Ravi Shastri: డగౌట్‌లోనే నిద్రపోయిన ఇంగ్లండ్ పేస్ బౌలర్.. ఆ టీమ్ పరిస్థితి అలాగే ఉందంటూ రవిశాస్త్రి కౌంటర్-jofra archer naps in dugout ravi shastri rips apart england team after whitewash against team india ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ravi Shastri: డగౌట్‌లోనే నిద్రపోయిన ఇంగ్లండ్ పేస్ బౌలర్.. ఆ టీమ్ పరిస్థితి అలాగే ఉందంటూ రవిశాస్త్రి కౌంటర్

Ravi Shastri: డగౌట్‌లోనే నిద్రపోయిన ఇంగ్లండ్ పేస్ బౌలర్.. ఆ టీమ్ పరిస్థితి అలాగే ఉందంటూ రవిశాస్త్రి కౌంటర్

Hari Prasad S HT Telugu
Published Feb 12, 2025 09:43 PM IST

Ravi Shastri: ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ డగౌట్ లోనే నిద్రపోయాడు. అది చూసి రవిశాస్త్రి ఇంగ్లండ్ టీమ్ కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఆ టీమ్ టీమిండియా చేతుల్లో 0-3తో వైట్ వాష్ కు గురైన విషయం తెలిసిందే.

డగౌట్‌లోనే నిద్రపోయిన ఇంగ్లండ్ పేస్ బౌలర్.. ఆ టీమ్ పరిస్థితి అలాగే ఉందంటూ రవిశాస్త్రి కౌంటర్
డగౌట్‌లోనే నిద్రపోయిన ఇంగ్లండ్ పేస్ బౌలర్.. ఆ టీమ్ పరిస్థితి అలాగే ఉందంటూ రవిశాస్త్రి కౌంటర్

Ravi Shastri: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. ఇండియా టూర్ ను మరో దారుణమైన ఓటమితో అవమానకరంగా ముగించింది. అయితే మూడో వన్డే సందర్భంగా ఆ టీమ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ డగౌట్ లోనే నిద్రపోవడం చూసి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి దారుణంగా ట్రోల్ చేశాడు.

వన్డే సిరీస్ వైట్ వాష్

టీమిండియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్ లను కోల్పోయిన ఇంగ్లండ్ ఉత్త చేతులతోనే ఇంటిదారి పట్టింది. టీ20 సిరీస్ ను 1-4తో కోల్పోయిన ఆ టీమ్.. వన్డే సిరీస్ ను మరీ దారుణంగా 0-3తో వైట్ వాష్ కు గురవడంతో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆ టీమ్ ను దారుణంగా ట్రోల్ చేశారు. బుధవారం (ఫిబ్రవరి 12) జరిగిన మూడో వన్డేలో ఏకంగా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

డగౌట్ లోనే నిద్రపోయిన జోఫ్రా ఆర్చర్

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మూడో వన్డే సందర్భంగా ఇంగ్లండ్ పేస్ బౌలర్ ఆ టీమ్ డగౌట్ లోనే పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిద్రపోయాడు. ఇది చూసి రవిశాస్త్రి ఆ టీమ్ ను మరింత దారుణంగా ట్రోల్ చేశాడు. ఆ టీమ్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ సందర్భంగా కెమెరాలు ఇంగ్లండ్ డగౌట్ వైపు తిరిగాయి.

ఆ సమయంలో ఆర్చర్ ఓ కునుకు తీస్తూ కనిపించాడు. ఆ సమయంలో రవిశాస్త్రి కామెంటరీ బాక్స్ లో ఉన్నాడు. "నేను ఇంతకుముందే చెప్పాను. మంచిగా నిద్రపోవడానికి ఇదే సరైన సమయం. ఇంగ్లండ్ ఈ టూర్ అలాంటిదే" అని రవిశాస్త్రి అన్నాడు.

ఒకే నెట్ సెషన్‌ చేశారా?

ఇండియా పర్యటన ఇంగ్లండ్ కు పీడకలగా మారింది. మొదట ఐదు టీ20ల సిరీస్ ను ఆ టీమ్ 1-4తో కోల్పోయింది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ లో ఏకంగా వైట్ వాష్ తప్పలేదు. ఇంగ్లండ్ టీమ్ ఇంత దారుణమైన ఆటతీరుపై రవిశాస్త్రి స్పందించాడు. "ఈ మొత్తం టూర్లో ఇంగ్లండ్ ఒకే ఒక నెట్ సెషన్ లో మాత్రమే పాల్గొన్నట్లు నేను విన్నాను. తగిన సంసిద్ధత లేకపోతే మీరు ఏమాత్రం పురోగతి సాధించలేరు" అని రవిశాస్త్రి అన్నాడు.

అటు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా తమ టీమ్ పై మండిపడ్డాడు. మూడో మ్యాచ్ లో జట్టులోకి వచ్చిన టామ్ బాంటన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ బదులు గోల్ఫ్ ఆడినట్లు పీటర్సన్ వెల్లడించాడు. "దుబాయ్ నుంచి ఇక్కడికి 2 గంటల ఫ్లైట్ జర్నీ తర్వాత టామ్ బాంటన్ నిన్న గోల్ఫ్ ఆడాడు. అతడు బ్యాటింగ్ చేయలేదు. అసలు సమస్య ఎక్కడ వస్తోంది. 60కి 1 వికెట్, 80కి రెండు వికెట్లు.. ఆ తర్వాత ఏం జరుగుతోంది? వీళ్లెవరూ స్పిన్ ఆడలేరు. స్పిన్ ఎలా మెరుగ్గా ఆడగలరు?" అని పీటర్సన్ ప్రశ్నించాడు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం