనార్హం.

Kapil Dev on Bumrah: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. కీలకమైన ప్లేయర్స్ తరచూ గాయాల బారిన పడుతుండటంపై అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం ప్లేయర్స్ ఆడుతున్న తీరు చూస్తుంటే గాయాల తప్పవని కూడా కపిల్ అభిప్రాయపడ్డాడు.
బుమ్రా లేకపోవడంపై కపిల్ ఏమన్నాడంటే..
బుమ్రా వెన్ను గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనూ అతడు బౌలింగ్ చేయలేదు. 14 నెలలు టీమ్ కు దూరంగా ఉన్న మహ్మద్ షమి తిరిగి రాగానే.. బుమ్రా గాయంతో దూరమయ్యాడు. ఇలా తరచూ ప్లేయర్స్ గాయాల బారిన పడుతుండటంపై టీమిండియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు.
"ఇప్పటి క్రికెటర్లు ఏడాదికి పది నెలల పాటు క్రికెట్ ఆడుతున్నారు. గాయాలు చాలా సహజంగా మారిపోయాయి" అని కపిల్ అన్నాడు. టాటా స్టీల్ గోల్ఫ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెర్మనీలో కపిల్ మాట్లాడాడు. బుమ్రా లేకపోవడం ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అవకాశాలను ఎలా దెబ్బ తీస్తుందన్నదానిపైనా కపిల్ స్పందించాడు.
"టీమ్ లో లేని ప్లేయర్స్ గురించి మాట్లాడటం ఎందుకు? ఇదొక టీమ్ గేమ్. టీమే గెలవాలి. వ్యక్తులు కాదు. ఇదేదో బ్యాడ్మింటన్, టెన్నిస్ లేదా గోల్ఫ్ కాదు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ స్పోర్ట్ ఆడుతున్నాం. టీమ్ గా ఆడితే కచ్చితంగా గెలుస్తాం" అని కపిల్ అన్నాడు.
యువకుల కాన్ఫిడెన్స్ చాలా బాగుంది
ఏ టీమ్ అయినా జట్టులో కీలకమైన ప్లేయర్స్ దూరం కావాలని కోరుకోదని, ఒకవేళ అలా జరిగితే చేసేదేమీ లేదని కపిల్ దేవ్ అన్నాడు. "ప్రధాన ప్లేయర్స్ గాయపడాలని ఎవరూ కోరుకోరు. కానీ ఇవి జరుగుతాయి.
మనం ఏమీ చేయలేం. ఇండియన్ టీమ్ కు గుడ్ లక్.. బాగా ఆడండి.. యువ ప్లేయర్స్ ను చూస్తుంటే వాళ్ల ఆత్మవిశ్వాసం నమ్మశక్యంగా లేదు. మేము యువకులుగా ఉన్న రోజుల్లో ఇంత ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. టీమ్ కు గుడ్ లక్" అని కపిల్ అన్నాడు.
సంబంధిత కథనం