ఎంఐ టీమ్‌లోకి డేంజ‌ర‌స్ బ్యాట‌ర్ బెయిర్‌స్టో, ప్ర‌మాద‌క‌ర పేస‌ర్ రిచ‌ర్డ్ గ్లీస‌న్‌.. ముంబయి ఇండియన్స్ ప్లాన్ అదిరింది!-jonny bairstow and richard gleeson set to join mumbai indians will replace jacks and rickleton ipl 2025 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఎంఐ టీమ్‌లోకి డేంజ‌ర‌స్ బ్యాట‌ర్ బెయిర్‌స్టో, ప్ర‌మాద‌క‌ర పేస‌ర్ రిచ‌ర్డ్ గ్లీస‌న్‌.. ముంబయి ఇండియన్స్ ప్లాన్ అదిరింది!

ఎంఐ టీమ్‌లోకి డేంజ‌ర‌స్ బ్యాట‌ర్ బెయిర్‌స్టో, ప్ర‌మాద‌క‌ర పేస‌ర్ రిచ‌ర్డ్ గ్లీస‌న్‌.. ముంబయి ఇండియన్స్ ప్లాన్ అదిరింది!

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ చేరితే ముంబయి ఇండియన్స్ అదిరే ప్లాన్ అమలు చేయనుందని తెలిసింది. ఇంగ్లీష్ ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్‌లను తాత్కాలికంగా జట్టులోకి తీసుకునేందుకు ఆ టీమ్ చర్చలు జరుపుతోందని సమాచారం.

జానీ బెయిర్‌స్టో (AFP)

భారత్, పాకిస్థాన్ మధ్య సైనిక ఉద్రిక్తతల కారణంగా ఊహించని విరామం తర్వాత ఐపీఎల్ ఫ్రాంఛైజీలు మళ్లీ పోరుకు సై అంటున్నాయి. శనివారం (మే 17) 2025 సీజన్ తిరిగి ప్రారంభమవుతోంది. ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ చేరితే ముంబయి ఇండియన్స్ టీమ్ లో మార్పులు జరిగే అవకాశముంది. ఇంగ్లాండ్ కు చెందిన డేంజరస్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో, ప్రమాదకర పేసర్ రిచర్డ్ గ్లీసన్ ముంబయి ఇండియన్స్ టీమ్ లో చేరే అవకాశముంది.

ఆ ముగ్గురు దూరం

క్రికెట్ సౌత్ ఆఫ్రికా తమ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జట్టులోని ఆటగాళ్లు సన్నాహాల కోసం మే 30 నాటికి తిరిగి స్వదేశానికి వస్తారని స్పష్టం చేసింది. ఇంగ్లాండ్ కూడా వెస్టిండీస్ తో సిరీస్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ టీమ్ లోని ఇంగ్లాండ్ బ్యాటర్ విల్ జాక్స్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ ర్యాన్ రికిల్టన్, పేసర్ కార్బిన్ బాష్ ప్లేఆఫ్స్ కు దూరమయ్యే అవకాశముంది.

అందుకే ముంబయి ఇండియన్స్ తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంది. ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తే జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్ లను టీమ్ లోకి తీసుకునే ఛాన్స్ ఉంది.

ఎన్ఓసీ కోసం

ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని బెయిర్‌స్టో 2024 జూన్ నుంచి ఇంగ్లాండ్ తరపున ఆడలేదు. క్రిక్ ఇన్ఫో ప్రకారం.. అతను నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఒప్పందం జరిగితే, బెయిర్‌స్టో కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో యార్క్‌షైర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తర్వాత ఎంఐ జట్టులో చేరతాడు. అతను ఒక ఛాంపియన్‌షిప్ గేమ్, రెండు టీ20 బ్లాస్ట్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

ఐపీఎల్ లో ఇలా

ఐపీఎల్ లో బెయిర్‌స్టో.. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తరపున 50 మ్యాచ్‌లు ఆడాడు. అందులో రెండు సెంచరీలు చేశాడు. సగటు 34.54, స్ట్రైక్ రేట్ 144.45గా ఉంది. ముఖ్యంగా రికిల్టన్ వెళ్లిపోతే బెయిర్‌స్టో ఎంఐకి వికెట్ కీపింగ్కూ డా అందిస్తాడు. దక్షిణాఫ్రికా పేసర్ కార్బిన్ బాష్ కూడా మే 27 నాటికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జట్టు కోసం ప్లేఆఫ్స్ ముందే వెళ్లిపోనున్నాడు.

కార్బిన్ బాష్ స్థానాన్ని రిచర్డ్ గ్లీసన్ తో భర్తీ చేయాలని ముంబయి ఇండియన్స్ భావిస్తోంది. అతను గత సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 37 ఏళ్ల గ్లీసన్ ప్రస్తుతం వార్విక్‌షైర్‌తో వైట్-బాల్ కాంట్రాక్ట్‌పై ఉన్నాడు. అతను ఎంఐతో చేరితే టీ20 బ్లాస్ట్ లో తొలి రెండు గేమ్‌లకు దూరమవుతాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎంఐ నాలుగో స్థానంలో ఉంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం