Champions Trophy: లుంగీలో స్టార్ క్రికెటర్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ట్రెడిషనల్ టచ్ ఇచ్చిన కేన్ మామ.. ఇదిగో వీడియో-kane williamson spotted wearing dhoti new zealand karachi champions trophy traditional wear ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Champions Trophy: లుంగీలో స్టార్ క్రికెటర్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ట్రెడిషనల్ టచ్ ఇచ్చిన కేన్ మామ.. ఇదిగో వీడియో

Champions Trophy: లుంగీలో స్టార్ క్రికెటర్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ట్రెడిషనల్ టచ్ ఇచ్చిన కేన్ మామ.. ఇదిగో వీడియో

Chandu Shanigarapu HT Telugu
Published Feb 17, 2025 04:43 PM IST

Champions Trophy: ఆటతో పాటు వ్యక్తిత్వంతోనూ ఆకట్టుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు కేన్ విలియమ్సన్. కేన్ మామ అని తెలుగు ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ఈ న్యూజిలాండ్ స్టార్ తాజాగా లుంగీ (ధోతి)లో దర్శనమిచ్చాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా లుంగీతో కనిపించిన కేన్ విలియమ్సన్
ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా లుంగీతో కనిపించిన కేన్ విలియమ్సన్ (x/punk1stan)

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ చేరుకున్న న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ లుంగీ (ధోతి) ధరించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరలవుతోంది. కరాచిలోని న్యూజిలాండ్ జట్టు ఉన్న హోటల్లో కేన్ మామ లుంగీ ధరించి కనిపించాడు. విదేశీ క్రికెటర్లు లుంగీ ధరిస్తే వచ్చే మజానే వేరు. ఇక అందులోనూ తెలుగు అభిమానులకు అత్యంత చేరువైన విలియమ్సన్ లుంగీ కట్టుకోవడం వైరల్ గా మారింది.

కేన్ మామ

మైదానంలో ఆటతో పాటు పర్సనాలిటీతోనూ విలియమ్సన్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడే సమయంలో తెలుగు అభిమానులు అతనికి కేన్ మామ అనే ముద్దు పేరు పెట్టారు. ఇటీవల ఇష్టమైన ముద్దు పేరు ఏమిటీ? అని విలియమ్సన్ ను అడిగితే.. అతను ‘కేన్ మామ’ అని జవాబివ్వడం విశేషం.

జోరు మీద న్యూజిలాండ్

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ జట్టు జోరుమీదుంది. ఇటీవల పాకిస్థాన్ లో జరిగిన ముక్కోణపు సిరీస్ లో ఆ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఇక కేన్ మామ కూడా ఫామ్ లో ఉన్నాడు. ఆ ముక్కోణపు టోర్నీలో ఓ సెంచరీ కూడా కొట్టాడు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో కిివీస్ హాట్ ఫేవరెట్ గా బరిలో దిగనుంది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్ తో తలపడనుంది.

టైటిల్ పై కన్ను

2000 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరో ఐసీసీ టోర్నీ గెలవని కివీస్ ఈ కప్ పై కన్నేసింది. పాతికేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలనే లక్ష్యంతో బ్లాక్ క్యాప్స్ ఉంది. 2015, 2019 వన్డే ప్రపంచకప్ లో కివీస్ ఫైనల్లో ఓడిన సంగతి తెలిసిందే. మరి ఈ టోర్నీలోనైనా ఆ జట్టు ఐసీసీ టైటిల్ నిరీక్షణ ముగుస్తుందేమో చూడాలి.

Chandu Shanigarapu

eMail
Whats_app_banner

సంబంధిత కథనం